Main Menu

వైసీపీ ని టెన్ష‌న్ పెడుతున్న తెలంగాణా!

Spread the love

రాజ‌కీయాల్లో చిన్న అవ‌కాశాన్ని కూడా సానుకూలంగా మ‌ల‌చుకున్న వారే రాణిస్తారు. చిన్న చిన్న అవ‌కాశాల‌ను సద్వినియోగం చేసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌యితే చివ‌ర‌కు చేతులెత్తేయ‌క త‌ప్ప‌దు. అందుకే తెలంగాణా ఎన్నిక‌ల రూపంలో కేసీఆర్ అందించిన అవ‌కాశం త‌న‌కు ఉప‌యోగ‌పడాల‌ని జ‌గ‌న్ ఆశిస్తున్నారు. మ‌హాకూట‌మి పేరుతో తెలంగాణా టీడీపీ మిత్ర‌ప‌క్షాల‌తో జ‌త‌గ‌ట్టింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని రంగంలో దిగింది. 14 స్థానాల‌కు పోటీ చేస్తోంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో 14మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకున్న టీడీపీ ఈసారి అదే నెంబ‌ర్ కి పోటీ చేయాల్సి రావ‌డం విచిత్ర‌మే.

అయితే తెలంగాణా ఎన్నిక‌ల్లో పోటీకి వైసీపీ దూరంగా ఉంది. త‌న‌కు తాను జాతీయ అధ్య‌క్షుడిగా చెప్పుకున్న జ‌గ‌న్ కూడా తెలంగాణా ఎన్నిక‌ల బ‌రిలో దిగితే అది కాంగ్రెస్ ఓట్ల‌కు గండికొట్టేది. రెడ్డి సామాజిక‌వ‌ర్గంలో కొంత ఫాలోయింగ్ ఉన్న జ‌గ‌న్ కి ఏమేర‌కు ఓట్లు వ‌చ్చినా అవి కేసీఆర్ ప్ర‌యోజ‌నం నెర‌వేర్చ‌డానికి దోహ‌ద‌ప‌డేవి. త‌ద్వారా చంద్ర‌బాబు వ్య‌తిరేక శిబిరానికి స‌హ‌కరించిన‌ట్ట‌య్యేద‌ని కొంద‌రి అంచ‌నా. కానీ జ‌గ‌న్ పోటీకి దూరంగా ఉండ‌డంతో క‌మ్మ‌, రెడ్డి కాంబినేష‌న్ లో బ‌రిలో దిగిన టీడీపీ, కాంగ్రెస్ కూట‌మికి ఏదో మేర‌కు మేలు చేసే అంశ‌మేన‌ని అంచ‌నాలు వేస్తున్నారు.

అయితే టీడీపీకి తెలంగాణాలో చెక్ పెట్టేస్తే, అది ఏపీలో త‌మ‌కు ఉప‌యోగ‌మ‌ని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. త‌ద్వారా ఓట్ల చీలిక‌ని నివారించి జ‌గ‌న్ అభిమానుల ఓట్ల‌న్నీ కేసీఆర్ కి బ‌దలాయించే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. త‌ద్వారా మ‌హాకూట‌మి ఓట‌మి పాల‌యితే అది టీడీపీ శ్రేణుల‌ను నిరాశ‌లో ముంచుతుంద‌ని, చంద్ర‌బాబు మీద విశ్వాసం స‌న్న‌గిల్లుతుంద‌ని, కేసీఆర్ మ‌రోసారి గెల‌వ‌డం ద్వారా చంద్ర‌బాబుని చిక్కుల్లో నెట్టే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని వైసీపీ ఆశిస్తోంది. త‌ద్వారా నేరుగా కేసీఆర్ ని బ‌ల‌ప‌ర‌చ‌క‌పోయినా బాబు, ఆయ‌న మిత్రులు ఓడిపోవాల‌ని వైసీపీ కోరుకుంటున్న‌ట్టు సోష‌ల్ మీడియా సాక్షిగా స్ప‌ష్టం అవుతోంది.

అయితే అది అంత సులువుగా క‌నిపించ‌డం లేదు. తెలంగాణాలో మ‌హాకూట‌మి పుంజుకుంటుంద‌నే అంచ‌నాలు వైసీపీని క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. తెలంగాణా ఎన్నిక‌ల్లో మ‌హాకూట‌మి అధికారంలోకి వ‌స్తే అది చంద్ర‌బాబు నెత్తిన పాలుపోసిన‌ట్ట‌వుతుంది. ఏపీలో రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ శిబిరం బ‌రిలో దిగేందుకు తోడ్ప‌డుతుంది. పైగా చ‌క్రం తిప్పిన చంద్ర‌బాబు సామ‌ర్థ్యానికి ఆ ఫ‌లితాల‌ను నిద‌ర్శ‌నంగా చూపించ‌డానికి మీడియా స‌హ‌కారం స‌ర్వ‌వేళ‌లా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. అది వైసీపీకి నిరాశ క‌లిగించే అంశం. దాంతో ఇప్పుడు తెలంగాణాలో వైసీపీ పెట్టుకున్న ఆశ‌లు నెర‌వేరుతాయా లేదా అన్న టెన్ష‌న్ వారిలో మొద‌ల‌య్యింది. టీడీపీ ఎత్తులు ఫ‌లిస్తాయా అన్న‌ది ప్ర‌స్తుతానికి ప్ర‌శ్నార్థ‌కంగా ఉన్న‌ప్ప‌టికీ అవ‌కాశాలు లేక‌పోలేద‌నే అంచ‌నాల‌తో ఇప్పుడు తెలంగాణా వార్ ఏపీ పోరుని డిసైడ్ చేసే అంశంగా త‌యార‌వుతోంది. అందుకే వైసీపీ నేత‌లంతా కేసీఆర్ వైపు ఊపిరిబిగ‌బ‌ట్టి చూస్తున్నారు.


Related News

జ‌న‌సేనాని త‌న గోతిని తానే త‌వ్వుకున్న‌ట్టు!

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో అనూహ్య మార్పులు ఖాయం అన‌డంలో అనుమానం లేదు. అందుకు నిద‌ర్శ‌నంగానే తాజా ప‌రిణామాలున్నాయి. ముఖ్యంగాRead More

లేటెస్ట్ స‌ర్వే: పెరిగిన జ‌గ‌న్ గ్రాఫ్

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో విప‌క్ష హ‌వా పెరుగుతోంది. గ‌త రెండు మూడు నెల‌ల్లో కూడా జ‌గ‌న్ కి ఆద‌ర‌ణRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *