Main Menu

బాబుకి కాలు అడ్డుపెడుతున్న కేసీఆర్!

Spread the love

తెలంగాణాలో వ‌ర‌సుగా రెండోసారి విజయం ద‌క్క‌డంతో కారు పార్టీ అధినేత ఉత్సాహం రెట్టింప‌య్యింది. ఎన్న‌డూ లేనంత జోష్ లో కేసీఆర్ క‌నిపిస్తున్నారు. రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వాలి క‌దా అంటూ ఏపీ వ్య‌వ‌హారాల్లో వేలుపెట్టేందుకు సిద్ధ‌ప‌డుతున్న‌ట్టు సంకేతాలు ఇచ్చేశారు. సొంతంగా పోటీ చేస్తారా లేక‌, త‌న‌కు తెలంగాణాలో స‌హ‌క‌రించిన నేత‌ల‌కు మ‌ద్ధ‌తిస్తారా అన్న‌ది తేలాల్సి ఉంది. ఏమ‌యినా విజ‌య‌వాడ వ‌చ్చి చంద్ర‌బాబు గురించి అన్ని విష‌యాలు చెబుతానంటున్న కేసీఆర్ నిర్ణ‌యం ఏపీలో కూడా కాక రాజేయ‌డం ఖాయంగా చెప్ప‌వ‌చ్చు.

అయితే అంత‌కుమించిన ఇబ్బంది చంద్ర‌బాబుకి కేసీఆర్ మూలంగా ఖాయంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా చంద్ర‌బాబు క‌న్ను ఇప్పుడు జాతీయ రాజకీయాల‌పై ప‌డింది. గ‌తంలో వివిధ జిల్లాల‌కు ప‌దే ప‌దే ప‌ర్య‌ట‌న‌లు సాగించిన చంద్ర‌బాబు ఇటీవ‌ల వివిధ రాష్ట్రాల‌కు వెళ్లి వ‌స్తున్నారు. ప‌లువురు నేత‌ల‌ను క‌లుస్తున్నారు. అంద‌రినీ తాను క‌లుపుతున్నానంటూ, మోడీ వ్య‌తిరేక కూట‌మిలో తానే కీల‌కం అన్న‌ట్టు సంకేతాలు ఇస్తున్నారు. ఇవ‌న్నీ చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత కేంద్రంలో కీల‌క పాత్ర పోషించాల‌ని ఆయ‌న త‌హ‌త‌హ‌లాడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఏపీలో తేడా వ‌చ్చిన‌ప్ప‌టికీ కేంద్రంలో ప‌ట్టు సాధించాల‌నే అంచనాలో ఆయ‌న ఉన్న‌ట్టుగా చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా మోడీ వ్య‌తిరేక కూట‌మి వ‌స్తే చంద్రబాబు చ‌క్రం తిప్పాల‌ని ల‌క్ష్యంగా క‌నిపిస్తున్నారు.

కానీ తెలంగాణాలో చంద్ర‌బాబు కూట‌మి ఆశ‌ల‌ను కూక‌టివేళ్ల‌తో పెకిలించిన కేసీఆర్ ఇప్పుడు నేష‌న‌ల్ రాజ‌కీయాల్లో కూడా బాబుకి బ్రేకులు వేసేలా క‌నిపిస్తున్నారు. చంద్ర‌బాబు స్కెచ్ కి రివ‌ర్స్ స్కెచ్ సిద్ధం చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. బాబు ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లేలా కేసీఆర్ వ్యూహం క‌నిపిస్తోంది. నాలుగు పార్టీల‌ను క‌లిపే వ్య‌వ‌హారం త‌న‌ది కాద‌ని, క‌న్సార్టియం సిద్ధం చేస్తున్నానని చెబుతూ దేశ రాజ‌కీయాల‌పై త‌న దృష్టి ఉన్న‌ట్టు తేల్చేశారు. త‌ద్వారా చంద్ర‌బాబు క‌న్నా విశ్వ‌స‌నీయ‌త క‌లిగిన నేత‌గా కేసీఆర్ కి ఉన్న గుర్తింపుతో పాటుగా ఇటీవ‌ల తెలంగాణాలో ఆయ‌న విజ‌యం కూడా కేసీఆర్ కి ఉప‌యోగ‌ప‌డే అవ‌కాశం ఉంది. అంతేగాకుండా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కి ఈ ఊపు కొన‌సాగిస్తే క‌నీసంగా డ‌జ‌ను సీట్లు గ్యారంటీగా క‌నిపిస్తున్నాయి. కానీ చంద్ర‌బాబు ప‌రిస్థితి దానికి భిన్నంగా ఉంది. ఈ నేప‌థ్యంలో జాతీయ రాజ‌కీయాల్లో కూడా చంద్ర‌బాబు ఆశ‌ల‌కు చంద్ర‌శేఖ‌ర్ రావు అడ్డుక‌ట్ట వేయ‌డం అనివార్యంగా క‌నిపిస్తోంది. ఏమ‌యినా ఈ చంద్రుళ్ల వ్య‌వ‌హారం తెలుగు నేల నుంచి హ‌స్తిన‌కు మ‌ర‌లుతుండ‌డం విశేషంగానే చెప్పాలి. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు ఢిల్లీ వ్య‌వ‌హారాల్లో కీల‌కంగా మార‌తార‌న్న‌ది ఆస‌క్తిదాయ‌క‌మే.






Related News

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the loveతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

నాన్న బాట‌లోనే జ‌గ‌న్!

Spread the loveవైఎస్ జ‌గ‌న్ కొత్త పంథాలో సాగారు. తండ్రి వైఎస్సార్ ని అనుస‌రించారు. అభ్య‌ర్థుల విష‌యంలో వైసీపీ జాబితాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *