Main Menu

జ‌గ‌న్ డెడ్ లైన్ పెట్టారు..!

nellore ysrcp
Spread the love

ఏపీలో రాజ‌కీయాలు అనూహ్య మ‌లుపులు తిరుగుతున్నాయి. ఎవ‌రు, ఎప్పుడు ఏపార్టీలో ఉంటార‌న్న స్ప‌ష్ట‌త లేదు. త్వ‌ర‌లోనే ప‌లువురు అధికార పార్టీ పెద్ద‌లు విప‌క్ష వైసీపీ వైపు మ‌ళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇన్నాళ్లుగా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న కోసం ఎదురుచూసిన నేత‌ల‌కు అది ఫ‌లించ‌ద‌ని తేలిపోవ‌డంతో ప‌క్క‌చూపులు త‌ప్ప‌డం లేదు. ఈ వ‌రుస‌లో ఇద్ద‌రు టీడీపీ ఎంపీల పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి. అందులో ఒక‌రు గోదావ‌రి జిల్లాల నుంచి కాగా, మ‌రొక‌రు సీమ వాసి కావ‌డం విశేషం. ఇప్ప‌టికే గిద్ద‌లూరు టీడీపీలో కుదుపు మొద‌ల‌య్యింది. ఇంకా అనేక చోట్ల అదే ప‌రిస్థితి అనివార్యంగా మారుతోంది. అదే స‌మ‌యంలో టీడీపీ నేత‌ల‌క‌న్నా కాంగ్రెస్ లో ఉన్న ప‌లువురి దృష్టి వైసీపీ మీద ఉంది. ఇప్ప‌టికే చాలామంది నేత‌లు లోట‌స్ పాండ్ వ‌ర్గాల‌తో ట‌చ్ లో ఉన్నాయి. కొంద‌రికీ క్లారిటీ కూడా ఉంది. కానీ పార్టీలో చేరే విష‌యంలో మాత్రం కాస్త స‌మ‌యం తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే వైఎస్ జ‌గ‌న్ ఇలాంటి నేత‌ల విష‌యంలో స్ప‌ష్ట‌త కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. త‌న‌తో ట‌చ్ లో ఉన్న‌వారంద‌రికీ డెడ్ లైన్ పెట్టిన‌ట్టు ప్రాచారం సాగుతోంది. ప‌లువురు నేత‌లు స్థానిక ప‌రిస్థితుల గురించి ఆలోచ‌న‌లో ఉన్న స‌మ‌యంలో కాల‌యాప‌న కూడ‌ద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగా క‌ద‌లిక ప్రారంభించారు. ముఖ్యంగా వ‌చ్చే అక్టోబ‌ర్ 27 నుంచి పాద‌యాత్ర ప్రారంభం కాబోతున్న నేప‌థ్యంలో ఆలోగా కొత్త నేత‌ల‌కు తలుపులు తెరిచే యోచ‌న‌లో ఉన్నారు. కొత్త నేత‌ల ఆధ్వ‌ర్యంలోనే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర‌కు మార్గ‌ద‌ర్శ‌నం జ‌ర‌గాల‌ని అంచ‌నా వేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా అలాంటి నేత‌ల‌ను గుర్తించి ఇప్ప‌టికే వారికి సూచ‌న‌లు అందించిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే నంద్యాల ఎన్నిక‌ల నేప‌థ్యంలోనే శిల్పా బ్ర‌ద‌ర్స్ చేరిక సుగ‌మం అయ్యింది. అదే స‌మ‌యంలో శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గానికి కూడా దాదాపుగా శిల్పా చ‌క్ర‌పాణి ఖాయం కావ‌డంతో రెండు సీట్లు ఖాయం అయిపోయాయు. అంత‌కుముందే గంగుల బ్ర‌ద‌ర్స్ రాక‌తో ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల ఎంపీ సీటు ఖ‌రార‌య్యాయి. ప‌ల్నాడులో కూడా ప‌లు సీట్లు ఖ‌రార‌య్యాయి.

ఇక మిగిలిన నేత‌ల‌కు స‌బంధించి కూడా స్ప‌ష్ట‌త వ‌స్తే పార్టీకి ప్ర‌యోజ‌న‌క‌ర‌మ‌న్న అంచ‌నాలో పార్టీ క‌నిపిస్తోంది. ప్ర‌శాంత్ కిషోర్ కూడా ఇప్ప‌టికే సాగిస్తున్న స‌ర్వే ఆధారంగా బ‌ల‌మైన నేత‌ల‌కు గాలం వేసే ప్ర‌క్రియ సాగుతోంది. కందుకూరులో మ‌హిధ‌ర్ రెడ్డికి త్వ‌ర‌లోనే ముహూర్తం ఉంటుంద‌ని చెబుతున్నారు. ఆత‌ర్వాత మాజీ మంత్రులు బాల‌రాజు, వ‌ట్టి వసంత‌కుమార్, శైల‌జానాథ్, మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి వంటి వారి విష‌యంలోనూ వైసీపీ నుంచి సందిగ్ధ‌త తొల‌గించే ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. గోదావ‌రి జిల్లాల్లో కూడా ప‌లువురు నేత‌లు క్యూలో ఉన్న త‌రుణంలో అలాంటి వారంద‌రికీ వ్య‌వ‌హారాల‌కు ఫుల్ స్టాప్ పెట్టే లెక్క‌ల్లో ఉన్న‌ట్టు భావిస్తున్నారు. మ‌రి రాబోయే రెండు నెల‌ల్లో ఎంత మంది ఎటు మ‌ళ్లుతారో చూడాలి.« (Previous News)Related News

parliament211

టీడీపీకి అవిశ్వాస చిక్కులు

Spread the loveపార్ల‌మెంట్ లో అవిశ్వాసం రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి. హ‌ఠాత్తుగా కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో అవిశ్వాసంపై చ‌ర్చ‌, ఓటింగ్Read More

BJP-AP

బీజేపీని వీడాల‌నే త‌హ‌త‌హ‌లో…

Spread the loveగ‌డిచిన ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ ఊపు చూసి చాలామంది కాషాయ కండువాలు క‌ప్పుకున్నారు. కానీ ఇప్పుడా పార్టీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *