Main Menu

జ‌గ‌న్ క‌న్ను అక్క‌డే..!

Spread the love

గ‌డిచిన ఎన్నిక‌ల్లో చావుదెబ్బ తిన్న చోట ఈసారి స‌త్తా చాటాల‌ని వైసీపీ ఆశిస్తోంది. ముఖ్యంగా 2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో గుంటూరు నుంచి శ్రీకాకుళం వ‌ర‌కూ 7 జిల్లాల‌కు గానూ వైసీపీ కేవ‌లం 23 స్థానాలు మాత్ర‌మే ద‌క్కించుకోగ‌లిగింది. దాంతో ఈసారి అటు ఉత్త‌రాంధ్ర‌, గోదావ‌రి జిల్లాల‌తో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పాగా వేయాల‌ని ఆపార్టీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా పావులు క‌దుపుతోంది.

ఏడు జిల్లాల ప‌రిధిలో 102 స్థానాలున్నాయి. అయినా అధికార కూట‌మి 79 సీట్లు గెలుచుకోవ‌డంతో జ‌గ‌న్ అధికార పీఠం మీద పెట్టుకున్న ఆశ‌లు వ‌మ్ముకాక త‌ప్ప‌లేదు. కానీ ఈసారి సీన్ మారుతోంది ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీ గాలి వీస్తుంద‌నే అంచ‌నాలున్నాయి. విశాఖ న‌గ‌రం మిన‌హా రూర‌ల్, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళంలో వైసీపీ అధిక్యం ఖాయంగా చెబుతున్నారు. ఇక గోదావ‌రి జిల్లాల్లో కూడా గ‌డిచిన ఎన్నిక‌ల్లో కేవ‌లం 34 అసెంబ్లీ సీట్ల‌లో 5 మాత్ర‌మే గెలిచింది. అవి కూడా తూర్పునే కావ‌డం విశేషం. ఈసారి తూర్పున సీట్లు సంఖ్య పెర‌గ‌డం ఖాయంగా ఉంది. అదే స‌మ‌యంలో ప‌శ్చిమాన కూడా ప్ర‌భావం చూపి ఫ‌లితాలు సాధించాల‌నే త‌హ‌త‌హ‌ల‌తో విప‌క్ష శ్రేణులున్నాయి.

కృష్ణా గుంటూరులో కూడా గ‌తంలో వ‌చ్చిన 9 స్థానాల‌కు ఈసారి క‌నీసం రెండు మూడు సీట్ల‌యినా పెరిగే అవ‌కాశాలు మెండుగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో గ‌తంలో ల‌భించిన సీట్ల‌ను ఈప్రాంతంలో రెట్టింపు చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ అనుకూలురు అంచ‌నాలు వేస్తున్నారు. అదే జ‌రిగితే రాయ‌ల‌సీమ‌, నెల్లూరు ప్ర‌కాశం ప‌రిధిలో ల‌భించే స్ప‌ష్ట‌మైన ఆధిక్యం ఈసారి అధికారానికి చేరువ చేస్తుంద‌నే లెక్క‌లు వేస్తున్నారు. అందుకు కార‌ణాలు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక‌వ‌ర్గం పూర్తిగా టీడీపీకి దూరం కావ‌డం ఈ జిల్లాల్లో పెను ప్ర‌భావం చూప‌వ‌చ్చ‌ని అంచ‌నాలు వేస్తున్నారు. అంతేగాకుండా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌డం, గ‌తంతో పోలీస్తే వైసీపీలో బ‌ల‌మైన నేత‌లు చేరిక కూడా క‌లిసి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.

మొత్తంగా విప‌క్షం పెట్టుకున్న ఆశ‌లు నెర‌వేరేందుకు అవ‌కాశాలు ఉన్నాయా లేదా అన్న దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. పాద‌యాత్ర‌కు ల‌భించిన ఆద‌ర‌ణ‌తో ఉత్సాహంతో ఉన్న నేత‌లు ధీమాతో వేస్తున్న అంచ‌నాలు త‌ప్పుతాయా లేక రెట్టించిన ఫ‌లితాలు వ‌స్తాయా అన్న‌ది చూడాలి.






Related News

బాబుని కేసీఆర్ మాత్ర‌మే కాపాడాలి..!

Spread the love8Sharesఏపీలో తెలుగుదేశం రూటు మార్చింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే టీడీపీ అధినేత‌తో పాటు పార్టీ శ్రేణుల ధోర‌ణి మారుతోంది.Read More

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the love8Sharesతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *