Main Menu

జేడీ-జేపీ జంట‌గా వ‌స్తే…!

Spread the love

ఏపీ రాజ‌కీయ తెర‌పై కొత్త జెండా క‌నిపిస్తుంద‌ని భావిస్తే అందుకు భిన్నంగా వ్య‌వ‌హారం ఉంది. చివ‌రి నిమిషంలో విజిల్ వేసేందుకు వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ సిద్ధ‌ప‌డ‌డంతో కొత్త పార్టీ స్థానంలో పాత లోక్ స‌త్తా చూపేందుకు సిద్ద‌మ‌వుతోంది. 2009లో సింగిల్ సీటుతో బోణీ కొట్టిన ఆపార్టీ 2014లో బోల్తా ప‌డింది. ఆ తర్వాత జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ కూడా ఢీలా ప‌డ్డారు. రాజ‌కీయ వ్య‌వ‌హారాలు దాదాపుగా త‌గ్గిపోయాయి. అర‌కొర‌గా స్పంద‌న‌లు త‌ప్ప లోక్ స‌త్తా దాదాపు క‌నుమ‌రుగ‌య్యింద‌నే వాద‌న వినిపించింది.

అలాంటి స‌మ‌యంలో జ‌న‌ధ్వ‌ని ప్ర‌తిపాద‌న విర‌మించుకుని ల‌క్ష్మీనారాయ‌ణ తాజాగా జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ‌తో చేతులు క‌లిపేందుకు సిద్ధ‌ప‌డ‌డం విశేషంగా మారింది. లోక్ స‌త్తా పార్టీ అధ్య‌క్షుడిగా ఆయ‌న నియ‌మితులు కావ‌డం ఆస‌క్తిగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌యోగాలు చేసి అల‌సిపోయిన జేపీ స్థానంలో జేడీ నాయ‌క‌త్వం లోక్ స‌త్తాని ఎలా ముందుకు తీసుకెళుతుంద‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా క‌నిపిస్తోంది.

రాజ‌కీయాల్లో మార్పు కోసం ప్ర‌య‌త్నిస్తున్నామ‌నే పేరుతో ప‌నిచేసే నేత‌లు దానికి త‌గ్గ‌ట్టుగా ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు ఉన్న అవ‌కాశాల‌ను సద్వినియోగం చేసుకోవాలి. కానీ జేపీ మాత్రం దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. దాంతో మేథావిగా మంచి మార్కులు వేసిన ఆయన‌కు ఓట్లు వేసేందుకు జ‌నం సిద్ధ‌ప‌డ‌లేదు. చివ‌ర‌కు అసెంబ్లీకి కూక‌ట్ ప‌ల్లి నుంచి గెలిచిన ఆయ‌న పార్లమెంట్ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజ్ గిరీలో ప‌రాజ‌యం ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

ఇక జేపీకి తోడుగా జేడీ కూడా ముందుకొస్తే లోక్ స‌త్తాలో ఏమేర‌కు ఊపు వ‌స్తుంద‌న్న‌ది అనుమానంగానే ఉంది. వాస్త‌వానికి సొంతంగా పార్టీ పెట్టి క్షేత్ర‌స్థాయి వ‌ర‌కూ శ్రేణుల‌ను సన్న‌ద్ధం చేసుకోవ‌డం చిన్న విష‌యం కాదు. అందుకే అంతో ఇంతో నిర్మాణం ఉన్న లోక్ స‌త్తా ద్వారా ల‌క్ష్మీనారాయ‌ణ ప‌ని కొంత సులువు అవుతుంది. కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రో ఒక‌రితో పొత్తు పెట్టుకుని క‌నీసం బోణీ కొట్టాల‌ని భావిస్తున్న లోక్ స‌త్తాకి ఛాన్స్ ఉంటుందా లేదా అన్న‌ది చూడాలి. టీడీపీ, జ‌న‌సేన‌లో ఏదో పార్టీతో క‌లిసే అవ‌కాశం ఉన్నందున దాని ప్ర‌భావం ఎలా ఉంటుంద‌న్న‌ది కూడా వేచి చూడాల్సిన అంశం.


Related News

జ‌న‌సేనాని త‌న గోతిని తానే త‌వ్వుకున్న‌ట్టు!

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో అనూహ్య మార్పులు ఖాయం అన‌డంలో అనుమానం లేదు. అందుకు నిద‌ర్శ‌నంగానే తాజా ప‌రిణామాలున్నాయి. ముఖ్యంగాRead More

లేటెస్ట్ స‌ర్వే: పెరిగిన జ‌గ‌న్ గ్రాఫ్

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో విప‌క్ష హ‌వా పెరుగుతోంది. గ‌త రెండు మూడు నెల‌ల్లో కూడా జ‌గ‌న్ కి ఆద‌ర‌ణRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *