Main Menu

కత్తి కథతో ఇరకాటంలో కాటమరాయుడు

1515322707_mahesh-kathi-poonam-kaur-pawan-kalyan
Spread the love

ఓ సినిమా క్రిటిక్ విమర్శలకు పవన్ ఫ్యాన్స్ స్పందించిన తీరు చివరకు చినికి చినికి గాలివానలా మారింది. ఏకంగా పవన్ వ్యక్తిగత సంబంధాలు తెరమీదకు రావడానికి కారణంగా మారింది. పూనమ్ కౌర్ , పవన్ కళ్యాణ్ మధ్య వ్యవహారం కొత్త వివాదంగా మారుతోంది. దానికి ప్రధాన కారణం నియంత్రణ లేని పవన్ ఫ్యాన్స్ తీరే అని చెప్పవచ్చు.

వాస్తవానికి కత్తి మహేష్ ఓ మంచి విమర్శకుడు. అనేక అంశాలలో ఆయన తన వైఖరిని సోషల్ మీడియా ద్వారా చాటుతున్నారు. అయితే అతడిని ఏకంగా తెలుగు న్యూస్ చానెళ్లలో లైవ్ డిస్కషన్స్ కి ఓ హాట్ టాపిక్ గా మార్చడానికి పవన్ ఫ్యాన్స్ చాలా క్రుషి చేసినట్టే భావించవచ్చు. నేరుగా వ్యక్తిగతంగా ఆయన్ని కెలికి చివరకు జనసేనలో కుదుపు వచ్చే పరిస్థితి తెచ్చుకున్నారు. తాాజగా తన పార్టీ శ్రేణులందరికీ కత్తి మహేష్ గురించి కామెంట్స్ చేయవద్దని మెసేజ్ లు పంపించే వరకూ కథ వెళ్లింది. వాస్తవానికి కత్తి మహేష్ కూడా అదే డిమాండ్ చేశారు. తన జోలికి రావద్దని అభిమానులకు పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. తన కుటుంబం, భార్య, తల్లి మీద అసభ్యంగా ప్రవర్తిస్తున్న తీరుకి అడ్డుకట్ట వేయాలని కోరారు. అలా కాని పక్షంలో తాను వెనుకడగు వేసే ప్రసక్తే లేదని తేల్చేశారు.

దానికి తగ్గట్టుగానే కత్తి ప్రశ్నాస్త్రాలతో పూనమ్ కౌర్ ని ముందుకు తెచ్చారు. ఆ విషయంలో కూడా తొలుత ఆమె ఏకంగా బెగ్గర్ అంటూ కామెంట్ చేయడంతోనే కథలోకి వచ్చింది. దాంతో కత్తి మహేష్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సైలెంట్ కావాల్సి వచ్చింది. పైగా పవన్ చెబితే ఆమెకు ఏపీలో పదవి రావడం, ఆమె ఆత్మహత్యాయత్నం సమాయంలో ఆసుపత్రి డబ్బులు ఎవరు చెల్లించారని నిలదీయడం, పవన్, పూనమ్ ఒకే గోత్రనామంతో తిరుమలలో పూజలు చేయించుకున్న అంశాన్ని ముందుకు తేవడం ఇలాంటి అనేక ప్రశ్నలతో కత్తి చాలా పదునుగా వ్యవహరించారు. కానీ వాటి జోలికి వెళితే ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పిన కత్తి మహేష్ కారణంగా ఇప్పుడు సైలెంట్ కావాల్సి వస్తోంది.

ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారనే కారణంతో రాజకీయంగా కూడా విమర్శలు పాలువుతున్న పవన్ కి ఇప్పుడు పూనమ్ కౌర్ వ్యవహారం మరో తలనొప్పిగా మారడం ఖాయం. ఆయన వ్యతిరేకులకు ఇదో అస్త్రంగా మారబోతోంది. ఇప్పుడు సమాధానం చెబితే కత్తి కొత్త విషయాలు వెలుగులోకి తెస్తానని బెదిరిస్తుండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒకవేళ సమాధానం చెప్పలేకపోతే అనుమానాలు ప్రజల్లో నిజమని నమ్మేసే పరిస్థితి వస్తుంది. గతంలో పరిటాల గుండు వ్యవహారం దశాబ్దం తర్వాత సమాధానం చెప్పుకున్న పవన్ ఇప్పుడు పూనమ్ విషయంలో ఇరకాటంలో పడినట్టే కనిపిస్తోంది. దాంతో కాటమరాయుడు మాత్రం పూనమ్ విషయంలో అజ్ణాతవాసిగానే ఉండక తప్పడం లేదని భావించాలి.« (Previous News)Related News

ysrcp-party-flag-647x450

వైసీపీ సిట్టింగుల‌లో గెలిచేదెవ‌రు?

Spread the loveఎన్నిక‌ల వాతావ‌ర‌ణం స‌మీపిస్తోంది. మ‌రోసారి ముంద‌స్తు చ‌ర్చ మొద‌లుకావ‌డంతో అంద‌రి దృష్టి నియోజ‌క‌వ‌ర్గాల మీద ప‌డుతోంది. తాజాగాRead More

narendra-modi-chandrababu-ys-jagan-pawan-kalyan-671-1521125657

మోడీతో మేలు ఎవ‌రికి? కీడు ఎవ‌రికి?

Spread the loveఅనూహ్య నిర్ణ‌యాల‌కు పెట్టింది పేరు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ. ఆఖ‌రికి దేశాన్నంతా అతలాకుత‌లం చేసేని నోట్ల ర‌ద్దుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *