Main Menu

అలాంటిదేమీ లేదు..క్లారిటీ ఇచ్చేసిన జ‌గ‌న్!

Spread the love

ఏపీ విప‌క్ష నేత త‌న సొంత సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న రాజ‌కీయ భ‌విత‌వ్యానికి సంబంధించిన స్ప‌ష్ట‌త ఇచ్చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రి పోరేన‌ని తేల్చేశారు. కాంగ్రెస్, మోడీ కూడా ఏపీ కి అన్యాయం చేశార‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు మోసం చేశార‌ని విమ‌ర్శించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ముసుగులో కాకుండా నేరుగా చంద్ర‌బాబు తో క‌లిసి రావాల‌ని కోరుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌లిస్తే త‌న‌కు బాధేమీ లేద‌ని, అంద‌రూ క‌లిసి వ‌స్తేనే మంచిద‌ని సూచించారు.

ఇక పోల‌వ‌రం, అమ‌రావ‌తి వంటి విష‌యాల్లో కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేశారు. అమ‌రావ‌తిలో జ‌రిగిన అవినీతిపై విచార‌ణ త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. రాజ‌ధాని ప్ర‌క‌ట‌న నుంచి భూ కేటాయింపుల వ‌ర‌కూ వివిధ ర‌కాల అవినీతి సాగింద‌ని వివ‌రించారు. పోల‌వ‌రం విష‌యంలో కూడా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌య్యింద‌న్నారు.

ఇక త‌న పార్టీ అభ్య‌ర్థుల ఎంపిక జ‌రుగుతోంద‌న్నారు. నిత్యం త‌మ సొంత స‌ర్వేల స‌హాయంతో స‌మీక్ష‌లు జ‌రుపుతూనే ఉన్నామ‌న్నారు. అయితే ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర ముగింపులో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం లేద‌ని తేల్చేశారు. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ఉంటుందంటూ సాగుతున్న ప్ర‌చారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. అభ్య‌ర్థులను ప్ర‌క‌టిస్తేఏ సంచ‌ల‌న‌మా అంటూ జ‌గ‌న్ ఎదురు ప్ర‌శ్న వేశారు. దాంతో అభ్య‌ర్థుల విష‌యంలో జ‌గ‌న్ ఆచితూచి అడుగువేసే అవ‌కాశం ఉంద‌ని తేలిపోయింది.

రైతురుణ‌మాఫీ, డ్వాక్రా అక్క చెల్లెమ్మ‌ల రుణాలు, ఇంటికో ఉద్యోగం , నిరుద్యోగ భృతి స‌హా అన్నింటిలోనూ ప్ర‌భుత్వం మోసం చేసింద‌న్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మీద ఛార్జ్ షీట్ పేరుతో పుస్త‌కం వేసిన కాంగ్రెస్ ఆయ‌న‌తో క‌లిసి వెళ్ల‌డాన్ని ఎద్దేవా చేశారు. అప్ప‌ట్లో త‌న‌ను త‌ల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ ఎద్దేవా చేసి ఇప్పుడు అదే కాంగ్రెస్ తో క‌లిసి ఖ్యాతి చంద్ర‌బాబుద‌న్నారు. బీజేపీతో ఇప్పటికీ చంద్ర‌బాబుకి లోపాయికారీ సంబంధాలు కొన‌సాగుతున్నాయేమోనంటూ అనుమానం వ్య‌క్తం చేశారు. తాము నాలుగున్న‌రేళ్లుగా ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై పోరాడి, చివ‌ర‌కు ప్ర‌జాక్షేత్రంలోనే పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉన్నామ‌న్నారు. అనేక స‌మ‌స్య‌లు ఎలుగెత్తి చాట‌మ‌న్నారు. ప్ర‌త్యేక హోదా కోసం పోరాడిన తాము 25 ఎంపీల‌ను గెల‌చుకుని జాతీయ స్థానంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌న్నారు. కేసీఆర్ కూడా మ‌ద్ధ‌తివ్వ‌డంతో హోదాకి 42 మంది ఎంపీల మ‌ద్ధ‌తు ద‌క్క‌బోతోంద‌న్నారు.


Related News

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the loveతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

నాన్న బాట‌లోనే జ‌గ‌న్!

Spread the loveవైఎస్ జ‌గ‌న్ కొత్త పంథాలో సాగారు. తండ్రి వైఎస్సార్ ని అనుస‌రించారు. అభ్య‌ర్థుల విష‌యంలో వైసీపీ జాబితాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *