Main Menu

వైసీపీది వాపా?..బ‌ల‌మా??

Spread the love

వైసీపీలో ఊహించ‌ని ప‌రిణామాలు సాగుతున్నాయి. కొత్త ఊపు క‌నిపిస్తోంది. హోదా ఉద్య‌మం, బాబు యూ ట‌ర్న్ వ్య‌వ‌హారం విప‌క్షానికి ప్ల‌స్ అనుకునే ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. అదే క్ర‌మంలో ప‌లువురు టీడీపీ నేత‌లు కూడా ప‌క్క చూపులు చూస్తుండ‌డంతో వైసీపీ బ‌ల‌ప‌డుతోంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. అయితే కొత్త నేత‌ల రాక‌తో వైసీపీకి వాపు వ‌స్తోందా..బ‌ల‌ప‌డుతోందా అన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి వైసీపీకి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అభ్య‌ర్థులు దాదాపుగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఉన్నారు. 175 స్థానాల‌కు గాను, మొన్న‌టి ఎన్నిక‌ల్లో బ‌రిలో ఉన్నవారిలో క‌నీసంగా 30మంది నేత‌లు చేజారిపోయి ఉంటార‌న‌డంలో సందేహం లేదు. వారిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలే 22 మంది ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయా స్థానాల్లో కొత్త అభ్య‌ర్థుల కోసం ప్ర‌య‌త్నించ‌డంలో పెద్ద విశేషం లేదు. వారికితోడుగా బ‌ల‌హీన‌మైన నేత‌ల మీద కూడా దృష్టిపెడితే మ‌రో 20 మంది వ‌ర‌కూ ఉంటారు. వారికితోడుగా గ‌డిచిన ఐదేళ్లుగా ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాలంలో పెద్ద‌గా ప్ర‌భావితం చేయ‌లేని వారు మ‌రో 20మందిని గుర్తించినా మొత్తంగ‌తా స‌గం మంది కొత్త అభ్య‌ర్థులు ఖాయం.

అయితే ఇప్పుడు టీడీపీ స‌హా ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి చేరుతున్న నేత‌ల‌తో ఇన్నాళ్ళుగా నియోజ‌క‌వ‌ర్గాల‌ను న‌మ్ముకున్న వారు తీవ్రంగా స‌త‌మ‌తం కావాల్సి వ‌స్తుంది. అలాంటి స‌మ‌యంలో వైసీపీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాలు అస‌లుకే ఎస‌రు తెచ్చే స్థాయికి చేరినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. తాజాగా ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వైసీపీలో చేర‌బోతున్న‌ట్టు వ‌స్తున్న సంకేతాల‌తో నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో ఆస‌క్తిగా మారింది. ముఖ్యంగా గ‌తంలో కాంగ్రెస్, కొన్నాళ్లుగా టీడీపీ నేత‌గా వైసీపీపై ఆనం వివిధ రూపాల్లో వైసీపీ శ్రేణుల‌ను ఇబ్బందుల‌కు గురిచేశారు. ఇప్పుడు అలాంటి నేత‌ల‌కు కండువా క‌ప్పే ప‌రిస్థితి వ‌స్తే కేటాయించాల్సిన వెంక‌ట‌గిరి సీటు అయిన‌ప్పటికీ అక్క‌డ నియోజ‌క‌వ‌ర్గంలో ఐదేళ్లుగా నిల‌బ‌డి ప‌నిచేసిన వారికి స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు. అంతేగాకుండా జిల్లాలో స‌మ‌న్వ‌య స‌మ‌స్య‌ల‌కు కూడా ఆజ్యం పోయ‌వ‌చ్చు. ఇప్ప‌టికే ఉన్న నేత‌ల‌కు తోడు మ‌రో అధికార కేంద్రం త‌యార‌య్యినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు.

అయితే వైసీపీ నేత‌ల్లో మ‌రోర‌క‌మైన అబిప్రాయం ఉంది. ఇత‌ర పార్టీల నేత‌ల‌ను చేర్చుకోవ‌డం ద్వారా తొలుత ప్ర‌త్య‌ర్థి పార్టీపై నైతికంగా పై చేయి సాధించ‌గ‌ల‌మ‌ని భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో పార్టీలో ఉన్న స‌మ‌స్య‌లు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కొంత స‌ర్ధుబాటుకి అవ‌కాశం ఉంటుంద‌ని ఆశిస్తున్నారు. ఇక పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన నేత‌ల‌కు గుర్తింపుగా నామినేటెడ్ స‌హా వివిధ ప‌దవుల‌తో సంతృప్తి ప‌రిచే మార్గం సుగ‌మం అవుతుంద‌ని భావిస్తున్నారు. ఏమ‌యినా కొత్త నేత‌ల రాక‌తో పాత నేత‌లు ఉక్కిరిబిక్కిరవుతున్న త‌రుణంలో ఇలాంటి ప‌రిణామాలు ఆపార్టీకి వాపా..బ‌ల‌మా అన్న‌ది త్వ‌ర‌లో తేలుతుంది.


Related News

ఐటీ ఉచ్చులో సీఎం!

Spread the loveఏపీలో ప‌రిణామాలు ఆస‌క్తిగా క‌నిపిస్తున్నా్యి. ముఖ్యంగా ఇన్ క‌మ్ ట్యాక్స్ అధికారుల దూకుడు అల‌జ‌డి రేపుతోంది. ముఖ్యంగాRead More

బాబుని మోడీ ఏమీ చేయ‌లేక‌పోవ‌డానికి కార‌ణం అత‌డే..!

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఇటీవ‌ల పూర్తి అభ‌ద్ర‌తా భావంతో క‌నిపిస్తున్నారు. ఎక్క‌డ చీమ చిటుక్కు మ‌న్నా త‌న‌కోస‌మే అన్న‌ట్టుగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *