Main Menu

చంద్ర‌బాబుకి ‘కాపు’ కాసేనా?

Spread the love

ఏపీ రాజ‌కీయాల్లో మ‌ళ్లీ రిజ‌ర్వేష‌న్లు ముందుకొచ్చాయి. కాపుల‌కు 5శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ చంద్ర‌బాబు స‌ర్కారు అసెంబ్లీలో తీర్మానం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. గ‌తంలో కాపుల‌ను బీసీల‌లో చేరుస్తూ తీర్మానం చేసిన అసెంబ్లీలోనే మ‌ళ్లీ ఈడ‌బ్లూఎస్ జాబితాలో రిజ‌ర్వేష‌న్లు కేటాయించ‌డం విశేషంగా మారింది.

కాపులను బీసీల‌లో చేరుస్తూ గ‌తంలోనే ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే ఆ తీర్మానం త‌మ‌కు చేర‌లేద‌ని గ‌తంలోనే కేంద్ర ప్ర‌భుత్వం లోక్ స‌భ సాక్షిగా స్ప‌ష్టం చేసింది. 9వ షెడ్యూల్ లో చేర్చాల్సిన ఈ అంశంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌క్క‌న పెట్టేసిన‌ట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే తాజాగా ఈడ‌బ్య్లూఎస్ లిస్టులో కాపుల‌కు 5శాతం కోటా క‌ల్పిస్తూ తీర్మానం చేయ‌డం మ‌రోసారి విస్మ‌య‌క‌రంగా మారింది.

వాస్త‌వానికి బీసీల‌లో కాపుల‌ను చేర్చేందుకు గ‌తంలోనే మంజునాథ్ క‌మిష‌న్ ఏర్పాటు చేశారు. ఆ క‌మిష‌న్ రిపోర్ట్ రాకుండానే అసెంబ్లీలో తీర్మానం చేసిన విష‌యం వివాదాస్ప‌దం అయ్యింది. ఇక తాజాగా బీసీలు కాదు..ఓసీల‌లో వెనుక‌బ‌డిన వ‌ర్గాలుగా చెప్ప‌డం విశేషంగా క‌నిపిస్తోంది. ఇది కాపుల‌ను ఏకాకుల‌ను చేసే అంశంగా విప‌క్షం ఆరోపిస్తోంది.

అయితే తాజాగా అసెంబ్లీలో చేసిన తీర్మానం కూడా కేంద్రం ఆమోదించాల్సిందే. అంతేగాకుండా 9వ షెడ్యూల్ లో చేర్చాల్సిందే. అయితే ప్ర‌స్తుతం అలాంటి అవ‌కాశాలు నామ‌మాత్రంగా ఉన్నాయి. ఏపీలో కాపుల‌కు అంగీక‌రిస్తే మిగిలిన రాష్ట్రాల‌లో ఈడ‌బ్య్లూఎస్ వ్య‌వ‌హారంలో వ‌ర్గీక‌ర‌ణ డిమాండ్ వ‌స్తుంది. దాంతో కేంద్రం స్పందించే అవ‌కాశాలు పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఏపీ అసెంబ్లీ తీర్మానం ఏమేర‌కు ప్ర‌యోజ‌నం అనే దాని మీద కాపులే పెద‌వి విరుస్తున్నట్టుగా క‌నిపిస్తోంది.






Related News

బాబుని కేసీఆర్ మాత్ర‌మే కాపాడాలి..!

Spread the love8Sharesఏపీలో తెలుగుదేశం రూటు మార్చింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే టీడీపీ అధినేత‌తో పాటు పార్టీ శ్రేణుల ధోర‌ణి మారుతోంది.Read More

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the love8Sharesతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *