Main Menu

నాన్న బాట‌లోనే జ‌గ‌న్!

Spread the love

వైఎస్ జ‌గ‌న్ కొత్త పంథాలో సాగారు. తండ్రి వైఎస్సార్ ని అనుస‌రించారు. అభ్య‌ర్థుల విష‌యంలో వైసీపీ జాబితా ప్ర‌క‌ట‌న విష‌యంలో మొత్తం ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల‌కు ఒకేసారి అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం ద్వారా 2009లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి అనుస‌రించిన మార్గంలో జ‌గ‌న్ ప‌య‌నించారు. ముహూర్తం కావ‌డంతో గ‌త రాత్రి 9మంది ఎంపీల పేర్ల‌ను ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ తాజాగా జాబితాలో మొత్తం అంద‌రి పేర్లు ప్ర‌స్తావించారు.

అదే స‌మ‌యంలో రాజశేఖ‌ర్ రెడ్డిని మించి బీసీల‌కు ప్రాధాన్య‌త‌నివ్వ‌డం విశేషం. కాపుల‌కు , బీసీల‌కు పెద్ద పీట వేయ‌డం ద్వారా జ‌గ‌న్ సామాజిక స‌మీక‌ర‌ణాల విష‌యంలో ప‌లు జాగ్ర‌త్తలు తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. న‌లుగురు సిట్టింగుల‌కు జ‌గ‌న్ టికెట్లు నిరాకిరంచారు. వారిలో తిప్పేస్వామి, సునీల్ కుమార్ తో పాటు ఐజ‌య్య , జంకే వెంక‌ట‌రెడ్డి ఉన్నారు.

అదే స‌మ‌యంలో 41 మంది బీసీలు, 42 మంది కాపుల‌కు టికెట్లు ద‌క్క‌డం విశేషం. 7 ఎంపీ సీట్లు కూడా కేటాయించ‌డంతో వైసీపీ జాబితాలో బిసిలకు 25% అసెంబ్లీ సీట్లు , 28% ఎంపీ సీట్లు ద‌క్కాయి. మ‌రో 5గురు మైనార్టీల‌కు సీట్లు ఇచ్చారు. త‌ద్వారా సామాజిక స‌మీక‌ర‌ణాల్లో జ‌గ‌న్ కొత్త పంథా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.






Related News

చంద్ర‌బాబు జూన్ 8 మీద ఎందుకు గురిపెట్టారు?

Spread the loveచంద్ర‌బాబు తీవ్ర స‌మ‌స్య‌ల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆయ‌న రాజ‌కీయంగా అత్యంత సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌లRead More

జ‌న‌సేన ఆశ‌ల‌న్నీ అక్క‌డే..!

Spread the loveఎన్నిక‌లు ముగిశాయి. కానీ ఫ‌లితాల కోసం సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ప్ప‌క‌పోవ‌డంతో ర‌క‌ర‌కాల అంచ‌నాలు ముందుకొస్తున్నాయి. అయితే సాధార‌ణRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *