బాబు వద్దంటుంటే..జగన్ కావాలంటున్నారు

jagan cbn
Spread the love

అధికార పక్షం సై అంటే, విపక్షం నై అనడం సహజమే అనుకుంటున్నారా. కానీ ఇక్కడ వ్యవహారం వేరు. అధికారపక్షానికి మిత్రపక్షం కత్తులు నూరుతోంది. యుద్ధరంగానికి దిగాలని ఆశిస్తోంది. అయినా పాలక టీడీపీ మాత్రం మరికొంత సమయం కావాలంటోంది. ముందస్తుకు సిద్ధం కాలేమని చెబుతోంది. నిర్ణీత కాలవ్యవధిలోనే ఎన్నికలు జరగాలని ఆశిస్తోంది. కానీ ఆపార్టీ ఆశించినట్టు కేంద్రంలో జరగడం లేదు. ముఖ్యంగా మోడీ అసలు అంగీకరించడం లేదు. చంద్రబాబు అంచనాలకు భిన్నంగానే మోడీ వ్యవహారం ఉంటోంది.

అయితే ముందస్తు ఎన్నికల విషయంలో జగన్ మాత్రం ఎంతో ఆశాభావంతో ఉన్నారు. వీలయినంత త్వరగా ఎన్నికలు జరగాలని ఆశిస్తున్నారు. బాబు వద్దంటున్న వాటిని కావాలని పట్టుబడుతున్నారు. కేంద్రం దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటుందనే ఆకాంక్షతో సాగుతున్నారు. వాస్తవానికి ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తనకే అధికారం అనే విశ్వాసం జగన్ లో కనిపిస్తోంది. వచ్చేది మన ప్రభుత్వమేనని ఆయన పాదయాత్ర పొడవునా పదే పదే చెబుతున్నారు. అదే సమయంలో ముందస్తు ఎన్నికలయితే మరింత త్వరగా ముఖ్యమంత్రి కాగాలనే అభిప్రాయంతో బలంగా సాగుతున్నారు.

దాంతోపాటుగా ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న జగన్ తన యాత్రను మే తర్వాత ముగించబోతున్నారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే నాలుగైదు నెలల వ్యవధిలో ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అది రాజకీయంగా వైసీపీకి మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. ఎంత కాదని చెప్పినా పాదయాత్ర ప్రభావం ఖచ్చితంగా ఉంటుందన్నది అనుభవం. ఇప్పుడు కూడా పాదయాత్ర ముగిసిన కొద్దికాలానికే ఎన్నికలు వస్తే అది విపక్ష వైసీపీకి మంచి వరంగా మారుతుంది. అందుకే చంద్రబాబు ముందస్తుని జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ జగన్ మాత్రం దానికోసం ఆశతో ఎదురుచూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Related News

tdp mps meeting

టీడీపీలో రాజ్య‌స‌భ లొల్లి…

Spread the loveఏపీలో మారిన రాజ‌కీయ ప‌రిణామాల‌తో వ‌చ్చే రాజ్య‌స‌భ ఎన్నిక‌లు ఆస‌క్తిగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం మూడు సీట్లు ఖాళీRead More

bjp

బీజేపీ ఎదురుదాడి ఫ‌లిస్తుందా…?

Spread the loveఏపీలో క‌మ‌ల‌నాధులు తీవ్రంగా క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. నాలుగేళ్ల క్రితం క‌ళ‌క‌ళ‌లాడిన క్యాంప్ ఇప్పుడు తీవ్రంగా క‌ల‌త చెందుతోంది. అస‌లుRead More

 • జ‌గ‌న్ వ్యూహాత్మ‌క అడుగులు..
 • గేరు మార్చిన జగన్
 • మో’ఢీ’ అంటున్న బాబు…ఏం జరగబోతోంది?
 • పవన్ పథకం పారుతుందా..
 • మోడీ ముందు మోకరిల్లిన తెలుగు ఎంపీలు
 • జగన్ ఇరుక్కుంటున్నట్టే
 • బాబుకి బూమరాంగ్ అయ్యింది…!
 • బాబు వద్దంటుంటే..జగన్ కావాలంటున్నారు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *