Main Menu

చంద్ర‌బాబు సీనియారిటీపై మోడీ సెటైర్లు

Spread the love

ఏపీ బీజేపీ శాఖ నిర్మించిన ప్ర‌జా చైత‌న్య స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి మోడీ ప్ర‌సంగించారు. అక్ష‌ర‌క్ర‌మంలో, అన్ని అంశాల‌లో ప్ర‌ధ‌ములైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు.. క‌వికోకిల గుర్రం జాషూవా. మ‌హాక‌వి తిక్క‌న్న జ‌న్మించిన గుంటూరు ప్ర‌జ‌ల‌కు న‌మ‌స్కారం అంటూ మోడీ త‌న ఉప‌న్యాసం తెలుగులో ప్రారంభించారు. వావిలాల గోపాల‌కృష్ణ‌, నాయుడ‌మ్మ‌ల‌ను మోడీ గుర్తు చేశారు.

ఎంతో చ‌రిత్ర ఉంద‌నే కార‌ణంగా ఆధ్యాత్మిక‌ కేంద్రంగా ఉన్న అమ‌రావ‌తిని హెరిటేజ్ సిటీగా ప్ర‌క‌టించింద‌ని తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ ఓట‌ర్లు పెద్ద సంఖ్య‌లో ఓట్లు వేయ‌బోతున్నార‌న్నారు. అంద‌రూ ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌ని మోడీ కోరారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశంలో ఆంద్ర‌ప్ర‌దేశ్ కి ప్ర‌త్యేక స్థానం ఉంది. పెట్రో రంగంలో వేల కోట్ల పెట్టుబడుల‌కు శంకుస్థాప‌న చేశామ‌న్నారు. ఇది దేశ ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా ఉంద‌న్నారు. దేశంలో క్లిష్ట ప‌రిస్థితుల‌ను అధిగ‌మించేందుకు పెట్రో రిజ‌ర్వు సిద్ధం చేయ‌డానికి ఇది ఎంతో కీల‌కం కాబోతోంద‌న్నారు. ఆయిల్ రిజ‌ర్వ్ కేంద్రాన్ని విశాఖ‌లో నిర్మించ‌బోతున్నామ‌న్నారు.

దేశాభివృద్ధిలో కేజీ బేసిన్ కి ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంద‌ని. కృష్ణ‌ప‌ట్నంలో బీపీసీఎల్ టెర్మిన‌ల్ నిర్మించ‌బోతున్నామ‌న్నారు. ఈ ప‌థ‌కాల ద్వారా ఇంధ‌న రంగంలో ప్ర‌యోనాలే కాకుండా యువ‌త‌కు పెద్ద సంఖ్య‌లో ఉపాధి ద‌క్కుతుంద‌న్నారు. దేశంలో అనేక గ్రామాల్లో పైప్ లైన్ ద్వారా ప్ర‌జ‌ల‌కు గ్యాస్ అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. గ్యాస్ ఆధారిత అభివృద్ధి కార‌ణంగా దేశంలో పేద‌రికం నివార‌ణ జ‌రుగుతుంద‌న్నారు. దేశ‌వ్యాప్తంగా అంద‌రికీ ఎల్పీజీ క‌నెక్ష‌న్లు మంజురు చేశామ‌న్నారు. గ‌డిచిన 70ఏళ్ల‌లో 12 కోట్ల కొత్త గ్యాస్ క‌నెక్ష‌న్లు ఇస్తే, గ‌డిచిన కొద్దికాలంలో 13 కోట్ల గ్యాస్ క‌నెక్ష‌న్లు అందించామ‌న్నారు. ద‌ళితులు, గిరిజ‌నుల‌కు ఉచితంగా గ్యాస్ క‌నెక్ష‌న్లు ఇస్తున్నామ‌న్నారు. ఉజ్వ‌ల ప‌థ‌కంలో 5.7 కోట్ల క‌నెక్ష‌న్లు ఇచ్చామ‌న్నారు.

దేశ‌మంతా అభివృద్ధి జ‌రుగుతుంటే విప‌క్షాలు అబ‌ద్ధాల ప్ర‌చారం సాగిస్తున్నారంటూ మోడీ మండిప‌డ్డారు. అప‌విత్ర క‌ల‌యిక‌లో చంద్ర‌బాబు కూడా చేరి, న‌న్ను విమ‌ర్శించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. యూ ట‌ర్న్ తీసుకున్న చంద్ర‌బాబు అంటూ విమ‌ర్శించారు. అమ‌రావ‌తి పునర్నిర్మాణం పేరుతో త‌న త‌న పార్టీ నిర్మాణంలో మునిగిపోయాడి వ్యాఖ్యానించారు. స‌న్ రైజ్ పేరుతో త‌న సొంత స‌న్ రైజ్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని ఆరోపించారు.

చంద్ర‌బాబు చెబుతున్న‌ట్టు ప‌థ‌కాల‌న్నీ కేంద్రం రూపొందించిన‌వేన‌ని గుర్తు చేశారు. వాటికి స్టిక్క‌ర్లు వేసుకుని ప్ర‌చారం చేసుకుంటున్నారు. తాను చాలా అనుభ‌వం ఉన్న‌వాడిన‌ని చెప్పుకుంటున్నార‌ని, త‌న క‌న్నా సీనియ‌ర్ న‌ని చెప్పుకుంటూ కాల‌యాప‌న చేస్తున్నార‌ని అన్నారు. చంద్ర‌బాబు సినీయ‌ర్ గా గౌర‌వం ఇచ్చాన‌ని కానీ ఆయ‌న పార్టీ ఫిరాయింపుల‌లో సీనియ‌ర్లు. కూట‌ములు మార్చ‌డంలో సీనియ‌ర్లు అని మండిప‌డ్డారు. మామ‌ను వెన్నుపోటు రాజ‌కీయాల్లో కూడా సీనియ‌ర్లు అన్నారు. ఒక్కో ఎన్నిక‌ల్లో ఓడిపోతుండ‌లో కూడా సీనియ‌ర్లని, తాను మాత్రం అంత సీనియ‌ర్ కాద‌ని మోడీ వ్యాఖ్యానించారు. ఈరోజు విమ‌ర్శించిన వారితో రేపు ఒళ్లో కూర్చోవ‌డంలో సీనియ‌ర్ అని , ఏపీ ప్ర‌జ‌ల ఆశ‌లు నీరుగార్చ‌డంలో సీనియ‌ర్ అంటూ సెటైర్లు విసిరారు.

ఎన్టీఆర్ గౌర‌వాన్ని టీడీపీ దెబ్బ‌తీస్తోంద‌న్నారు. ఎన్టీఆర్ ఎవ‌రి మీద పోరాడారో వారితోనే చంద్ర‌బాబు జత‌గ‌ట్టార‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ ముక్త్ కోసం ఎన్టీఆర్ పార్టీ పెడితే గ‌తాన్ని మ‌ర‌చి చంద్ర‌బాబుతో కాంగ్రెస్ తో జ‌త‌గ‌ట్టార‌ని వ్యాఖ్యానించారు. వంశ‌పారంప‌ర్య పార్టీలో ఎన్టీఆర్ కి జ‌రిగిన అవ‌మానం ఏపీ ప్ర‌జ‌లంద‌రికీ తెలుసన్నారు. లోకేశ్ తండ్రి చెబుతున్న అబ‌ద్ధాలు అంద‌రికీ వివ‌రించ‌డానికే తాను గుంటూరు వ‌చ్చానంటూ చెప్పుకొచ్చారు. చంద్ర‌బాబు ఎన్న‌డూ అధికారంలో ఉండి ఎన్నిక‌ల్లో గెలిచిన దాఖ‌లాలు లేవ‌న్నారు. త‌న కుమారుడి రాజ్య‌కాంక్ష తీర్చ‌డం కోస‌మే చంద్ర‌బాబు ప్ర‌య‌త్న‌మ‌ని మండిప‌డ్డారు. మూడోది చంద్ర‌బాబు ఆస్తులు ఎలా పెరిగాయో అంటూ గుర్తు చేశారు. దేశానికి నిజాయితీగా కాప‌లాదారుడిగా ఉండ‌డం చంద్ర‌బాబు స‌హించ‌లేక‌పోతున్నార‌న్నారు. నిద్ర ప‌ట్ట‌డం లేద‌ని , భ‌య‌ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానించారు.

కేంద్రం అందించిన ప‌థ‌కాల‌కు లెక్క‌లు అడిగితే చంద్ర‌బాబుకి అల‌వాటు లేన‌ట్టుంద‌ని వ్యాఖ్యానించారు. త‌మ పార్టీ కార్య‌క్ర‌మం త‌మ కార్య‌క‌ర్త‌ల స‌హాయంతో నిర్వ‌హిస్తున్నామ‌ని, కానీ చంద్ర‌బాబు మాత్రం త‌న వ్య‌వ‌హారాల‌కు ప్ర‌భుత్వ సొమ్ము వినియోగిస్తోంద‌ని విమ‌ర్శించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఈ విష‌యం అర్థం చేసుకోవాల‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ నిధుల‌ను సొంత ఖ‌ర్చుల కోసం వినియోగిస్తున్న తీరు మీద స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లి ఫోటోలు తీసుకోవ‌డానికి వెళుతున్న టీడీపీ నేత‌ల‌ను నిల‌దీయాల‌ని కోరారు. మీరు అంటున్న‌ట్టు మ‌ళ్లీ గో బ్యాక్ వెళుతున్నాను. మ‌రోసారి అధికారంలోకి రాబోతున్నానంటూ ధీమా వ్య‌క్తం చేశారు. కోట్ల మంది ప్ర‌జ‌ల ఆశీర్వాదులు నాకున్నాయంటూ మోడీ చెప్పుకొచ్చారు. అమ‌రావ‌తి నుంచి పోల‌వ‌రం వ‌ర‌కూ అన్నింటిలోనూ ప్ర‌శ్నించ‌డాన్ని లోకేశ్ తండ్రి స‌హించ‌లేక‌పోతున్నార‌ని మోడీ విమ‌ర్శించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి తాము ప్ర‌త్యేక ప్యాకేజ్ ఇచ్చామ‌న్నారు. దానిని ఏపీ సీఎం స్వాగ‌తించారు ధ‌న్య‌వాదాలు చెబుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. కానీ యూటర్న్ తీసుకుని మాట మారుస్తున్నార‌ని మండిప‌డ్డారు. గ‌డిచిన ఐదేళ్ల‌లో ఏపీకి ఎన్నో ప‌థ‌కాలు అందించామంటూ వాటిని వివ‌రించారు.తండ్రీ, కొడుకుల అవినీతికి ముగింపు ప‌లక‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేస్తూ జై ఆంధ్రా అనే నినాదాల‌తో ముగించారు.


Related News

బాబుని కేసీఆర్ మాత్ర‌మే కాపాడాలి..!

Spread the loveఏపీలో తెలుగుదేశం రూటు మార్చింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే టీడీపీ అధినేత‌తో పాటు పార్టీ శ్రేణుల ధోర‌ణి మారుతోంది.Read More

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the loveతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *