పవన్ కి పరిష్కారం అతడే..

ys jagan pawan cbn
Spread the love

ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు కి అందరికన్నా పవన్ కళ్యాణ్ పెద్ద సవాల్ గా మారిపోయినట్టు కనిపిస్తోంది. బీజేపీ మొదటి నుంచి దూరం అవుతుందనే అభిప్రాయం అందరిలో కనిపించింది. టీడీపీ నేతల్లో కూడా అంచనాలున్నాయి. కానీ జనసేన మాత్రం దానికి భిన్నం. తమకు నమ్మిన మిత్రుడిగా పవన్ కనిపించినప్పటికీ ఆయన అనూహ్యంగా యూ టర్న్ తీసుకున్నారు. బాబుని టార్గెట్ చేసేశారు. అది మింగుడుపడిన టీడీపీ నేతలు తీవ్రంగా కలతచెందుతున్నారు. దాంతో పవన్ మూలంగా కలిగే నష్టంపై మల్లగుల్లాలు పడుతున్నారు. గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు గట్టెక్కడంలో పవన్ దే ప్రధాన పాత్ర. ముఖ్యంగా కాపులు మాత్రమే కాకుండా యువతలో బాబుకి ఆదరణ పెంచడంంలో పవన్ కీలకంగా వ్యవహరించారు. గడిచిన కొన్ని రోజులుగా బాబు మీద వ్యతిరేకత పెంచడంలో కూడా పవన్ ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అవినీతి, కులతత్వం సహా అనేక తీవ్ర ఆరోపణలతో బాబుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మూలంగా జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్ తో చెలిమి చేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని పలువురి అభిప్రాయం. ఇప్పటికే కాంగ్రెస్ తో కలిసి పార్లమెంట్ లో నిరసనలు సాగించిన టీడీపీకి తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తు పెద్ద సమస్య కాదు. కానీ ఏపీలో ఏమేరకు వారి స్నేహానికి ఛాన్సులున్నాయన్నది చర్చనీయాంశమే. దానికి తగ్గట్టుగా అడుగులు పడుతున్నాయనే చెప్పవచ్చు. అంత తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ కి 2శాతం పైగా ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం అవి 4శాతానికి పెరగవచ్చనే అంచనాలు టీడీపీ నేతల్లో కూడా ఉన్నాయి. దాంతో కాంగ్రెస్ తో కలిస్తే ఆమేరకు ఉపయోగం ఉంటుందనే లెక్కలు వేస్తున్నారు.

అందుకు తోడుగా జేడీ లక్ష్మీనారాయణ రంగంలో దిగితే పవన్ ఓట్లకు గండి కొట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తద్వారా పవన్ ని బలహీనపరిస్తే, కాపుల ఓట్లు చీలుతాయనే లెక్కలు వేస్తున్నారు. కోస్తాలో కాపు ఓట్లు ఎలా ఉన్నప్పటికీ రాయలసీమలో బలిజ ఓట్లన్నీ లక్ష్మీనారాయణ చీల్చేస్తారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా జనసేన స్టామినా మీద సందేహాలు పెరుగుతాయని, అనివార్యంగా జగన్ ని వ్యతిరేకించే వారంతా తమకే ఓట్లు వేస్తారని టీడీపీ భావిస్తోంది. జగన్, బీజేపీ మధ్య స్నేహాన్ని బాగా ఫోకస్ చేయగలిగితే అది టీడీపీకి బలం పెంచుతుందనే భావన వ్యక్తం అవుతోంది. అందుకు తగ్గట్టుగానే లక్ష్మీనారాయణకు మంచి కవరేజ్ కల్పించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అయితే లోక్ సత్తా, జేడీ ల పుణ్యాన పవన్ కి ఏమేరకు గండి పడుతుంది, అదే ఏవిధంగా టీడీపీ లోటుని పూడుస్తుందన్నది ప్రస్తుతానికి పూర్తిగా ఊహాజనితమే. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎటు అన్నది తేలితే కొంత స్పష్టత రావచ్చు.


Related News

tv9 srini raju

రాజ‌కీయ రంగంలో టీవీ9 యాజ‌మాన్యం

Spread the loveటీవీ9 చానెల్. తెలుగులో పేరెన్నిక‌గ‌న్న చానెల్. న్యూస్ చానెళ్ల విభాగంలో టాప్ ప్లేస్ లో నిలుస్తుంది. అందుకుRead More

9173_ysrcp-3

వైసీపీది వాపా?..బ‌ల‌మా??

Spread the loveవైసీపీలో ఊహించ‌ని ప‌రిణామాలు సాగుతున్నాయి. కొత్త ఊపు క‌నిపిస్తోంది. హోదా ఉద్య‌మం, బాబు యూ ట‌ర్న్ వ్య‌వ‌హారంRead More

 • ఏపీలో ఒంట‌రిగా మిగిలిన టీడీపీ!
 • టీడీపీ ఏం చెప్పుకోవాలి…?
 • బాబు బ‌లం మీద దెబ్బ కొడుతున్నారు..
 • బాబు కొత్త బంధం: ఆపార్టీతో టీడీపీ పొత్తు!
 • జ‌గ‌న్ పార్టీలోకి జంపింగ్ లు షురూ!
 • పవన్ కి పరిష్కారం అతడే..
 • ఆ ఇద్ద‌రూ త‌ప్ప..అంద‌రితోనూ అంటున్న టీడీపీ
 • పవన్ సీన్ మార్చేస్తారా…?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *