రాజకీయ పరిపూర్ణం..!

Paripoornananda
Spread the love

తెలుగులో ఇప్పుడు కంచ ఐలయ్య, పరిపూర్ణానంద ఈ రెండు పేర్లే ప్రదానంగా వినిపిస్తున్నాయి. దానికి కారణం వీళ్లిద్దరూ కులం, మతం ఆధారంగా తెరమీదకు వచ్చిన వాళ్లు కావడమే విశేషం. కుల, మతాలు భారతీయ సమాజాన్ని సుదీర్ఘకాలంగా పీడిస్తున్న అతి పెద్ద జాడ్యాలు అనడంలో సందేహం లేదు. అవినీతి పెనుభూతంగా మారినట్టే కులం, మతం కాలం మారుతున్నా మరింత కరుడుగడుతూ మనందరి కొంపు ముంచుతున్నాయి.

వాస్తవానికి సామాన్యులలో చాలామందికి కులం, మతం పట్టింపులుండవు. ఊళ్లలో అందరూ కలిసి మెలిసి సాగుతారు. సన్నిహితంగా పిలుచుకుంటారు. అదే విధంగా పనిలో కూడా కలిసే సాగుతారు. ఈ విషయంలో సామాన్యులే కాదు..తెగబలిసిన వర్గాలు కూడా కులం, మతం పట్టింపులు లేకుండా అన్ని సంబంధాలు కొనసాగిస్తాయి. బడా పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వ పెద్దలు ఎలా లాలూచీపడతారో అందరికీ తెలుసు. బీజేపీకి భారీగా నిధులిస్తున్న సంస్థల్లో ముస్లీంలున్నారు. అదే విధంగా ఆర్ఎస్ఎస్ కి అత్యధిక నిధులు క్రిస్టియన్ దేశాల నుంచే వస్తున్నాయి. దళితుల్లో కూడా ఉన్నత స్థాయి వర్గాలంతా ఇతర కులస్తులతో సంబంధాలు నెరుపుతూ తామంతా ఒకటేనని చాటుకుంటారు.

అదే సమయంలో పెత్తనం చేసేవాళ్లంతా కలిసి మెలిసి సాగుతూ దిగువన మాత్రం జనాలను విడదీయడానికి కులం, మతం ప్రధాన అస్త్రాలుగా వాడుకుంటారు. కులసంఘాలన్నింటికీ నిధులిస్తూ వారిరి రెచ్చగొడతారు. మాల, మాదిగలు కలిసుంటే తన రాజకీయాలు సాగవని భావించిన చంద్రబాబు వర్గీకరణ పేరుతో విడగొట్టిన విషయం అర్థం చేసుకోవాలి. అయినా చంద్రబాబు ఇంట్లో వివాహ వేడుక జరిగితే మంద క్రుష్ణ , కారెం శివాజీ కూడా వెళతారు. కానీ ఎస్సీలుగా పుట్టాలని ఎవరు మాత్రం కోరకుంటారని, ఎస్టీలకు తెలివితేటలుండవని టీడీపీ అధినేత వ్యాఖ్యానిస్తుంటారు. అంటే కుల సంఘాల పెద్దలు కూడా ఇతరులతో స్నేహం చేస్తూ తమ వారిని మాత్రం విడదీసి పాలిస్తుంటారు.

ఆ క్రమంలోనే తాజాగా కంచ ఐలయ్య, పరిపూర్ణానంద వ్యవహారం టీవీ చర్చతో రచ్చ రచ్చ అయ్యింది. ఐలయ్య రాసిన పుస్తకం , దాని ప్రభావాలు పక్కకుపోయాయి. ఇప్పుడు పరిపూర్ణానంద తానో స్వామీజీనని చెప్పుకుంటూ కులాల కుంపట్లను మతం మంటలు రాజేసే పనిలో ఉన్నట్టు పలువురు భావించాల్సి వస్తుంది. చర్చ సాగించలేక మధ్యలో చిత్తగించిన పరిపూర్ణ పరువు పోవడంతో ఇప్పుడాయన తీవ్రంగా మధన పడుతున్నారు. ఏదో ఒకటి చేయాలని తహతహలాడిపోతున్నారు. ఇప్పటికే సొంత టీవీ చానెల్ సాక్షిగా నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. అదే సమయంలో తాను హిందువులందరి ప్రతినిధినని చెప్పుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాజకీయ నాయకుడు ఒక తరగతిని రెచ్చగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో ఇప్పుడు పరిపూర్ణను గమనిస్తే స్పష్టమవుతుంది.

ఇప్పటికే దేశంలో వరుసగా బాబాలు, స్వామీజీల బండారం బయటపడుతోంది. బాంబు పేలుళ్ల నుంచి, హోమో సెక్సువల్స్ వరకూ, డ్రగ్స్ మాఫియా నుంచి రేప్ కేసుల వరకూ అన్నింటిలోనూ దొంగ స్వాముల వ్యవహారం దుమారం రేపుతోంది. ఇప్పుడు పరిపూర్ణానంద వంటి వాళ్లు తాము హిందువులకు ప్రతినిధులుగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న తీరు చూసిన తర్వాత మతానికి ముప్పు ఇలాంటి వాళ్ల వల్లేనని పలువురు భావిస్తున్నారు. వాస్తవానికి ఏ మతానికైనా ఒక్కడి వల్ల ప్రమాదం ఉండదు..ఒకడి వల్ల మతోద్దరణ జరగదు. అలా ఒక్కడి వల్లే అంతా జరిగితే అది అసలు మతమే కాదు. అలాంటిది తాను ఉద్దరిస్తున్నానని, తన వెంట నడవాలని ఇలాంటి వాళ్లు పిలుపునివ్వడం హిందూమత ఔన్నత్యానికే భంగం కలిగించినట్టవుతోంది. వ్యవసాయంలో దళారుల మాదిరిగానే ఆధ్యాత్మికరంగంలో కూడా మధ్యవర్తుల మూలంగానే మతానికి చెడ్డపేరు అనడంలో సందేహం లేదు. సరిగ్గా ఇలాంటి వాళ్ల అసలు గుట్టు అర్థం చేసుకోకపోతే మధ్యలో ఉన్నవాళ్ల మూలంగా హిందూమతం మీద మరో నాలుగు రాళ్లేసే వాళ్లు పెరిగే ప్రమాదం ఉంటుందని గ్రహించాలి.

సొంతంగా చానెల్ పెట్టుకుని తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి ప్రహాసనాలు చేస్తున్న తీరు చూస్తుంటే చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. అంతేగాకుండా టీవీ చర్చల్లో సహనం కోల్పోయి తల్లి గురించి ప్రశ్న వేసిన ఐలయ్య మీద బ్రూట్ అంటూ నోటి దురద ప్రదర్శించడం, పిల్లనిస్తావా అని పదే పదే అడగడం గమనించి ఇలాంటి వాళ్ల స్థాయి బోధపడుతుంది. ఇప్పటికే కాకినాడలోని ఆయన ఆశ్రమం దేవాదాయధర్మాదాయ శాఖకు చెందిన భూమిలో నడుస్తుండడం ఓ వివాదం. దానికితోడు నోటి దురుసుతో మరిన్ని సమస్యలు కొనితెచ్చుకుంటూ మతాన్ని కించపరిచేలా ప్రవర్తన సాగించడం అందరూ గమనిస్తున్నారు. ఆలయాలు కూల్చివేసిన సమయంలో, ఆస్తులు కాజేసిన సదావర్తి వివాదంలో కనీసం నోరు మెదపని పరిపూర్ణ చివరకు ఐలయ్య, కోమట్ల వివాదంలో రెడ్లను ప్రస్తావించి మరో చిచ్చుకు యత్నించినట్టు స్పష్టమవుతోంది. ఐలయ్య లాంటి వాళ్ల రాతలను ఖండించాల్సిన సమయం అందరికీ వచ్చిన నేపథ్యంలో పరిపూర్ణ తీరుతో ఆయనదే పై చేయిగా మారడం గమనార్హం. తద్వారా ఐలయ్యను ఈ అయ్య రక్షించినట్టు అనుమానించాల్సి వస్తోంది.

మొత్తంగా ఈయన తీరు గమనిస్తుంటే త్వరలో రాజకీయ ఆరంగేట్రం చేయడం ఖాయమని భావించవచ్చు. సొంత మీడియా ఉంది, మతం ఆదారంగా జనాలను రెచ్చగొట్టడానికి సిద్ధపడుతున్నారు..ఉద్రేకంగా మాట్లాడుతూ ఎదుటి వారిని కించపరచడానికి సైతం వెనకాడడం లేదు…ఇవన్నీ ఒక మతాచార్యుడి తీరులా లేదు. ఇప్పటికే ఉత్తరాదిలో పలువరు కాషాయం ధింరిచ రాజకీయంగా చక్రం తిప్పుతున్న తరుణంలో ఏపీలో కూడా రాజకీయాల్లో కాషాయం ధరించిన ఈయన రాణించాలని ఆశిస్తుంటే అనుమానించాల్సి వస్తోంది. కథ ఎటైనా తిరిగే అవకాశం ఉంది. ఏమైనా స్వామీజీలతో బహుపరాక్.


Related News

DMjD9f8VQAATMr7

అయినా..బాబు మారలేదు

Spread the loveమనిషి మారలేదు..అతని తనివి తీరలేదు అంటూ సినిమా దర్శకుడు రాసిన పాటను ఇక్కడ గుర్తు చేసుకుంటే చంద్రబాబుRead More

chandrababu-ravanth-reddy-647x450

బాబు ఖాతాలో మరో వికెట్ అంతే…!

Spread the loveతెలంగాణా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సొంత గూటిని వదిలి కాంగ్రెస్ పంచన చేరుతుండడం సంచలనంRead More

 • కేసీఆర్ వ్యూహం..బాబు జాతీయ హోదా గల్లంతు
 • వైసీపీ వ్యూహానికి బుట్టా బలి..
 • చంద్రబాబుకి ఓ ఇంటాయన లేఖ
 • మోడీకి మరో షాక్, దేశద్రోహులకు గ్రీన్ సిగ్నల్
 • కేసీఆర్ తో కేశవ్: కలచివేత ఎవరికి?
 • అమిత్ షా అవినీతికి ఆధారాలివిగో…
 • పవన్ కల్యాణ్ పొజిషన్ ఏంటి?
 • ఇదే మాట మరొకరు అనుంటే..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *