Main Menu

బాబు, ప‌వ‌న్ ఆశ‌ల‌కు జేడీ గండి కొడ‌తారా?

Spread the love

ఏపీలో మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ తెర‌మీద‌కు రాబోతోంది. దానికి ముహూర్తం కూడా సిద్ధ‌మ‌య్యింది. జ‌య‌ప్ర‌కాష్ నారాయణ లోక్ స‌త్తా ప్ర‌యోగం త‌ర్వాత మ‌రో సివిల్స్ అధికారి అందుకు సిద్ధ‌ప‌డుతుండ‌డం విశ‌షం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి త‌గ్గ‌ట్టుగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనార‌య‌ణ తెర‌మీద‌కు వ‌స్తున్నారు. కొత్త పార్టీని ఈనెల 26న ప్రారంభించ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.

ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల ఊహాగానాలు వ‌చ్చాయి. ఆయ‌న బీజేపీలో చేర‌తార‌ని, జ‌న‌సేన వెంట న‌డుస్తార‌ని ప‌లువురు భావించారు. కానీ అన్నింటికీ తెర‌దించుతూ ఆయ‌న సొంతంగా ముందుకు సాగేందుకు సిద్ధ‌ప‌డుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. క‌డ‌ప జిల్లాలో పుట్టి, క‌ర్నూలులో బాల్యం గ‌డిపిన జేడీ కూడా మ‌రో రాయ‌ల‌సీమ నేత కావ‌డం విశేషం. ఇప్ప‌టికే టీడీపీ, వైసీపీ అధినేత‌లిద్ద‌రూ సీమ ప్రాంతీయులే కావ‌డం గ‌మ‌నార్హం.

జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ కి ఏపీలో ఐపీఎస్ అధికారిగా అనూహ్య క్రేజ్ వ‌చ్చింది. దానికి అనేక కార‌ణాలుండ‌వ‌చ్చు గానీ జ‌గ‌న్ కేసుని ఆయ‌న టేకప్ చేయ‌డంతో జ‌గ‌న్ వ్య‌తిరేకుల్లో ఆయ‌న‌కు అభిమానులు పెరిగారు. ఇప్ప‌టికీ కొంద‌రు జేడీ ప‌ట్ల మోజుతో ఉన్నారు. జేడీ పార్టీ పెట్టిన‌ప్ప‌టికీ చేరేవాళ్ల‌లో ఎక్కువ మంది ఆ త‌ర‌గ‌తి వాళ్లే ఉంటార‌ని అంచ‌నా. ఇక సామాజికంగా చూస్తే బ‌లిజ వ‌ర్గానికి చెందిన జేడీ కార‌ణంగా ప‌వ‌న్ ని అభిమానించే కొంద‌రు అటు మ‌ళ్లుతార‌ని భావిస్తున్నారు.

దాంతో జేడీ పార్టీ మూలంగా అటు జ‌గ‌న్ వ్య‌తిరేక ఓట్ల‌లోనూ, ఇటు కాపు ఓట్ల‌లోనూ చీలిక అనివార్యం అవుతోంది. ఈ ప‌రిణామాలు జ‌గ‌న్ కి మేలు చేసినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ది ఓ అంచ‌నా. అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల నాటికి జేడీ ఎవ‌రో ఒక‌రితో చేతులు క‌లిపే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని కూడా కొంద‌రు భావిస్తున్నారు. ఒంట‌రిగా పోటీ చేసే అవ‌కాశం లేనందున ఎవ‌రితో క‌లుస్తారు..ఆ త‌ర్వాత ప‌రిణామాలు ఎలా ఉంటాయ‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశ‌మే. కానీ గ‌తంలో లోక్ స‌త్తా మూలంగా టీడీపీ ఓట్ల‌కు చిల్లుప‌డిన‌ట్టే ఇప్పుడు జేడీ మూలంగా అలాంటి ఫ‌లితాలు వ‌చ్చే ప్ర‌మాదం మాత్రం టీడీపీ, ప‌వ‌న్ శిబిరాల‌కు పొంచి ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Related News

జ‌న‌సేనాని త‌న గోతిని తానే త‌వ్వుకున్న‌ట్టు!

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో అనూహ్య మార్పులు ఖాయం అన‌డంలో అనుమానం లేదు. అందుకు నిద‌ర్శ‌నంగానే తాజా ప‌రిణామాలున్నాయి. ముఖ్యంగాRead More

లేటెస్ట్ స‌ర్వే: పెరిగిన జ‌గ‌న్ గ్రాఫ్

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో విప‌క్ష హ‌వా పెరుగుతోంది. గ‌త రెండు మూడు నెల‌ల్లో కూడా జ‌గ‌న్ కి ఆద‌ర‌ణRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *