Main Menu

కేటీఆర్ ని మాత్రం న‌మ్మ‌వ‌చ్చా?

Spread the love

రాజ‌కీయాల్లో ఏం చేశావ‌న్న‌ది కాదు..ఎలా చేసినా గెల‌వ‌డ‌మే ముఖ్యం అన్న‌ట్టుగా మారిపోయింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే తాజా ప‌రిణామాలున్నాయి. స‌ర్వేల‌ను ఉప‌యోగించి ఓట‌ర్ల స‌మూహాన్ని త‌మ‌వైపు తిప్పుకోవ‌చ్చ‌నే అంచ‌నాలో నేత‌లున్నారు. అందులో భాగంగానే తెలంగాణా అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట వ‌రుస స‌ర్వేల విడుద‌ల జ‌రుగుతోంది. పోలింగ్ ముగిసిన త‌ర్వాత త‌న స‌ర్వే బ‌య‌ట‌పెడ‌తాన‌ని తెలిపిన ల‌గ‌డపాటి వంటి వారు మాట మార్చాల్సి వ‌చ్చింది. రోజుకో రెండు పేర్లు అంటూ తొలుత చెప్పి, ఆ త‌ర్వాత మొత్తం మ‌హాకూట‌మి కి మొగ్గు ఉందంటూ చెప్ప‌డానికి సైతం ఆయ‌న సిద్ధ‌ప‌డ్డారు. పైగా ఓట్లు, సీట్లు వివ‌రాలు లేకుండానే నాలుగు జిల్లాలు కూట‌మికి, మూడు జిల్లాలు టీఆర్ఎస్ కి పంచేశారాయ‌న‌.

అయితే అదంతా పూర్తిగా చంద్ర‌బాబు ఒత్తిడితోనే ల‌గ‌డ‌పాటి చేశార‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. తొలుత ల‌గ‌డపాటిది స‌ర్వే కాదు కేవ‌లం చిల‌క‌జోస్యం అంని విమ‌ర్శించారు. పైగా ఆయ‌న్ని పొలిటిక‌ల్ టూరిస్ట్ అంటూ విమ‌ర్శించి, డిసెంబ‌ర్ 11న త‌ట్టాబుట్టా స‌ర్దేస్తార‌ని విమ‌ర్శించారు. అంత‌టితో స‌రిపెట్ట‌కుండా ఓ గంట గ్యాప్ తీసుకుని న‌వంబ‌ర్ 20న ల‌గ‌డ‌పాటి స‌ర్వేలో త‌మ‌కు 65 నుంచి 70 సీట్లు వ‌స్తాయ‌ని పేర్కొన్నారంటూ ఓ మెసేజ్ స్క్రీన్ షాట్ ట్వీట్ చేశారు. దాని ప్ర‌కారం ల్యాంకో రాజ‌గోపాల్ పేరుతో ఉన్న నెంబ‌ర్ లో కేటీఆర్ కి చేసిన మెసేజ్ లో టీఆర్ఎస్ కి ఆద‌ర‌ణ బాగుంద‌ని పేర్కొన్నారు.

ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ల‌గ‌డ‌పాటి తొలుత టీఆర్ఎస్ కి చెప్పిన స‌ర్వే ఒక ర‌కంగానూ, తాజాగా మీడియా ముందు వెల్ల‌డించిన వివ‌రాలు మ‌రో ర‌కంగానూ ఉండ‌డంతో ల‌గ‌డ‌పాటి విశ్వ‌స‌నీయ‌తే ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. అయితే ఈ విష‌యంలో కేటీఆర్ చేసిన ట్వీట్ ని ఎలా విశ్వ‌సించాల‌న్న‌దే ప్ర‌శ్న‌. ఆయ‌న‌కు నిజంగానే ల‌గ‌డ‌పాటి మెసేజ్ చేసి ఉంటే దానిని వెంట‌నే పోస్ట్ చేయ‌కుండా గంట పాటు ఎందుకు వేచి చూశారు. తొలుత చేసిన ట్వీట్ లో ఈ విష‌యాన్ని ఎందుకు ప్ర‌స్తావించ‌లేద‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. అయినప్ప‌టికీ ఇలాంటి సర్వేల సారాంశాన్ని నేరుగా గానీ, ఫోన్ లో గానీ మాట్లాడ‌తారే త‌ప్ప మెసేజ్ లు, వాట్సాప్ లు చేస్తారా అంటూ సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఏమ‌యినా ల‌గ‌డ‌పాటి స‌ర్వే కొంత టీఆర్ఎస్ శిబిరంలో క‌ల‌వ‌రం క‌లిగించ‌గా, విరుగుడుగా ఇలాంటి ప్ర‌య‌త్నాల‌కు ఒడిగ‌ట్టిన‌ట్టు ప‌లువురు భావిస్తున్నారు. ల‌గ‌డ‌పాటి ఏమంటారో చూడాలి మ‌రి.


Related News

జ‌న‌సేన‌కు ఏమ‌య్యింది..?

Spread the loveఏపీలో రాజ‌కీయాలు వేడెక్కాయి. నోటిఫికేష‌న్ తో సంబంధం లేకుండానే పార్టీల‌న్నీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో మునిగిపోయాయి. జ‌న‌సేన కూడాRead More

చంద్ర‌బాబు సీనియారిటీపై మోడీ సెటైర్లు

Spread the loveఏపీ బీజేపీ శాఖ నిర్మించిన ప్ర‌జా చైత‌న్య స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి మోడీ ప్ర‌సంగించారు. అక్ష‌ర‌క్ర‌మంలో, అన్నిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *