ఒక ఓటమి: జగన్ కి రెండు పాఠాలు

YS Jaganmohan Reddy
Spread the love

వైసీపీకి ఓటమి కొత్త కాదు. గడిచిన ఎన్నికల్లో ఇంతకన్నా ఎక్కువ ఆశించి భంగపడ్డారు. అయినా జగన్ మొండితనంతో ఆపార్టీ త్వరగానే కోలుకున్నట్టు కనిపించింది. మళ్లీ జనం ముందుకు వచ్చి పాలకపక్షంలో కలవరం పుట్టించింది. కానీ తాజాగా నంద్యాలలో పడిన దెబ్బ ఆపార్టీని కొంత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం కనిపిస్తోంది. గత సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈ ఓటమి చిన్నదే అయినప్పటికీ పార్టీ ఊపు మీదకొస్తుందనుకున్న సమయంలో పడిన దెబ్బ కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్టు కనిపిస్తోంది.

వాస్తవానికి వైసీపీకి సాధారణ ఎన్నికల తర్వాత తొలిదెబ్బ గత ఏడాది ఫిరాయింపుల మూలంగా పడింది. అప్పట్లో వైసీపీ పరిస్థితి కొంత ఢోలాయమానంగా కనిపించింది. కానీ మళ్లీ అంతలోనే కోలుకుంటోంది. ఆ క్రమంలోనే నంద్యాల ఉప ఎన్నికల మీద అతి అంచనాలకు వెళ్లింది. అసాధారణంగా తీసుకుంది. ఉప ఎన్నికలను సెమీఫైనల్ గా చెప్పి చేజేతులా సమస్యలు కొనితెచ్చుకుంది. అందుకే ఈసారి కోలుకోవడానికి పెద్దగా సమయం లేదు. ఎదురుదెబ్బకు అధికార పక్షం అస్త్రశస్త్రాలు సిధ్దం చేస్తున్న సమయంలో నంద్యాల ఓటమి జగన్ కి పలు పాఠాలు నేర్పుతుందనే చెప్పవచ్చు. పరిస్థితిలో మార్పు రాకపోతే మరో పరాజయం ఎదుర్కోవాల్సిన ప్రమాదం ఆపార్టీకి తప్పదు.

వాస్తవానికి వైసీపీకి ప్రజల్లో ఆదరణ తప్ప పార్టీకి బలం లేదు. కిందిస్థాయిలో అసలు నిర్మాణమే లేదు. బూత్ స్థాయిలో కాదు కదా కనీసం మండలస్థాయిలో కూడా పక్కా వ్యవస్థ వైసీపీకి లేదు. అనుబంధ సంఘాల గురించ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఓ రాజకీయ పార్టీకి ఉండాల్సిన వ్యవహారలు వైసీపీలో కనిపించవు. దాంతో పార్టీ ఆవిర్భవించి ఏడేళ్లు దాటినా నిర్మాణం లేకపోవడంతో పైన పటారం లోన లొటారం అన్నట్టుగా మారుతోంది. ప్రజలు ఆదరిస్తున్న పార్టీకి పోల్ మేనేజ్ మెంట్ పెద్ద వైఫల్యంగా కనిపిస్తోంది. గడిచిన ఎన్నికల్లో జరిగిందే ఇప్పుడు నంద్యాల అనుభవం కూడా చాటుతోంది. ఓటర్లను బూత్ వరకూ తీసుకెళ్లి, వారిని అక్కడ ప్రభావితం చేయగల వ్యవస్థ లేకుండా చంద్రబాబు ని ఎదుర్కోవడం జగన్ వల్ల సాధ్యమయే పని కాదు. ఇప్పటికే రెండు సార్లు ఈ విషయం స్పష్టమయ్యింది. దానికి కారణం చంద్రబాబుకి సుదీర్ఘకాలంగా పటిష్ట నిర్మాణం ఉండడమే.

ఇక మరో ప్రధానాంశం జగన్ కి వ్యూహాం విషయంలో జాగ్రత్తలు కనిపించడం లేదు. సహజంగా ప్రాంతీయ పార్టీ అంటేనే బలం బలహీనత అధినేత అవుతారు. ఇక్కడ జగన్ కూడా ఆ విషయాన్ని గమనించాల్సి ఉంది. చాలా విషయాల్లో స్వయంగా ఆయనే అన్నింటికీ బాధ్యత తీసుకోవడం ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఇటీవల నంద్యాల ఎన్నికల్లో జగన్ ఓటమికి కాల్పుల కామెంట్స్ కారణమని చాలామంది ఇప్పుడు భావిస్తున్నారు. ఆ ఒక్క మాట మీద కేంద్రీకరించి మీడియా సాయంతో మొత్తం కథను నడపడంలో పాలకపక్షం విజయవంతం కావడంతో జగన్ బాగా బద్నాం అయ్యారని చెబుతున్నారు. అందుకే అలాంటి కామెంట్స్ విషయంలో జగన్ జాగ్రత్తలు పాటించకపోవడమే ముప్పు తెచ్చినట్టు కనిపిస్తోంది. నిజానికి జగన్ కన్నా మించి టీడీపీ నేతలు చాలామంది వ్యాఖ్యాలున్నాయి. కానీ అవన్నీ చంద్రబాబు కాకుండా తన అనుచరులతో చెప్పిస్తూ ఆయన మాత్రం చోద్యం చూస్తున్నట్టు కనిపిస్తున్నారు.

తద్వారా జగన్ వ్యక్తిత్వం మీద గురిపెట్టిన టీడీపీ చేతిలో చిక్కిన జగన్ చివరకు చతికిలపడక తప్పడం లేదు. ఈ విషయాల్లో జాగ్రత్తలు అత్యవసరం. పార్టీ ని సరిదిద్దుకోవడం చాలా అవసరం. కేవలం నాయకుడే అహర్నిశలు, ఎండనకా, వాననకా తిరిగితే చివరకు జ్వరం వస్తుంది, జనంలో జాలి కలుగుతుంది గానీ పార్టీ ముందుకెళ్లదని ఇప్పటికే నిరూపితం అయ్యింది. పార్టీ వ్యవహారాలు సరిదిద్దకుండా , వ్యూహాల అమలులో జాగ్రత్తలు పాటించకుండా ఇదే పద్ధతిలో సాగితే ప్రశాంత్ కిషోర్ వంటి వాళ్లు ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. ప్రచారానికి ప్రశాంత్ కిషోర్ తప్ప ప్రజావ్యతిరేకత సొమ్ము చేసుకునే పద్ధతులను జగన్ చాకచక్యతతో ఒడిసిపట్టుకోవాల్సిందే. లేకుంటే ఇక్కట్లలో కొట్టిమిట్టాడాల్సి వస్తుందని గ్రహించాలి.


Related News

pk jagan

పీకే రిపోర్ట్స్ తో జగన్ కి ఝలక్

Spread the love2Sharesవరుస పరిణామాల తర్వాత కూడా వైఎస్ జగన్ పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనిపించడం లేదు. కీలకనేతలను కూడా చేజార్చుకునేRead More

flights

అవినీతి ఊబిలో మోడీ సర్కార్

Spread the love231Sharesమోడీ సర్కారు మరో వ్యవహారంలో కూరుకుపోతోంది. ఈసారి ఏకంగా అవినీతి ఊబిలో చిక్కుకోవడంతో ఆ పార్టీని కలవరపరుస్తోంది.Read More

 • కార్యాచరణపై ఆలోచనలో జనసేన
 • ఒక చిత్రం రేపిన దుమారం
 • బీజేపీకి మరో దెబ్బ
 • జగన్ యాత్రలో కొత్త మలుపు…!
 • మరో రాజకీయ పార్టీ ఆలోచనలో ముద్రగడ
 • జగన్ లో ఎందుకీ మార్పు..?
 • చంద్రబాబు సామర్థ్యం మరచిపోయిన సమాజం..
 • చంద్రబాబుని ఆదర్శంగా తీసుకున్న జగన్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *