Main Menu

అయోమయమా..అవగాహనా లోపమా?

Spread the love

జనసేన రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో టీడీపీ మీద వ్యతిరేకత రానురాను పెరుగుతోంది. దాంతో ప్రత్యామ్నాయంగా వైఎస్ జగన్ పుంజుకుంటున్నారనే అంచనాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు కాబోతోంది. అందుకు తగ్గట్టుగా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించాలని అంతా ఆశిస్తున్నారు. అయితే ఆ పార్టీ వ్యవహారం మాత్రం అయోమయమా..అవగాహనా లోపమా అన్న చర్చను తెరమీదకు తెస్తోంది.

ఏపీలో బీజేపీ విషయంలో జనసేన స్పష్టంగా కనిపించడం లేదు. మోడీ చేతిలో పావుగా టీడీపీ విమర్శలు చేస్తున్నా సామాన్యులు దానిని పెద్దగా ఖాతరు చేయడం లేదు. ఇక వైసీపీ, జనసేన మధ్య స్నేహం చిగురిస్తే రాజకీయంగా ప్రకంపనలు ఖాయమనే వారు కూడా ఉన్నారు. అలాంటి అవకాశాలు లేవని తాజాగా పవన్ కళ్యాణ్ ప్రకటన స్పష్టం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే 175స్థానాలకు పోటీ చేస్తామని జనసేన చేసిన ప్రకటన వైసీపీతో పొత్తు చర్చలకు తెరవేసినట్టేనని చెప్పాలి.

అదే సమయంలో వామపక్షాలతో కూడా జనసేన పొత్తు ఉండదని, ఒంటరిగానే బరిలో దిగుతామని ఈ ప్రకటన సారాంశం. అదే జరిగితే జనసేన పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశమే. ముఖ్యంగా ఏపీలో బీజేపీ మీద వ్యతిరేకత ఉన్న దశలో వైసీపీ లేదా వామపక్షాలతో కలిసి సాగడం ద్వారా రాజకీయంగా కొంత బలపడే అవకాశం జనసేనకు ఉంటుంది. అందుకు భిన్నంగా సొంతంగా పోటీ చేస్తామనే పేరుతో ఒంటరి పయనం అసలుకే ఎసరు పెట్టే పరిస్థితిని తెస్తుంది. అప్పట్లో ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసీపీ కూడా సింగిల్ గా వెళ్లి చతికిలపడిన అనుభవాలున్నాయి. వాటిని పునరావ్రుతం చేస్తే పవన్ స్వయంక్రుతాపరాధం అవుతుంది. రాజకీయంగా అనుకూల శక్తులను కలిపి, ప్రత్యర్థిని ఓడించడం ద్వారా ఏదో మేర సానుకూల ఫలితాలు సాధించడం అవగాహన ఉన్న వారి లక్షణం. మరి పవన్ ఏ దారిన సాగుతారన్నది తాజా ప్రకటన అనుమానాలకు తావిస్తోంది.

ఇప్పటికే ఉద్యమాలలో కలిసి సాగుతున్న లెఫ్ట్ పార్టీలను కూడా లెఫ్ట్ చేసినట్టే అనుకుంటే పవన్ కి ఉన్న మిత్రులను కూడా కోల్పోయినట్టవుతుంది. ఓట్ల పరంగా పవన్ కి వామపక్షాల మూలంగా కలిగే ప్రయోజనాల మీద పలు సందేహాలు ఉండవచ్చు. కానీ ఒంటరిగా పోటీ చేయడం కన్నా, కొందరు మిత్రులతో కలిసి సాగడం ద్వారా కలిగే రాజకీయ ప్రయోజనం వేరుగా ఉంటుంది. ఈ విషయంలో జనసేన స్ట్రాటజిస్ట్ దేవ్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో..పవన్ ఎలా ఆచరిస్తారో చూడాలి.


Related News

ఐటీ ఉచ్చులో సీఎం!

Spread the loveఏపీలో ప‌రిణామాలు ఆస‌క్తిగా క‌నిపిస్తున్నా్యి. ముఖ్యంగా ఇన్ క‌మ్ ట్యాక్స్ అధికారుల దూకుడు అల‌జ‌డి రేపుతోంది. ముఖ్యంగాRead More

బాబుని మోడీ ఏమీ చేయ‌లేక‌పోవ‌డానికి కార‌ణం అత‌డే..!

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఇటీవ‌ల పూర్తి అభ‌ద్ర‌తా భావంతో క‌నిపిస్తున్నారు. ఎక్క‌డ చీమ చిటుక్కు మ‌న్నా త‌న‌కోస‌మే అన్న‌ట్టుగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *