Main Menu

నంద్యాలలో గెలిచేదెవరు?: ఎగ్జిట్ పోల్

nandyala
Spread the love

నంద్యాల ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాలకు కీలకంగా మారాయి. కేవలం ఒక్క నియోజకవర్గానికే పరిమితం అయిన ఎన్నికలే అయినప్పటికీ ఏపీలో రెండు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ హోరాహోరీగా సాగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు మోహరించడమే కాకుండా సీఎం కూడా పలుమార్లు నంద్యాలలో పర్యటించి వేడి రాజేశారు. ఇఫ్తార్ విందులతో నడిచిన రాజకీయాలు, విస్తరణతో మొదలయిన అభివ్రుద్ధి ఫలాలు అన్నీ ఫలిస్తాయని అధికార పార్టీ ఫలించింది. అయితే అనుకూల సామాజికవర్గాలు, ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండడంతో ఎదురుదాడితో వైసీపీ తన వ్యూహాలకు పదును పెట్టింది. నేరుగా శిల్పా, భూమాల వైరంగా కనిపించే నంద్యాల ఈసారి చంద్రబాబు, జగన్ భవిష్యత్తుని నిర్దేశించే స్థాయికి చేరిపోయాయి.

ఈ నేపథ్యంలో ఫలితాల మీద పలు సర్వేలు వచ్చాయి. అప్ డేట్ ఏపీ కూడా గతంలో నోటిఫికేషన్ రాకముందు ఓ సర్వే ప్రకటించింది. దాని ప్రకారం వైసీపీకి మొగ్గు ఉంది. టీడీపీ కన్నా సుమారు 2శాతం ఆధిక్యం ఆనాటికి కనిపించింది. జూలై మధ్యలో అప్ డేట్ ఏపీ ఆ సర్వేని పాఠకులకు అందించింది. ఇక తాజాగా ప్రచార తీరు, పోలింగ్ సరళి, ప్రజా స్పందన, ఓటర్ల మనోగతం గమనంలో ఉంచుకుని ఎగ్జిట్ పోల్ అందించే ప్రయత్నం చేస్తోంది.

నంద్యాల ఉప ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు స్పందించడం వెనుక కారణాలపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. కానీ వాస్తవంగా గడిచిన 2014 ఎన్నికల కంటే సుమారు 10శాతం పైబడి ఓటర్లు స్పందించడం విశేషం. 1971 తర్వత 80శాతం దాటిన ఎన్నికలు ఇవే కావడం విశేషం. అది కూడా ఉప ఎన్నికల్లో ఆ స్థాయిలో ఓటర్లు తరలిరావడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనంగా కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు నంద్యాలకు చేసిన అభివ్రుద్ధి వైసీపీ పోటీ పెట్టడం వల్లనేననే వాదన బలంగా జనంలోకి వెళ్లింది. వైసీపీ లేకపోతే నంద్యాలకు అమాత్రం నిధులు కూడా కేటాయించరని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాల బాధ్యత తనదేనని, పులివెందుల మాదిరిగా చూస్తానని జగన్ పదే పదే చెప్పడం నంద్యాల వాసుల్లో చంద్రబాబు మీద వ్యతిరేకత పెరగడానికి కారణం అయ్యింది.

ఇక సామాజికవర్గాల వారీగా సహజంగా బాబు వెంట ఉండాల్సిన బలిజలు దూరం కావడం ఈ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారింది. రెడ్లలో జగన్ కి మరింత ఆదరణ పెంచడానికి టీడీపీ మంత్రులుగా ఉన్న ఫిరాయింపుదారుల శ్రమ తోడ్పడింది. మైనార్టీలలో కొంత ఓట్ల చీలిక తీసుకురావడంతో టీడీపీ ప్రయత్నాలు ఫలించాయి. కాంగ్రెస్ కూడా కొంత గండికొట్టింది. దాంతో మైనార్టీలలో వైసీపీ ఆశలు పండలేదు. వైశ్యుల్లో వైసీపీకి పట్టు పెరిగింది. ఎస్సీలు దాదాపుగా వైసీపీని ఆదరించడం కలిసొచ్చింది.

అదే సమయంలో వైసీపీ వ్యూహాల లోపంతో కొన్ని విభాగాలు, ప్రధానంగా పట్టణంలో రావాల్సినంత మైలేజీ రాలేదు. గత ఎన్నికల్లో కేవలం 150 ఓట్లు మాత్రమే మెజార్టీ సాధించిన ప్రాంతంలో ఈసారి భారీ ఆధిక్యం సాధించే అవకాశాలను జగన్ తీరు, శిల్పా వైఖరి కారణంగా కొంత తగ్గిందని తెలుస్తోంది. గోస్పాడు మండలంలో కూడా ఆఖరి నిమిషంలో పట్టు నిలుపుకోవడంతో కొంత తడబబడింది. కానీ చివరకు సమర్థవంతంగానే సాగడంతో సమస్యలు తప్పాయి. ఇక యువతలో వైసీపీకి ఆదరణ పెరిగింది. మహిళల్లోనూ వైసీపీకి మొగ్గు కనిపించడంతో భారీ సంఖ్యలో కదిలిరావడం వైసీపీ ఆధిక్యానికి దారితీసింది.

ఇక టీడీపీకి అభ్యర్థి పెద్ద బలహీనతగా మారారు. సెంటిమెంట్ కలిసి వచ్చిన దాఖలాలు లేవు. సమన్వయలోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రజావ్యతిరేకతకు ఇవన్నీ తోడు కావడంతో గట్టెక్కడం కష్టం అయ్యింది. భారీగా నోట్లు పంచినా ఫలితం దక్కడం కష్టం అయ్యింది. దాంతో అప్ డేట్ ఏపీ అంచనాల ప్రకారం నంద్యాల ఎన్నికల్లో ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఆపార్టీ అభ్యర్థి శిల్పాను గెలిపించబోతున్నారు. ఈ నెల 28న ఈవీఎంలు తెరిచిన తర్వాత అసలు లెక్కలు బయటపడతాయి. కానీ అంచనాల ప్రకారం కనీసంగా 7వేల మెజార్టీ రావచ్చని, నంద్యాల పట్టణంలో సానుకూలతను సొమ్ము చేసుకుని ఉంటే అది మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.


Related News

ysrcp-party-flag-647x450

వైసీపీ సిట్టింగుల‌లో గెలిచేదెవ‌రు?

Spread the love13Sharesఎన్నిక‌ల వాతావ‌ర‌ణం స‌మీపిస్తోంది. మ‌రోసారి ముంద‌స్తు చ‌ర్చ మొద‌లుకావ‌డంతో అంద‌రి దృష్టి నియోజ‌క‌వ‌ర్గాల మీద ప‌డుతోంది. తాజాగాRead More

narendra-modi-chandrababu-ys-jagan-pawan-kalyan-671-1521125657

మోడీతో మేలు ఎవ‌రికి? కీడు ఎవ‌రికి?

Spread the love6Sharesఅనూహ్య నిర్ణ‌యాల‌కు పెట్టింది పేరు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ. ఆఖ‌రికి దేశాన్నంతా అతలాకుత‌లం చేసేని నోట్ల ర‌ద్దుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *