Main Menu

లేటెస్ట్ స‌ర్వే: పెరిగిన జ‌గ‌న్ గ్రాఫ్

Spread the love

ఏపీ రాజ‌కీయాల్లో విప‌క్ష హ‌వా పెరుగుతోంది. గ‌త రెండు మూడు నెల‌ల్లో కూడా జ‌గ‌న్ కి ఆద‌ర‌ణ పెరుగుతున్న‌ట్టు తాజా స‌ర్వేలు చాటుతున్నాయి. ఇండియా టుడే సంస్థ వెలువ‌రించిన స‌ర్వే ప్ర‌కారం ఏపీలో జ‌గ‌న్ కి , చంద్ర‌బాబు కి మ‌ధ్య గ్యాప్ మ‌రింత పెరుగుతోంది. గ‌త సెప్టెంబ‌ర్ తో పోలిస్తే జ‌గ‌న్ కి రెండు శాతం అద‌న‌పు మ‌ద్ధ‌తు ల‌భించింది. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబుకి రెండు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ఒక శాతం మ‌ద్ధ‌తు త‌గ్గిన‌ట్టు స‌ర్వేలో స్ప‌ష్ట‌మ‌య్యింది.

ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సంక్షేమ ప‌థ‌కాల వెల్లువ క‌నిపిస్తోంది. టీడీపీ ప్ర‌భుత్వం తాయిలాల ప‌రంప‌ర కొన‌సాగిస్తోంది. అవి త‌మ‌కు ప్ర‌యోజ‌నం చేకూరుస్తాయ‌ని ఆశిస్తోంది. కానీ ఫిబ్ర‌వ‌రి నెల‌లో నిర్వ‌హించిన స‌ర్వేల సారాంశం వేరుగా ఉంది.

అప్ డేట్ ఏపీ యూ ట్యూబ్ చానెల్ లో ప్రసారం అవుతున్న జిల్లాల వారీ స‌ర్వేల లెక్క‌లు కూడా అదే చెబుతున్నాయి. ఇప్ప‌టికే మూడు జిల్లాల స‌ర్వే లెక్క‌లు తీస్తే వైసీపీకి 21 స్థానాలు ధీమాగా ద‌క్కుతుండ‌గా టీడీపీకి మాత్రం 12 సీట్లు మాత్ర‌మే ల‌భిస్తాయ‌ని తేలుతోంది. ఇక మిగిలిన 10 స్థానాల‌లో గ‌ట్టి పోటీ ఉండ‌గా, అందులో స‌గం స్థానాలు ద‌క్కినా వైసీపీ గాలి విస్తృతంగా ఉన్న‌ట్టుగా తేలుతోంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టిన త‌ర్వాత‌, అమ‌లుకు పూనుకున్న త‌ర్వాత కూడా ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా ఆద‌రణ పెర‌గ‌లేద‌ని తేలుతోంది. అదే స‌మ‌యంలో అంతా ఆశించిన‌ట్టుగా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటుని చీల్చ‌డంలో జ‌న‌సేన స‌క్సెస్ కాలేక‌పోవ‌డం కూడా టీడీపీ ఆశ‌లు నీరుగార‌డానికి కార‌ణంగా క‌నిపిస్తోంది. ఈ స‌ర్వేల‌న్నీ నిజ‌మ‌యితే మాత్రం ఏపీలో వైసీపీ ప్ర‌భావం తీవ్రంగా ఉంద‌న‌డంలో సందేహం లేదు.






Related News

బాబుని కేసీఆర్ మాత్ర‌మే కాపాడాలి..!

Spread the loveఏపీలో తెలుగుదేశం రూటు మార్చింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే టీడీపీ అధినేత‌తో పాటు పార్టీ శ్రేణుల ధోర‌ణి మారుతోంది.Read More

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the loveతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *