Main Menu

జ‌న‌సేన‌కు ఏమ‌య్యింది..?

Spread the love

ఏపీలో రాజ‌కీయాలు వేడెక్కాయి. నోటిఫికేష‌న్ తో సంబంధం లేకుండానే పార్టీల‌న్నీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో మునిగిపోయాయి. జ‌న‌సేన కూడా ఆశావాహుల నుంచి అభ్య‌ర్థ‌న‌లు స్వీక‌రిస్తోంది. కానీ రాజ‌కీయంగా ప్ర‌భావితం చేసే స్థాయిలో పార్టీ లేక‌పోవ‌డ‌మే ప‌లువురిని పెద‌వి విరుపుల‌కు గురిచేస్తోంది. మ‌ధ్యంలో కొంత ఊపు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఇటీవ‌ల పూర్తిగా చ‌ల్లారిపోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని చూసి ప‌లువురు నేత‌లు కూడా క‌ల‌వ‌ర‌పుడుతున్నారు. ఆనందంగా కండువా క‌ప్పుకున్న ఇత‌ర పార్టీల నేత‌లు ఇప్పుడు ఆలోచ‌న‌లో ప‌డ్డారు

వాస్త‌వానికి ఏపీ రాజ‌కీయాల్లో తృతీయ శ‌క్తిగా ఎదిగేందుకు ప‌వ‌న్ కి ఉన్న ఛ‌రిష్మా చ‌క్క‌ని ఆయుధం.కానీ స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో స‌ఫ‌లం కాలేక‌పోవ‌డం మెగా కుటుంబానికి ఓ శాపంలా క‌నిపిస్తోంది. 2018 మార్చిలో పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా చంద్ర‌బాబుపై మాట‌ల దాడి ఎక్కు పెట్టిన నాటి నుంచి ప‌వ‌న్ గ్రాఫ్ పెరుగుతూ వ‌స్తోంది. చివ‌ర‌కు విప‌క్ష వైసీపీని కూడా క‌ల‌వ‌ర‌ప‌రిచే స్థాయికి చేరింది. ప్రభుత్వ వ్య‌తిరేక ఓటు చీలుతుంద‌నే కంగారు జ‌గ‌న్ శిబిరంలో స్ప‌ష్టంగా క‌నిపించింది.

కానీ ప్ర‌స్తుతం వాతావ‌ర‌ణం పూర్తిగా మారిపోయింది. సెప్టెంబ‌ర్ త‌ర్వాత ప‌వ‌న్ చేష్ట‌ల్లో వ‌చ్చిన మార్పుల‌తో జ‌న‌సేన జ‌వ‌స‌త్వాలు సంత‌రించుకుంటుంద‌ని ఆశిస్తే మ‌ధ్య‌లోనే నీరుగారిపోయే ప‌రిస్థితి వ‌చ్చింద‌నే అబిప్రాయానికి ఊత‌మిస్తోంది. ఎన్నిక‌ల వేళ ఉండాల్సిన జ‌న‌సేనాని హైద‌రాబాద్ కి ప‌రిమితం అయ్యారు. ప్ర‌త్యేక హోదా అంశం గానీ , కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల విధానాల మీద గానీ ఉలుకూ ప‌లుకూ లేదు. ప్ర‌త్యేక విమానంలో పెనుగొండ వెళ్ల‌డ‌మే త‌ప్ప ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై బ‌లంగా స్వ‌రం వినిపించాల‌నే ఆలోచ‌న పార్టీ అధ్య‌క్షుడిగా ఆయ‌న‌కు లేక‌పోవడంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేని ప‌రిస్థితి జ‌న‌సైనికుల‌ది.

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో కూడా జ‌న‌సేన హ‌వా త‌గ్గిపోతుండ‌డం దానికి నిద‌ర్శ‌నం. ఆ పార్టీ అనుకూలుర్లోల కూడా నీర‌సం ఆవ‌రిస్తోంది. ఓవైపు సంక్షేమ ప‌థ‌కాల‌తో చంద్ర‌బాబు, పాల‌క పార్టీల నేత‌ల చేరిక‌తో జ‌గ‌న్ జోష్ లో ఉండ‌గా జ‌న‌సేన మాత్రం నిస్తేజంగా సాగ‌డం వారికి మింగుడుప‌డ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌తోనే ప‌లువురు ప‌వ‌న్ ప‌క్షాన చేరాల‌ని ఆశించిన నేత‌లు కూడా జ‌గ‌న్ తో చేతులు క‌లుపుతున్నారు. జ‌న‌సేన‌ని మ‌రింత బ‌ల‌హీన‌ప‌రిచేలా ప‌రిణామాలు ఉండ‌డంతో ప‌వ‌న్ మీద న‌మ్మ‌కం పెట్టుకున్న వారు కూడా ఇప్పుడు మౌనం వ‌హించ‌క త‌ప్ప‌డం లేదు.


Related News

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the loveతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

నాన్న బాట‌లోనే జ‌గ‌న్!

Spread the loveవైఎస్ జ‌గ‌న్ కొత్త పంథాలో సాగారు. తండ్రి వైఎస్సార్ ని అనుస‌రించారు. అభ్య‌ర్థుల విష‌యంలో వైసీపీ జాబితాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *