మోడీకి మరో షాక్, దేశద్రోహులకు గ్రీన్ సిగ్నల్

Kanhaiya Kumar, a Jawaharlal Nehru University (JNU) student union leader, gestures as he addresses a meet inside JNU campus in New Delhi, India, March 3, 2016. REUTERS/Adnan Abidi
Spread the love

మోడీ అండ్ కో కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే అమిత్ షా తనయుడితో తలనొప్పులు కలవరపెడుతున్నాయి. తాజాగా మరో వ్యవహారం తెరమీదకు వచ్చింది. ఏడాదిన్నర తర్వాత న్యాయస్థానం తీర్పుతో కాషాయి మూకలకు తలబొప్పి కొట్టినట్టవుతోంది. ముఖ్యంగా దేశమంతా రచ్చ చేసి దేశద్రోహులుగా ముద్రలు వేసిన కన్నయ్యకుమార్ అండ్ కో కి కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారిని జేఎన్యూ క్యాంపస్ నుంచి క్రమశిక్షణా చర్యలు తీసుకోవడాన్ని తప్పుబట్టింది. 2016 ఫిబ్రవరి 9 నాడు జరిగిన ఘటనల పేరుతో కన్నయ్య సహా మొత్తం 15మందిపై జేఎన్యూ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని తిరగతోడాలని ఆదేశించింది.

తాజాగా ఢిల్లీ హైకోర్ట్ జస్టిస్ వీకే రావు ఇచ్చిన తీర్పుతో మరోసారి జేఎన్యూ వ్యవహారం తెరమీదకు వచ్చింది. మొత్తం విద్యార్థులందరినీ అనుమతించి రికార్డులు పరిశీలించాలని తెలిపింది. ఆరు వారాల్లోగా విద్యార్థుల వాదన వినాలని ఆదేశించింది. ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య సహా అందరికీ తమ వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వాలని తెలిపింది.

తమమీద తీసుకున్న చర్యలు వెనక్కి తీసుకోవాలని, తమ వాదన వినడానికి అవకాశం ఇవ్వాలని విద్యార్థులు విన్నవించడంతో కోర్ట్ అంగీకరించింది. గత డిసెంబర్ లో ఉమర్ ఖలీద్ మీద జేఎన్యూ వేటు వేసింది. అనిర్బన్ భట్టాచార్య మీద ఐదేళ్ల నిషేధం పెట్టింది. కానీ తాజా ఆదేశాలతో జేఎన్యూ లో వచ్చిన ఆరోపణలపై కొత్త చర్చ మొదలయ్యింది. క్రమశిక్షణారాహిత్యం దేశ ద్రోహం కాదంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారుతున్నాయి.

గతంలో అదే ఢిల్లీ హైకోర్ట్ వద్ద కన్నయ్య కుమార్ మీద బీజేపీ నేతలు దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అదే కోర్టులో కన్నయ్య కుమార్ తో పాటు మొత్తం విద్యార్థులందరికీ ఊరట లభించడంతో దేశద్రోహి ముద్ర వేసి సాిగించిన ప్రచారం అవాస్తవం అని తేలిపోతోంది.దేశద్రోహులనే పేరుతో వారిమీద తీసుకున్న చర్యలు తాజా కోర్ట్ తీర్పు తర్వాత ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కొత్త పరిణామాలు ఖాయంగా కనిపిస్తోంది.కన్నయ్య సహా ఇతరులందరికీ ఇప్పుడు న్యాయస్థానంలో ఉపశమనం దక్కడంతో మోడీ అనునాయులు సాగించిన ప్రచారం తేలిపోతున్నట్టవుతోంది. ఇది తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీకి మింంగుడుపడని తీర్పుగానే భావించాలి.


Related News

janasena pawan kalyan

ఒక్కరోజుకే మరచిపోతే ఎలా పవన్?

Spread the loveనాలుగు రోజుల పర్యటన కోసం ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, మధ్యాంధ్ర ప్రాంతాల్లో పర్యటనలు పూర్తి చేసుకుని దక్షిణాంధ్రRead More

pawna kalyan

పవన్ లక్ష్యం అదేనా..?

Spread the loveజనసేన అధినేత పవన్ కల్యాణ్ హఠాత్తుగా తెరమీదకు వచ్చి ఆశ్చర్యం కలిగించారు. ఒక్క రోజు వ్యవధిలోనే ఆయనRead More

 • రెంటికీ చెడ్డ రేవడిలా చంద్రబాబు
 • బాబుకి వ్రతం చెడ్డా ఫలితం దక్కుతుందా..?
 • కొత్త కాక పుట్టించిన చంద్రబాబు
 • చేతులెత్తేసిన చంద్రబాబు..
 • జగన్ ఫోటోలపై క్లారిటీ వచ్చింది…
 • మొక్కుబడి తంతుగా ఏపీ అసెంబ్లీ
 • జగన్ కి డిప్యూటీ సీఎం మీద అంత ప్రేమ ఎందుకో?
 • పీకే రిపోర్ట్స్ తో జగన్ కి ఝలక్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *