Main Menu

నంద్యాల‌లో జ‌గ‌న్ కి పోటీగా ప‌వ‌న్ ..!

People-to-Pawan-Kalyan-YS-Jagan-to-People-1
Spread the love

నంద్యాల ఉప ఎన్నిక‌లు ఏపీ రాజ‌కీయాల్లో హీటు పెంచుతున్నాయి. దాదాపు అన్ని పార్టీలు నంద్యాల మీదే దృష్టి కేంద్రీక‌రించాయి. ప్ర‌చారంలోనూ, పార్టీలో చేరిక‌ల‌తోనూ వైసీపీ ముందంజ‌లో ఉంది. దానిని అధిగ‌మించ‌డానికి టీడీపీ తీవ్రంగా శ్ర‌మిస్తోంది. దానికి అన్ని ర‌కాల అస్త్రాల‌ను వినియోగిస్తోంది. అందుబాటులో ఉన్న‌వారంద‌రినీ రంగంలో దింపుతోంది. స‌గం క్యాబినెట్ మంత్రులే కాకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఎమ్మెల్యేలు, నేతలంతా మోహ‌రించి నంద్యాల‌ను కైవ‌సం చేసుకోవాల‌ని క‌ష్ట‌ప‌డుతున్నారు. అయినా ఫ‌లితాలు ఆశావాహంగా లేవ‌ని తాజా స‌ర్వేలు చెబుతున్న నేప‌థ్యంలో కొత్త ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అందులో భాగంగా జ‌న‌సేన రంగంలోకి వ‌చ్చింది.

ఉద్దానం పేరుతో ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు రోజుల పొలిటిక‌ల్ సీన్ అంద‌రికీ తెలిసిందే. వైజాగ్ కి చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్లి, ఆత‌ర్వాత విజ‌య‌వాడ‌కు కూడా ప్ర‌త్యేక విమానంలో ప్ర‌యాణాలు చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా నంద్యాల వ్య‌వ‌హారంలో నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రెండు రోజుల్లో త‌న పార్టీ వైఖ‌రి ఎలా ఉంటుంద‌న్న‌ది ఆయ‌న ప్ర‌క‌టిస్తాన‌ని మీడియా ముఖంగా తెలిపారు. దానికి త‌గ్గ‌ట్టుగానే ఆయ‌న త‌న మ‌ద్ధ‌తు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికేన‌ని ప్ర‌క‌టించ‌డానికి రంగం సిద్ధం అయ్యింది. గ‌తం నుంచి పీఆర్పీ నేత‌గా భూమా నాగిరెడ్డి కుటుంబంతో అనుబంధం ఉంద‌ని, తండ్రి చనిపోయిన నేప‌థ్యంలో ఆ కుటుంబానికే అవ‌కాశం ఇవ్వాల‌నే సెంటిమెంట్ ఆధారంగా మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించ‌డానికి జ‌న‌సేన ఏర్పాటు చేసుకుంది. అయితే ఆ విష‌యాన్ని ప్ర‌క‌టించ‌డానికి కూడా స‌మ‌యం తీసుకోవ‌డం వెనుక వ్యూహం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

నంద్యాల‌లో గురువారం సాయంత్రం జ‌గ‌న్ భారీ బ‌హిరంగ‌స‌భ నిర్వ‌హించ‌బోతున్నారు. ఎన్నిక‌ల శంఖారావం పూరించ‌బోతున్నారు. వైసీపీలో కొత్త ఊపు తీసుకురాబోతున్నార‌ని ఆపార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. శిల్పా బ్ర‌ద‌ర్స్ ఏక‌మ‌వుతున్న స‌మ‌యంలో రెట్టించిన ఉత్సాహంతో స‌భ జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం సాగుతోంది. స‌రిగ్గా అలాంటి స‌మ‌యంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న మ‌ద్ధ‌తు టీడీపీకి ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. జ‌గ‌న్ స‌భ జ‌రిగే స‌మ‌యంలోనే జ‌న‌సేన స్పందించ‌డం ద్వారా ప్ర‌చారం విష‌యంలో కాస్త‌యినా జ‌నం దృష్టి మ‌రలించే అవ‌కాశం ఉంటుంది. అలాంటి ప‌క్కా పొలిటిక‌ల్ వ్యూహంతోనే పీకే నిర్ణ‌యం వెల్ల‌డించే అవ‌కాశం క‌నిపిస్తోంది. త‌ద్వారా జ‌గ‌న్ స‌భ ద్వారా వైసీపీకి మ‌రింత మైలేజీ ద‌క్క‌కుండా నేరుగా జ‌గ‌న్ తో ప‌వ‌న్ ఢీ కొట్ట‌బోతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

అంత‌టితో స‌రిపెట్టుకుండా అవ‌స‌ర‌మైన ప‌క్షంలో ఎన్నిక‌ల క్యాంపెయిన్ చివ‌రి ద‌శ‌లో నేరుగా ప్ర‌చారానికి వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని టీడీపీ నేత‌ల అంచ‌నాగా చెబుతున్నారు. ఇప్ప‌టికే బాబు-ప‌వ‌న్ మ‌ధ్య ఈ మేర‌కు చ‌ర్చ‌లు సాగిన‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నంద్యాల‌లో బ‌లిజ‌లు ఓ ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గం. సుమారుగా 28వేల వ‌ర‌కూ ఓట‌ర్లున్నారు. అలాంటి ప్ర‌ధాన వ‌ర్గంలో ప్ర‌భావితం చేయ‌గ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ ద్వారా ప్ర‌యోజ‌నం పొందాల‌ని టీడీపీ వ్యూహ‌క‌ర్త‌ల ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. కానీ వైసీపీకి సానుకూలంగా ఉన్న సామాజిక స‌మీక‌ర‌ణాల‌తో నేరుగా ప‌వ‌న్ ఢీ కొంటే ఆ త‌ర్వాత ప‌రిస్థితులు మ‌రింత చేజారిపోతాయ‌ని ఓ వ‌ర్గం చెబుతోంది. ఉప ఎన్నిక‌ల్లో కూడా చంద్ర‌బాబు, ప‌వ‌న్ అస్త్రాలు ఉప‌యోగించేస్తే రేపు 2019 నాటికి ఏం చేయాల‌నే స‌మ‌స్య వ‌స్తుంద‌ని, ఫ‌లితం తారుమార‌యితే త‌లెత్తుకోలేని స్థితి ఎదుర‌వుతుంద‌నే వాళ్లు కూడా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో నేరుగా బ‌రిలో ఉండాల‌నుకుంటున్న ప‌వ‌న్ ఆలోచ‌న‌లో ఎలాంటి మార్పులుంటాయో చూడాలి. బాబు కోసం త‌న ప‌ర‌ప‌తిని ఆయ‌న ప‌ణంగా పెడ‌తారా అన్న‌ది ఆస‌క్తిదాయ‌క‌మే.


Related News

parliament211

టీడీపీకి అవిశ్వాస చిక్కులు

Spread the loveపార్ల‌మెంట్ లో అవిశ్వాసం రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి. హ‌ఠాత్తుగా కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో అవిశ్వాసంపై చ‌ర్చ‌, ఓటింగ్Read More

BJP-AP

బీజేపీని వీడాల‌నే త‌హ‌త‌హ‌లో…

Spread the loveగ‌డిచిన ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ ఊపు చూసి చాలామంది కాషాయ కండువాలు క‌ప్పుకున్నారు. కానీ ఇప్పుడా పార్టీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *