Main Menu

జ‌గ‌న్ ముందు మోడీ మోక‌రిల్లాల్సిందే!

Spread the love

రాజ‌కీయాలు బ‌ళ్లు ఓడ‌లు కావ‌డం, ఓడ‌లు బ‌ళ్లు కావ‌డం చాలా స‌హ‌జం. ఎవ‌రి హ‌వా ఎప్పుడు చెల్లుతుందో చెప్ప‌లేం. ఢిల్లీలో చ‌క్రం తిప్ప‌గ‌ల స‌మ‌ర్థుడిగా కీర్త‌న‌లు అందుకున్న చంద్ర‌బాబు ఇప్పుడు ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నారో అంద‌రూ చూస్తున్నాం. అలాగే గ‌డిచిన 5 ఏళ్ల‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ హవా కూడా చూశాం. ఆయ‌న మాటే వేద‌వాక్కుగా సాగింది. ఆయ‌న చెప్పిందే శాస‌నం అన్న‌ట్టుగా న‌డిచింది. కానీ ప‌రిస్థితులు అన్ని సార్లు ఒకేలా ఉండ‌వు కాబ‌ట్టి, తాజా ఎన్నిక‌ల త‌ర్వాత ఆయ‌న మ‌ళ్లీ నేల మీద‌కు దిగిరాక త‌ప్ప‌ని స్థితి అనివార్యం అనే అంచ‌నాలు వినిపిస్తున్నాయి.

వాస్త‌వ ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే తాజా ఎన్నిక‌ల్లో మోడీకి అద‌న‌పు బ‌లం చేకూర్చే అంశాలు క‌నిపించడం లేదు. పైగా ప‌లు బ‌ల‌హీన‌త‌లు ఎదురుగా ఉన్నాయి. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ప్ర‌బ‌లంగా క‌నిపిస్తోంది. మోడీ మాట‌ల‌ను మ‌ళ్లీ విశ్వ‌సించే ప‌రిస్థితి కాన‌రావ‌డం లేదు. ఈ ద‌శ‌లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో క‌నీసంగా 100 స్థానాల‌ను బీజేపీ కోల్పోవడం అనివార్యంగా క‌నిపిస్తోంది. ఉత్త‌రాదిలో ముఖ్యంగా హిందీ బెల్టులోని యూపీ, రాజ‌స్తాన్, మ‌ధ్య‌ప్ర‌దేశ్, గుజ‌రాత్ ల‌లో బీజేపీకి పెద్ద స్థాయిలో గండిప‌డ‌బోతోంది. దాంతో అనివార్యంగా మోడీ మిత్రుల మీద ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితి త‌ప్ప‌డం లేదు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో మోడీకి ప్ర‌స్తుతం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ చీఫ్ జ‌గ‌న్ మీద మోడీ గంపెడాశ‌లు పెట్టుకున్నార‌న్న‌ది వాస్త‌వం. అయితే ఫ‌లితాల త‌ర్వాత ఈ ఇద్ద‌రూ ఖ‌చ్చితంగా మోడీ వెంట న‌డుస్తార‌నే ధీమా క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటున్నారు. పైగా కేసీఆర్ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి వెంట‌వెంట‌నే నిర్ణ‌యాలు మార్చేసుకునే ర‌కం అన్న‌ది కాద‌న‌లేని స‌త్యం. 2009 నాటి అనుభ‌వం అందుకు తార్కాణం. ఇక జ‌గ‌న్ కూడా ప్ర‌త్యేక హోదా అంటూ పైకి చెబుతున్న‌ప్ప‌టికీ ఆయ‌న ప్ర‌యోజ‌నాలు ఆయ‌న‌కుంటాయి. ఈ త‌రుణంలో మోడీ ఖ‌చ్చితంగా కేసీఆర్ తో పాటు జ‌గ‌న్ ముందు మోక‌రిల్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో కేంద్రంలో ఈసారి కూడా అనూహ్యంగా ఎవ‌రో ఒక నేత తెర‌మీద‌కు వ‌చ్చే అవ‌కాశాలు స్ప‌ష్టంగా ఉన్నాయి. కొత్త మొఖాలు ప్ర‌ధాని పీఠం కోసం కాచుకుని కూర్చున్న త‌రుణంలో కిస్సా కుర్సీకా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశ‌మే. రాజ‌కీయంగా ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాలు అనూహ్యంగా ఉంటాయి. మోడీకి మ‌ద్ధ‌తు ల‌భిస్తుందా లేక కాషాయం నుంచి కొత్త నేత వ‌స్తారా లేక మ‌రో క్యాంప్ సన్న‌ద్ధ‌మ‌వుతుందా అన్న‌ది ఆనాటి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఉంటుంది. అందులో జ‌గ‌న్ వంటి వారు కీల‌కంగా ఉంటార‌న‌డంలో సందేహం లేదు. ఏపీలో అధికారంతో సంబంధం లేకుండా వైసీపీకి క‌నీసంగా 12 , గ‌రిష్టంగా 20 స్థానాలు ల‌భ్య‌మ‌య్యే అవ‌కాశం ఉన్న త‌రుణంలో దేశంలోనే కీల‌కంగా మ‌ర‌బోతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.


Related News

చంద్ర‌బాబు జూన్ 8 మీద ఎందుకు గురిపెట్టారు?

Spread the loveచంద్ర‌బాబు తీవ్ర స‌మ‌స్య‌ల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆయ‌న రాజ‌కీయంగా అత్యంత సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌లRead More

జ‌న‌సేన ఆశ‌ల‌న్నీ అక్క‌డే..!

Spread the loveఎన్నిక‌లు ముగిశాయి. కానీ ఫ‌లితాల కోసం సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ప్ప‌క‌పోవ‌డంతో ర‌క‌ర‌కాల అంచ‌నాలు ముందుకొస్తున్నాయి. అయితే సాధార‌ణRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *