Main Menu

మ‌రో మెగాబ్ర‌ద‌ర్ పొలిటిక‌ల్ ఎంట్రీ క్లియ‌ర్

Spread the love

మెగాస్టార్ చిరంజీవి సినిమా రంగంలో చ‌రిత్ర సృష్టించారు. ఆయ‌న్ని అనుస‌రిస్తూ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌వ‌ర్ స్టార్ గా మంచి ఇమేజ్ సాధించ‌గా, నాగేంద్ర‌బాబు బుల్లితెర మీద రాణిస్తున్నారు. అదే క్ర‌మంలో రాజ‌కీయాల్లో కూడా చిరంజీవి ప్ర‌జారాజ్యం స్థాపించ‌గా, ప‌వ‌న్ ఆ వెంట‌నే యువ‌రాజ్యాధినేత‌గా వ్య‌వ‌హ‌రించారు. నాగేంద్ర‌బాబు మాత్రం తెర‌వెనుక వ్య‌వ‌హారాల‌కు ప్రాధాన్య‌త‌నిచ్చారు. పార్టీ వ్య‌వ‌హారాళ్లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ప్ప‌టికీ కేవ‌లం త‌న ప‌రిధిలో మాత్ర‌మే క‌నిపించేవారు.

ఇక ఆ త‌ర్వాత మారిన రాజ‌కీయాలతో చిరంజీవి తెర‌మ‌రుగు కాగా, జ‌న‌సేన‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముందుకొచ్చారు. అయితే ఈసారి మాత్రం నాగేంద్ర బాబు కేవ‌లం తెర‌వెనుక వ్య‌వ‌హారాల‌తో స‌రిపెట్టుకోకుండా పొలిటిక‌ల్ గా యాక్టివ్ కావాల‌ని ఆశిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే తాజాగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ముందుకొచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబును బాలయ్య బాబు గురించి అడగగా.. ఆయన వెంటనే బాలయ్య బాబు ఎవరు? ఆ పేరు ఎప్పుడూ వినలేదే! అనేశారు. ఆ తర్వాత వెంటనే సీనియర్ నటుడు బాలయ్య అయితే తెలుసు తప్ప నందమూరి బాలకృష్ణ తనకు తెలియదని చెప్పారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో కాక రేపుతున్నాయి. సీనియ‌ర్ హీరో ప‌ట్ల నాగేంద్ర‌బాబు స్పంద‌న‌ను రాజ‌కీయ కోణంలోనే చూస్తున్నారు.

అదే స‌మ‌యంలో గ‌తంలో కేఏ పాల్, ఇప్పుడు నాగబాబు ఇలా మాట్లాడటం బాలయ్య అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తోందని తెలుస్తోంది. దీంతో బాలయ్య బాబు మీకు తెలియదా? అంటూ ఆయన అభిమానులు మెగా బ్రదర్‌పై మండి పడుతున్నారు.

అయితే నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలకు ఓ కారణం ఉందని అంటున్నారు కొందరు. గతంలో ఓ సారి బాలకృష్ణ.. ఓ సందర్భంలో తనకు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని చెప్పారు. అప్పట్లో ఇది పెద్ద సెన్సేషనే అయింది. పవన్ అభిమానుల్లో నిరాశను నింపింది. దీంతో దానికి సెటైర్ వేయాలనే ఉద్దేశ్యంతోనే నాగబాబు ఇలా అని ఉంటాడని చెప్పుకుంటున్నారు జనం. అదే స‌మ‌యంలో నాగేంద్ర‌బాబు గ‌త కొంత‌కాలంగా రాజ‌కీయాల ప‌ట్ల ఆస‌క్తితో ఉన్నారు. ఓ సంద‌ర్భంలో వైసీపీ వైపు మ‌ళ్లేందుకు ఆస‌క్తి చూపారు. అయితే కుటుంబం నుంచి ఒత్తిడి రావ‌డంతో ఆయ‌న వెన‌క్కి త‌గ్గారు. ఇక త్వ‌ర‌లో జ‌న‌సేన‌లో ఆయ‌న ఎంట్రీ, అదే విధంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ కూడా ఖాయ‌మేన‌ని అంతా భావిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఇటీవ‌ల నాగేంద్ర‌బాబు మాట‌లు కూడా ఉండ‌డం విశేషంగా క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామాలు మెగా అభిమానుల్లో ఆసక్తి రాజేస్తుండ‌గా రాజ‌కీయ ప‌రిశీల‌కుల్లో మాత్రం భిన్న‌వాద‌న‌లు వినిపిస్తున్నాయి.


Related News

ప్రశ్నార్థ‌కంగా ప‌వ‌న్ ప‌య‌నం?

Spread the loveరాజ‌కీయాలు శాశ్వ‌తం కాదు. రాజ‌కీయాల్లో శ‌త్రువులు, మిత్రులు కూడా శాశ్వ‌తంగా ఉండ‌రు. కానీ గ‌త ఏడాది మార్చిలోRead More

ష‌ర్మిళ మ‌ళ్లీ ఎందుకు బ‌య‌ట‌కొచ్చారు

Spread the loveవైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ సోద‌రి మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చారు. ఈసారి త‌న వ్య‌క్తిత్వం మీద జ‌రుగుతున్నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *