Main Menu

గ‌డ్డిక‌రిచిన మీడియా: స్ట్రింగ్ తో బుక్కయిన బడా సంస్థలు

Spread the love

స‌హజంగా మీడియా సంస్థ‌లు స్ట్రింగ్ ఆప‌రేష‌న్ చేస్తాయి. కానీ తాజాగా జ‌రిగిన స్ట్రింగ్ లో బ‌డా మీడియా సంస్థ‌ల భాగోతం బ‌య‌ట‌ప‌డింది. రివ‌ర్స్ స్ట్రింగ్ తో వారి అస‌లు నైజం వెలుగులోకి వ‌చ్చింది. వార్త‌ల పేరుతో నానా గ‌డ్డి క‌రిచే వ్య‌వ‌హారం వీడియో, ఆడియోల సాక్షిగా వెలుగు చూసింది. దాంతో కోబ్రా పోస్ట్ సంస్థ చేసిన స్ట్రింగ్ ఆప‌రేష‌న్ సంచ‌ల‌నంగా మారింది. అందులో కొన్ని తెలుగు మీడియా సంస్థ‌లు కూడా ఉండ‌డం విస్మ‌య‌క‌రంగా క‌నిపిస్తోంది.

బడా మీడియా సంస్థలు బ‌రితెగిస్తున్నాయి. ఎంత‌కైనా దిగ‌జారిపోవ‌డానికి తెగిస్తున్నాయి. అందుకే కాషాయ సంస్థ‌ల ఓట్ల కోసం హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్ల‌డానికి మీడియా సంస్థ‌లు ముందుకొచ్చాయి. త‌మ‌కు కోట్లు చెల్లిస్తే ఇలాంటి క‌హానీల‌యినా వ‌ల్లిస్తామంటూ సిద్ధ‌ప‌డ్డాయి. నల్లధనం తీసుకుని పెయిడ్‌ న్యూస్ కి ఎటువంటి మొహ‌మాటం లేకుండా మ‌ద్ధ‌తిస్తామ‌ని మీడియా సంస్థ‌ల పెద్ద‌లు నిస్సంకోచంగా చెప్పిన మాట‌లు వాస్త‌వాన్ని చాటుతున్నాయి. అంద‌రికీ నీతులు వ‌ల్లించే మీడియా సంస్థ‌ల య‌జ‌మానుల అస‌లు బండారం చాటుతున్నాయి. చిన్న చిన్న అవినీతిప‌రుల‌ను ప‌ట్టుకుని గంట‌ల త‌ర‌బ‌డి వేధించే మీడియా వాళ్లే కోట్ల‌కు క‌క్కుర్తి ప‌డుతున్న తీరు తేటతెల్లం చేసిన కోబ్రా పోస్ట్ వీడియోలు దిగ‌జారిపోతున్న మీడియా ప‌రిస్థితి సాక్షీభూతంగా ఉన్నాయి.

2019 ఎన్నికలకు ముందుగా హిందూత్వ ఎజెండాను ప్రచారం చేయడంలో, ఓటర్లను చీల్చడంలో సాయపడేందుకు కొన్ని మీడియా సంస్థలు ఏ విధంగా వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నాయో దాదాపు రెండు నెలల క్రితం కోబ్రా పోస్ట్ ప్రాధ‌మికంగా వెల్లడించింది. కొన్ని పెద్ద వార్తాపత్రికలు, టివి చానెళ్ళకు చెందిన మేనేజర్లు, యజమానులతో హిందూత్వ ప్యాకేజీ అమలు చేయడానికి జరిపిన రాయబారాలు, బేరాసారాలను రహస్యంగా చిత్రీకరించిన వీడియోలను తాజాగా జ‌నం ముందుకు తెచ్చారు. . ప్రజల్లో మత విద్వేషాలు పెంచ‌డం, చిచ్చురేగేలా చూసేందుకు దాదాపు 25 వార్తా సంస్థలు సముఖత వ్యక్తం చేశాయని కోబ్రా పోస్ట్ వెల్ల‌డించింది. పైగా ఒక పార్టీకి అనుకూలంగా తీర్పు వచ్చేలా కూడా చేస్తామని చెబుతూ దానికీ ఒక ‘ధర’ను ఆ వార్తా సంస్థలు ప్రకటించాయని కోబ్రా పోస్ట్‌ తెలిపింది. స్ట్రింగ్ ఆప‌రేష‌న్ లో పాల్గొన్న విలేకరిప చేసిన ప్రతిపాదనలను కేవలం రెండు మీడియా సంస్థలు మాత్రమే తిరస్కరించడం విశేషం. అవి బెంగాలీ వార్తా పత్రికలైన ‘వర్తమాన్‌’, ‘దైనిక్‌ సంబంధ్‌స‌ లని తెలిపింది.

టైమ్స్‌ గ్రూపునకు చెందిన వినీత్‌ జైన్‌ వంటి ప్రొప్రయిటర్లతో సహా అనేక మీడియా సంస్థలు ఈ లావాదేవీలు ఎలా వుండాలో కూడా చర్చలు జరిపాయి. ఈ ఆప‌రేష‌న్ లో వంద‌ల కోట్ల న‌ల్ల‌ధ‌నం చేతులు మార‌డం గ‌మ‌నార్హం. టైమ్స్‌ నౌ చానెల్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇంకా అనేక మీడియా విభాగాలు న‌డుపుతున్న టైమ్స్ గ్రూప్ నిర్వాహ‌కుడు వినీత్ జైన్ వంటి వారు కూడా ఈ స్ట్రింగ్ ఆప‌రేష‌న్ లో చిక్క‌డం విశేషం. పుష్ప శర్మ అనే జర్నలిస్టును ‘ఆచార్య అతల్‌’గా పేర్కొంటూ కోబ్రా పోస్ట్‌ ఈ స్టింగ్‌ ఆపరేషన్‌కు వినియోగించింది. నాగపూర్‌కి చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడినని లేదా వారికి అత్యంత సన్నిహితుడినని చెప్పుకుంటూ ఆచార్య అతల్‌ వారిని కలిశారు. అడ్వర్టయిజ్‌మెంట్‌ల ద్వారా హిందూత్వ ఎజెండాను ప్రచారంచేస్తే ఎంత డబ్బు ముట్టచెప్పేది చెబుతూ అతల్‌ మీడియా సంస్థల ఎగ్జిక్యూటివ్‌లతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నించడం ఈ వీడియోల్లో కనిపిస్తోంది. హిందూత్వ సమాచారం వారి పత్రికల్లో లేదా రేడియో స్టేషన్లలో, టీవీ చానెళ్ళలో, వెబ్‌సైట్లలో వస్తే దానికి కొంత మొత్తం చెల్లించాలన్నది ఆ ఒప్పందాల సారాంశం.

వినీత్‌ జైన్ తో పాటుగా టైమ్స్‌ గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ అధ్యక్షుడు సంజీవ్‌ షా., ఇండియా టుడే గ్రూపు వైస్‌ ఛైర్‌పర్సన్‌ కల్లి పూరీ కూడా ఈ ఆప‌రేష‌న్ లో నోట్లిస్తే వార్త‌లు వేయ‌డానికి, చివ‌ర‌కు మ‌తం పేరుతో స‌మాజాన్ని చీల్చ‌డానికి సిద్ధ‌ప‌డ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశం. తమకు కావాల్సినట్టు హిందూత్వ ఎజెండాను ప్రచారం చేస్తే రు.500కోట్లు ముట్టచెబుతానని ఆచార్య అతల్‌ వారికి ఆశ చూపగానే వారు సిద్ధ‌ప‌డ‌డం విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది. ఈ ప‌రంప‌ర‌లో రెండు తెలుగు టీవీ చానెళ్ల య‌జ‌మానుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కోబ్రా పోస్ట్ రిపోర్ట్ లో కూడా ఉంది. మ‌తం ఆధారిత చానెళ్లు న‌డుపుతున్న సంస్థ‌లు ఈ జాబితాలో ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. అయినా మీడియా ఈ తీరుగా దిగ‌జారిపోయి మ‌త రాజ‌కీయాలకు వ‌త్తాసు ప‌ల‌క‌డానికి ముందుకు రావ‌డం ప్ర‌మాద‌క‌ర సూచిక‌గా క‌నిపిస్తోందని ప‌లువురు వాపోతున్నారు.


Related News

జ‌న‌సేన‌కు ఏమ‌య్యింది..?

Spread the loveఏపీలో రాజ‌కీయాలు వేడెక్కాయి. నోటిఫికేష‌న్ తో సంబంధం లేకుండానే పార్టీల‌న్నీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో మునిగిపోయాయి. జ‌న‌సేన కూడాRead More

చంద్ర‌బాబు సీనియారిటీపై మోడీ సెటైర్లు

Spread the loveఏపీ బీజేపీ శాఖ నిర్మించిన ప్ర‌జా చైత‌న్య స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి మోడీ ప్ర‌సంగించారు. అక్ష‌ర‌క్ర‌మంలో, అన్నిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *