జ‌గ‌న్ పార్టీలోకి జంపింగ్ లు షురూ!

ysjagan-padayatra
Spread the love

ఏపీలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. పార్టీల‌న్నీ స‌న్నాహాల్లో ఉన్నాయి. ఓవైపు హోదా ఉద్య‌మంలో బిజీగా గ‌డుపుతూనే మ‌రోవైపు సొంత ఇంటిని చ‌క్క‌దిద్దుకోవ‌డంపై కూడా దృష్టిపెట్టాయి. అందుకు త‌గ్గ‌ట్టుగా నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప‌రిస్థితిని త‌మ‌కు సానుకూలంగా మ‌ల‌చుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో జ‌గ‌న్ త‌ల‌మున‌క‌లై ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను అభ్య‌ర్థుల విష‌యంలో ముంద‌స్తుగా సిద్ధం చేసుకోవాల‌నే ల‌క్ష్యంతో ఉన్నట్టు చెబుతున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగా ఇత‌ర పార్టీల నుంచి చేర‌డానికి సంకేతాలు ఇచ్చిన వారిని వెంట‌నే చేరాల‌ని సూచించిన‌ట్టు క‌నిపిస్తోంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో పాద‌యాత్ర ప్రారంభించిన నాటి నుంచి గోదావ‌రి జిల్లాల్లో యాత్ర ముగిసే లోగా ప‌లువురు కీల‌క నేత‌ల‌కు ముహూర్తాలు సిద్ధం చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్టు చెబుతున్నారు. ఏపీలో అధికారం సాదించాలంటే ఈ మూడు జిల్లాలే కీల‌కం అని జ‌గ‌న్ నిర్ధారించుకున్నారు. గ‌త ఎన్నిక‌ల నాటి అనుభ‌వాల‌తో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

అదే స‌మ‌యంలో గ‌డిచిన రెండు నెల‌లుగా ఏపీలో తెలుగుదేశం గ్రాఫ్ ప‌డిపోతోంద‌నే అంచ‌నాల‌తో వైసీపీ వైపు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే కొంద‌రు కీల‌క నేత‌ల‌ను పార్టీలో చేర్చుకోవ‌డం ద్వారా నైతికంగా మ‌రింత ప‌ట్టు సాధించే యోచ‌న‌లో జ‌గ‌న్ శిబిరం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. గ‌డిచిన రెండేళ్లుగా ఊగిస‌లాట‌లో ఉన్న చాలామంది నేత‌ల‌కు జ‌గ‌న్ క్యాంప్ నుంచి ఇప్ప‌టికే సంకేతాలు అందిన‌ట్టు చెబుతున్నారు. స‌మ‌యం మించి పోయిన త‌ర్వాత పార్టీలో చేరిన‌ప్ప‌టికీ సీటు గ్యారంటీ ఉండ‌దు కాబ‌ట్టి రాబోయే నెల‌న్న‌ర రోజుల్లోనే నిర్ణ‌యం తీసుకోవాల‌ని తేల్చిచెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో టీడీపీ నుంచి కూడా ఐదుగురు ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఒక‌రు గుంటూరు జిల్లా నుంచి మరొక‌రు తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి ఉన్న‌ట్టు స‌మాచారం. తూగో జిల్లాకు చెందిన మ‌రో ఎంపీ కూడా జ‌గ‌న్ పార్టీలో చేర‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్టు లీకులు వ‌స్తున్నాయి. వారికితోడుగా భారీ సంఖ్య‌లో మాజీలుంటార‌ని చెబుతున్నారు.

ఇలాంటి నేత‌లంతా చేరిక విష‌యంలో వీల‌యినంత త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని వైసీపీ నేత‌లు ఒత్తిడి పెంచుతున్న‌ట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ముమ్మిడివ‌రం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్ ఈనెల 19న జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీ కండువా క‌ప్పుకోబోతున్న‌ట్టు నిర్ధారించారు. ఆయ‌న‌కు తోడుగా అదే జిల్లాకు చెందిన వంగా గీత కూడా క్లియ‌రెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన హ‌రిరామ‌జోగ‌య్య త‌న‌యుడు కూడా వైసీపీ గూటికి చేర‌డం ఖాయం అయ్యింది. మ‌రికొంద‌రు నేత‌లు కూడా అందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. అయితే కీల‌క‌నేత‌లు కొంద‌రు త‌మ స‌న్న‌ద్ధ‌త ప్ర‌క‌టించాల‌ని వైసీపీ ఆశిస్తోంది. అలాంటి వారిలో ఎవ‌రెవ‌రు ఖాయం అవుతార‌న్న‌ది త్వ‌ర‌లో తేల‌బోతోంది.






Related News

tv9 srini raju

రాజ‌కీయ రంగంలో టీవీ9 యాజ‌మాన్యం

Spread the loveటీవీ9 చానెల్. తెలుగులో పేరెన్నిక‌గ‌న్న చానెల్. న్యూస్ చానెళ్ల విభాగంలో టాప్ ప్లేస్ లో నిలుస్తుంది. అందుకుRead More

9173_ysrcp-3

వైసీపీది వాపా?..బ‌ల‌మా??

Spread the loveవైసీపీలో ఊహించ‌ని ప‌రిణామాలు సాగుతున్నాయి. కొత్త ఊపు క‌నిపిస్తోంది. హోదా ఉద్య‌మం, బాబు యూ ట‌ర్న్ వ్య‌వ‌హారంRead More

  • ఏపీలో ఒంట‌రిగా మిగిలిన టీడీపీ!
  • టీడీపీ ఏం చెప్పుకోవాలి…?
  • బాబు బ‌లం మీద దెబ్బ కొడుతున్నారు..
  • బాబు కొత్త బంధం: ఆపార్టీతో టీడీపీ పొత్తు!
  • జ‌గ‌న్ పార్టీలోకి జంపింగ్ లు షురూ!
  • పవన్ కి పరిష్కారం అతడే..
  • ఆ ఇద్ద‌రూ త‌ప్ప..అంద‌రితోనూ అంటున్న టీడీపీ
  • పవన్ సీన్ మార్చేస్తారా…?
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *