జనసేనాని లక్ష్యం ఏమిటి?

Jana-Sena-81
Spread the love

పవన్ కల్యాణ్ పొలిటికల్ సీన్ ఇప్పటికీ సందిగ్ధంలోనే ఉంది. ఆయన రాజకీయ భవిష్యత్తు గందరగోళంగానే కనిపిస్తోంది. దానికి ఆయన ప్రకటనలకు, ఆచరణకు పొంతన లేకపోవడమే కారణం. తాజాగా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఓ ప్రకటన చేశారు. తాము తెలుగు రాష్ట్రాలలో బలమైన 175 స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించారు. బలమున్న చోటే రంగంలో దిగుతామని ట్వీట్ చేశారు. దాంతో ఇది మరింత ఆసక్తిగా కనిపిస్తోంది.

ముఖ్యంగా జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న విషయంలో ఇప్పటికే స్పష్టత ఉంది. కానీ గడిచిన ఎన్నికల్లో టీడీపీ తో కలిసి పోటీ చేసిన నేపథ్యంలో ఈసారి మళ్లీ బీజేపీ, టీడీపీలతో బందం కొనసాగిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశం. ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నగానే ఉంది. పలు ఊహాగానాలకు అవకాశం ఇస్తోంది. బీజేపీతో దూరంగా ఉన్నప్పటికీ చంద్రబాబుతో ఆయన స్నేహం కొనసాగవచ్చనే అంచనాలు మెండుగా ఉన్నాయి. అదే నిజమయితే టీడీపీతో పొత్తు ఉభయ రాష్ట్రాలకు ఉంటుందా లేక ఏపీకే పరిమితమా అన్నది మరో సందేహం. ఎందుకంటే ఉభయ రాష్ట్రాలలో కలిసి బలమైన 175 సీట్లకు పోటీ చేయబోతున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆ లెక్కన చూసుకున్న తెలంగాణాలో మొత్తం స్థానాలకు ఒంటరిగా 119 సీట్లకు పోటీ చేసినప్పటికీ మిగిలిన 56 సీట్లకు ఏపీలో పోటీ చేయాల్సి ఉంటుంది.

అంటే ఏపీలో టీడీపీతో పొత్తు కుదిరితే 56 సీట్లు జనసేనకు కేటాయించడం సాధ్యమేనా అన్న ప్రశ్న ఖాయంగా వస్తుంది. ముఖ్యంగా విశాఖ నుంచి గోదావరి జిల్లాలు, గుంటూరు వరకూ పవన్ కల్యాణ్ ప్రభావం రీత్యా టీడీపీ సీట్లు వదులుకోవడానికి సిద్ధపడినప్పటికీ ఎంత మేరకు త్యాగం చేయగలదన్నది సందేహమే. దానికి కారణం కూడా లేకపోలేదు. ఉదాహరణకు కనీసం జిల్లాకు 5 సీట్లు వదులుకోవాల్సి వచ్చినా పశ్చిమ గోదావరిలో పూర్తిగా తెలుగుదేశం సిట్టింగ్ స్థానాలు వదలుకోక తప్పదు. దానికి ఆపార్టీ ఎమ్మెల్యేలు సహకరిస్తారా అన్నది పెద్ద సమస్యగా మారబోతోంది. అలాంటి పరిస్థితుల్లో జనసేన ఆశించిన సీట్లను టీడీపీ వదలుకుంటుందా అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నే.

ఇన్ని సందేహాల మీద తాను పోటీ చేయదలచిన సీట్ల సంఖ్యను పవన్ కల్యాణ్ ప్రకటించడం రాజకీయంగా పలు అంశాలను ముందుకు తెస్తోంది. మిత్రపక్షంగా కొనసాగాలని భావించిన నేపథ్యంలో పవన్ ఇలాంటి ప్రకటన చేసి ఉండే వారు కాదని పలువురు భావిస్తున్నారు. తాను ఒంటరిగా తమకు బలమున్న చోట పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాతే ఇలాంటి ప్రకటన చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే పవన్ కల్యాణ్ బీజేపీతో పాటు టీడీపీకి కూడా దూరమవుతున్నట్టే భావించాలి. ఇక అప్పుడు ఏపీ రాజకీయ స్వరూపమే మారిపోతుంది. వైసీపీ ఒకవైపు, జనసేన మరోవైపు రంగంలో ఉంటే టీడీపీకి కొత్త తలనొప్పులు ఖాయం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని లెక్కించినప్పటికీ, 2009 నాటి ఫలితాలను ఆశించినా దానికి తగ్గ పరిస్థితులు ఇప్పుడు కష్టం. దానికి ప్రదాన కారణం ఆనాడు వైఎస్ పాలనలో పాజిటివ్ ఓట్ శాతం ఎక్కువగా కనిపించింది. కానీ ఇప్పుడు వ్యవహారం దానికి భిన్నం. చివరకు సిట్టింగులకు సీట్లిస్తే కేవలం 43 మంది మాత్రమే గట్టెక్కగలరని లగడపాటి సర్వేలో స్పష్టమయినట్టు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకతకు అది కొలబద్ధగా భావించవచ్చు. అలాంటప్పుడు చంద్రబాబుకి ముక్కోణపు పోటీలో మరిన్ని చిక్కులే తప్ప సానుకూల అంశాలు అసాధ్యం. అందుకే పవన్ కల్యాణ ప్రకటన టీడీపీ వర్గాలకు కూడా శిరోభారంగా మారబోతోందనే వాదనకు బలం చేకూరుస్తోంది.

అయితే ఇప్పటికే పలు అంశాలలో స్పష్టత లేని పవన్ కల్యాణ్ తాజా ప్రకటన కూడా అస్పష్టతకు నిదర్శమనే వారు కూడా లేకపోలేదు. అక్టోబర్ నుంచి పూర్తిగా రాజకీయాలే అని చెప్పిన పవన్ ఇప్పుడు దానికి భిన్నంగా ఉన్న తరుణంలో ఈ ఎన్నికల సీట్ల ప్రకటన కూడా ఆచరణ సాధ్యం కాదని లెక్కిస్తున్నారు. అయితే ఈ విషయంలో కొన్నాళ్లాగితే తప్ప జనపేనానికి కూడా క్లారిటీ ఉండే అవకాశం లేదు.


Related News

DMjD9f8VQAATMr7

అయినా..బాబు మారలేదు

Spread the loveమనిషి మారలేదు..అతని తనివి తీరలేదు అంటూ సినిమా దర్శకుడు రాసిన పాటను ఇక్కడ గుర్తు చేసుకుంటే చంద్రబాబుRead More

chandrababu-ravanth-reddy-647x450

బాబు ఖాతాలో మరో వికెట్ అంతే…!

Spread the loveతెలంగాణా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సొంత గూటిని వదిలి కాంగ్రెస్ పంచన చేరుతుండడం సంచలనంRead More

 • కేసీఆర్ వ్యూహం..బాబు జాతీయ హోదా గల్లంతు
 • వైసీపీ వ్యూహానికి బుట్టా బలి..
 • చంద్రబాబుకి ఓ ఇంటాయన లేఖ
 • మోడీకి మరో షాక్, దేశద్రోహులకు గ్రీన్ సిగ్నల్
 • కేసీఆర్ తో కేశవ్: కలచివేత ఎవరికి?
 • అమిత్ షా అవినీతికి ఆధారాలివిగో…
 • పవన్ కల్యాణ్ పొజిషన్ ఏంటి?
 • ఇదే మాట మరొకరు అనుంటే..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *