Main Menu

చంద్ర‌బాబుకి క్యాబినెట్ క‌ష్టాలు త‌ప్ప‌వా?

Spread the love

ఏపీ రాజ‌కీయాల్లో తాజా ప‌రిణామాలు తెలుగుదేశం పార్టీని తీవ్రంగా కలచివేస్తున్నాయి. ఇన్నాళ్లుగా కేవ‌లం వైసీపీని ఎదుర్కొంటూ, ఆపార్టీని చీల్చ‌డానికి సైతం ప్ర‌య‌త్నించేంత‌ వ‌ర‌కూ సాగిన టీడీపీకి వ‌రుస‌గా బీజేపీ, జ‌న‌సేన నుంచి వ‌స్తున్న ఎదురుదాడితో త‌ల్ల‌డిల్లిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో అనేక‌మార్లు చంద్ర‌బాబు నిర్ణ‌యాల్లో మార్పులు త‌ప్ప‌డం లేదు. ఆయ‌న ప్ర‌క‌ట‌న‌ల్లో కూడా అనూహ్య మార్పులు వ‌స్తున్నాయి.

అయితే తాజాగా చంద్ర‌బాబు మ‌రోసారి తేనెతుట్ట లాంటి క్యాబినెట్ మార్పుల‌ను చంద్ర‌బాబు నెత్తిన పెట్టుకుంటార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. మ‌రోసారి మంత్రివ‌ర్గ మార్పుల‌కు చంద్ర‌బాబు సిద్ద‌మ‌వుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. మూడో సారి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు చంద్ర‌బాబు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అయితే గ‌త ఏడాది ఏప్రిల్ లో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ నాటి ప‌రిణామాల ప్ర‌భావం నేటికీ చ‌ల్లార‌లేదు. బుచ్చ‌య్య చౌద‌రి, క‌ర‌ణం బ‌ల‌రాం వంటి వారు స్పందించిన తీరు టీడీపీకి త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టింది. చివ‌ర‌కు క్యాబినెట్ లో చోటు ద‌క్క‌లేద‌నే నిరాశ‌తో అనేక మంది నేరుగా చంద్ర‌బాబు మీదే నిప్పులు చెల‌రేగ‌డంతో ప‌రిస్థితులు చ‌ల్లార‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టింది.

అయితే ఇప్పుడు ఎన్నిక‌లకు ముందు మ‌రోసారి క్యాబినెట్ లో మార్పు వ‌స్తాయ‌నే వాద‌న‌తో టీడీపీలో క‌ద‌లిక ప్రారంభ‌మ‌య్యింది. ప‌లువురు ఆశాభావంతో క‌నిపిస్తున్నారు. ముఖ్యంగా ఇద్ద‌రు బీజేపీ మంత్రులు రాజీనామాలు చేయ‌డంతో ఖాళీలు ఏర్ప‌డ్డాయి. అదే స‌మ‌యంలో కొంద‌రు సీనియ‌ర్లకి కూడా ప‌ట్టంక‌ట్ట‌డం ఉప‌యోగ‌మ‌నే అబిప్రాయంతో చంద్ర‌బాబు ఉన్నార‌ని చెబుతున్నారు. ఇప్పుడున్న క్యాబినెట్ లో అనేక‌మంది జూనియ‌ర్లు ఉన్నారు. సీనియ‌ర్ల ప‌నితీరుతో కూడా చంద్ర‌బాబు స‌న్నిహితంగా లేరు. దాంతో ప్ర‌భుత్వ ప‌నితీరు పార్టీకి పెద్ద‌గా ప్ర‌యోజ‌న‌క‌రంగా లేద‌నే అభిప్రాయం వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలోనే క్యాబినెట్ మార్పుల‌కు చంద్ర‌బాబు స‌న్న‌ద్ద‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది.

కానీ మ‌రోసారి మంత్రి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ అంటే మాత్రం టీడీపీలో ఆశావాహుల సంఖ్య భారీగా ఉంటుంది. అనేక‌మంది త‌మ‌కు అమాత్య హోదా ద‌క్కాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా కొన్ని సామాజిక వ‌ర్గాల్లో ఈపోటీ తీవ్రంగా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. క‌మ్మ సామాజిక‌వ‌ర్గ పెద్ద‌ల్లో కోడెల‌, దూళిపాళ‌, ప‌య్యావుల‌, గోరంట్ల‌, చింత‌మ‌నేని స‌హా అనేక‌మంది త‌మ‌కు ఛాన్స్ ద‌క్కాల‌ని గ‌డిచిన క్యాబినెట్ విస్త‌ర‌ణ‌లోనే గ‌ట్టిగా ప్ర‌య‌త్నించారు. ఇప్పుడు కూడా క్యూలో ఉంటారు. వారిలో ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కినా మిగిలిన వారు తీవ్రంగా స్పందించే ప్ర‌మాదం ఉంటుంది. అదే స‌మ‌యంలో కేవ‌లం ఎస్టీ, మైనార్టీ నేత‌లకు అవ‌కాశం ఇవ్వ‌డానికే విస్త‌ర‌ణ ప్ర‌య‌త్నం జ‌రిగినా అది కూడా పెద్ద స‌మ‌స్య‌గా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ నేప‌థ్యంలో ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలో చంద్ర‌బాబు అద‌న‌పు భారాన్ని నెత్తిన పెట్టుకుంటారా అన్న ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. దాంతో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ సాధ్య‌మా..లేదా అన్న‌ది చంద్ర‌బాబు నిర్ణ‌యం మీద ఆధార‌ప‌డి ఉంటుంది.


Related News

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the loveతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

నాన్న బాట‌లోనే జ‌గ‌న్!

Spread the loveవైఎస్ జ‌గ‌న్ కొత్త పంథాలో సాగారు. తండ్రి వైఎస్సార్ ని అనుస‌రించారు. అభ్య‌ర్థుల విష‌యంలో వైసీపీ జాబితాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *