Main Menu

బాబుపై కేటీఆర్: వెల్ కమ్ కాంబినేషన్

Spread the love

టీఆర్ఎస్ నేతలు స్వరం సవరించారు. హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ మీద ప్రేమను ఒలకపోశారు. అందులోనూ చంద్రబాబు మీద కేటీఆర్ ప్రశంసలు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఆశ్చర్యకరంగానే కాదు, అందరిలో చర్చనీయాంశం అవుతున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. చాలాకాలంగా టీడీపీ , టీఆర్ఎస్ తీరు ఉప్పూ నిప్పు మాదిరిగా కనిపించేవి. టీడీపీ నేతలనగానే, చంద్రబాబు పేరు చెప్పగానే గులాబీ దళం ఒంటికాలిపై లేచేది. అందులోనూ కేటీఆర్, కేసీఆర్ అండ్ కో వేసే సెటైర్లు మరీ ఆసక్తిగా ఉండేవి. రెండేళ్ల క్రితం అదే హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో చంద్రబాబు మీద కేటీఆర్ కామెంట్స్ వింటే తాజాగా సాఫ్ట్ వేర్ అభివ్రుద్ధిలో చంద్రబాబు పాత్ర గురించి కేటీఆర్ మాటలు పూర్తి భిన్నంగా కనిపిస్తాయి.

అయితే హైదరాబాద్ లో ఐటీ అభివ్రుద్దికి చంద్రబాబు పాత్రను కేటీఆర్ ప్రశంసల వెనుక రాజకీయ ప్రయోజనాల కారణమని భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణాలో టీడీపీ దాదాపుగా కుదేలయ్యింది. కొద్దిరోజుల క్రితం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ని వీడిన సమయంలో దాదాపు ప్రభావం కోల్పోగా..తాజాగా ఎలిమినేటి మాధవరెడ్డి కుటుంబం కారెక్కేసిన తర్వాత ఇక టీడీపీ కుదేలయిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణా అసెంబ్లీలో టీడీపీ బోణీ కొట్టే అవకాశం కూడా లేదనే అంచనాలున్నాయి. అందుకు తోడు గట్టిగా పోటీ ఇచ్చే నియోజకవర్గాల సంఖ్య కూడా నామమాత్రమేనని భావిస్తున్నారు.

దాంతో అక్కడక్కడా మిగిలిపోయిన తెలుగుదేశం ,చంద్రబాబు అభిమానులను తనవైపు తిప్పుకునే యోచనలో టీఆర్ఎస్ ఉంది. రేవంత్ రెడ్డి మూలంగా కాంగ్రెస్ వైపు మళ్లకుండా చూసుకోవడానికి టీఆర్ఎస్ ఎత్తులు వేస్తోంది. వెల్ కమ్ గ్రూప్ అంటూ వెలమ, కమ్మ సామాజిక సమీకరణాలలో మార్పు కోసం ప్రయత్నిస్తోంది. అందులోనూ హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలు, ఖమ్మం, నిజామాబాద్ లో ఉన్న చంద్రబాబు సామాజికవర్గంలో సానుకూలత కోసం యత్నిస్తోంది. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు మీద ప్రశంసలు కురిపించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో తాజాగా ప్రపంచ తెలుగు మహాసభలకు చంద్రబాబుని ఆహ్వానించకపోవడం సెటిలర్లలో కొంత అసంత్రుప్తి రాజేసినట్టు ప్రచారం సాగుతోంది. దానిని చల్లార్చే లక్ష్యం కూడా కేటీఆర్ మాటల్లో కనిపిస్తోంది

కానీ వాస్తవానికి హైదరాబాద్ లో ఐటీ రంగంలో 2003 తర్వాతే బాగా అభివ్రుద్ది అయ్యింది. 2009వరకూ ఎగుమతులు విస్త్రుతంగా పెరిగాయన్నది అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఆ తర్వాత ప్రపంచవ్యాప్త పరిణామాలతో సాఫ్ట్ వేర్ కుచించుకుపోతోంది. ప్రస్తుతం ఏపీలో ఐటీ గురించి సీఎం చెబుతున్న మాటలకు వాస్తవానికి పొంతన కనిపించడం లేదు. అయినా కేటీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన కామెంట్స్ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.


Related News

రాధా ముందు నుయ్యి..వెనుక గొయ్యి..!

Spread the loveవంగ‌వీటి రాధా వ్య‌వ‌హారం ఆసక్తిగా మారుతోంది. వైసీపీలో ఆయ‌న కొన‌సాగుతారా లేదా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. మూడుRead More

చంద్ర‌బాబు షాకివ్వ‌బోతున్న ఎమ్మెల్యేల జాబితా ఇదే

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల వేడి క్రమంగా రాజుకుంటోంది. అన్ని పార్టీలు అభ్య‌ర్థుల విష‌యంలో క‌స‌ర‌త్తులు ప్రారంభించారు. గ‌తంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *