Main Menu

జ‌గ‌న్, ప‌వ‌న్ స్నేహం కోసం కీల‌క చ‌ర్చ‌లు

Spread the love

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు అనివార్యం అవుతున్నాయి. తాజాగా తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాలు కూడా ప్ర‌భావితం చేసేలా క‌నిపిస్తున్నాయి. ప్ర‌ధానంగా జాతీయ రాజ‌కీయాల పేరుతో తెలంగాణాలో కుదుర్చుకున్న కాంగ్రెస్ స్నేహాన్ని చంద్ర‌బాబు కొన‌సాగించ‌బోతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కూడా ఆ రెండు పార్టీలు క‌లిసి వెళ్లే ప్ర‌య‌త్నంలో ఉన్నాయి. టీడీపీతో త‌మ బంధం బ‌ల‌ప‌డుతుంద‌ని చెప్ప‌డానికి సంకేతంగానే కాంగ్రెస్ నేత‌లు విప‌క్షం మీద విమ‌ర్శ‌లు చేస్తున్నారు. చంద్ర‌బాబుని తీవ్రంగా విమ‌ర్శించిన నేత‌లు కూడా ఇప్పుడు స్వ‌రం మార్చి జ‌గ‌న్ మీద గురిపెడుతున్నారు.

అదే స‌మ‌యంలో గ‌త ఎన్నికల్లో ఒంట‌రిగా బ‌రిలో దిగి చివ‌రి నిమిషంలో చేతులు కాల్చుకున్న జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లోన‌యినా మిత్ర‌ప‌క్షాల‌ను కూడ‌గ‌ట్టుకోవాల‌నే ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగా ఇటీవ‌ల విశాఖ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో నేరుగా జ‌గ‌న్ త‌రుపున కొంద‌రు నేత‌లు చ‌ర్చ‌లు జ‌రిపార‌ని ప్ర‌చారం సాగింది. దానికి కొన‌సాగింపుగా తాజాగా మ‌రోసారి హైద‌రాబాద్ వేదిక‌గా జ‌గ‌న్, ప‌వ‌న్ వ‌ర్గాలు భేటీ కావ‌డం ఆస‌క్తి రేపుతోంది.

వైసీపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు పొడుస్తోంద‌న‌డానికి ఈ ప‌రిణామాలు సంకేతంగా భావిస్తున్నారు. ఇద్ద‌రు ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను ఐక్యం చేసేందుకు ప‌లువురు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ నేత‌లు కూడా చంద్ర‌బాబుకి పూర్తిగా చెక్ పెట్టే ప్ర‌య‌త్నంలో భాగంగా ఏపీ రాజ‌కీయాల్లో వేలు పెడ‌తామ‌ని చెప్పిన‌దానికి త‌గ్గ‌ట్టుగానే సాగుతున్నారు. అందులో భాగంగా కొత్త స్నేహితుల‌ను ద‌గ్గ‌ర‌కు చేర్చేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంద‌ని స‌మాచారం.

తాజాగా హైద‌రాబాద్ లో జ‌రిగిన ఓ అంత‌ర్గ‌త భేటీలో వ‌ప‌న్ క‌ళ్యాణ్ త‌రుపున సోద‌రుడు నాగేంద్ర‌బాబు హాజ‌రుకావ‌డం, ఆ స‌మావేశంలో విజ‌య‌సాయిరెడ్డి, కేవీపీ రామ‌చంద్ర‌రావుతో పాటుగా మై హోమ్స్ రామేశ్వ‌ర‌రావు కూడా పాల్గొన‌డం ఆస‌క్తిగా మారింది. అటు వైసీపీ, ఇటు జ‌న‌సేన మ‌ధ్య సంధాన క‌ర్త‌గా మైహోమ్స్ రామేశ్వ‌ర రావు వ్య‌వ‌హ‌రించిన‌ట్టు తెలుస్తోంది. దానికి కేసీఆర్ ప్రోద్భ‌ల‌మే కార‌ణ‌మ‌ని ప్ర‌చారం మొద‌ల‌య్యింది. ప్ర‌ధానంగా వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో క‌లిసి సాగ‌డంపైనే చ‌ర్చ సాగిన‌ట్టు తెలుస్తోంది. చ‌ర్చ‌లు ఓ కొలిక్కి రాక‌పోవ‌డంతో మ‌ళ్లీ, మ‌ళ్లీ భేటీలు నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని చెబ‌తున్నారు.

హైద‌రాబాద్ కొంప‌ల్లిలోని ఓ రిటైర్డ్ అధికారి ఇంట్లో ఈ చ‌ర్చ‌లు సాగిన‌ట్టుగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకుంటే జ‌న‌సేన‌కు సుమారుగా 20 అసెంబ్లీ సీట్లు, నాలుగు ఎంపీ స్థానాలు కేటాయించేందుకు వైసీపీ నేత‌లు సుముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. అదే స‌మ‌యంలో తెలంగాణాలో కూడా ప‌వ‌న్ త‌న మ‌ద్ధ‌తు నేరుగా కేసీఆర్ కి ప్ర‌క‌టించే అవ‌కాశం కూడా ఉంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత‌తో మాట్లాడిన త‌ర్వాత ఈ వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తుంద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. యూఎస్ నుంచి తిరిగివ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో నాగేంద్ర‌బాబు స‌మావేశ‌మ‌య్యి, చ‌ర్చ‌ల సారాంశాన్ని వెల్ల‌డిస్తార‌ని అంటున్నారు. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే ఏపీలో కొత్త బంధం బ‌య‌ట‌కు వ‌స్తుంది. అధికార‌పార్టీ ఆశ‌ల‌కు అడ్డుక‌ట్ట వేసే రీతిలో ఈ స్నేహం సాగాల‌ని ఆశిస్తున్న వారికి ఏమేర‌కు సంతృప్తి క‌లుగుతుందో చూడాలి.


Related News

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the loveతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

నాన్న బాట‌లోనే జ‌గ‌న్!

Spread the loveవైఎస్ జ‌గ‌న్ కొత్త పంథాలో సాగారు. తండ్రి వైఎస్సార్ ని అనుస‌రించారు. అభ్య‌ర్థుల విష‌యంలో వైసీపీ జాబితాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *