Main Menu

చంద్ర‌బాబు ఆందోళ‌న చెందుతున్నారా?

Spread the love

అనుమానం వ‌స్తోంది. ఆయ‌న వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో తీవ్రంగా క‌ల‌త చెందుతున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తాజాగా ఏపీసీఎం హోదాలో చంద్ర‌బాబు చేస్తున్న బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నాయి. ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ ఆయ‌న‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. అదే స‌మ‌యంలో ఐబీ చీఫ్ ఆయ‌న‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఇలాంటి వ్య‌వ‌హారాల‌కు తోడు చంద్ర‌బాబుని వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తేలేద‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. సీఎం త్వ‌ర‌లోనే ఇరుక్కుంటార‌ని ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు ప్ర‌చారం ప్రారంభించారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌నే పీల‌ర్లు వ‌దులుతున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. త‌న మీద దాడి జ‌రుగుతోంద‌ని స్వ‌యంగా చంద్ర‌బాబు చెబుతున్నారు. అంటే సీఎంగా ఆయ‌న మీద దాడి ఎలాంటిద‌న్న‌ది స్ప‌ష్టం చేయ‌క‌పోయినా ఆయ‌న ఆ వెంట‌నే చెప్పిన మాట‌లు దానికి కొన‌సాగింపుగానే భావించాలి. కేసులు పెట్టి బెదిరించాల‌ని చూస్తే తమిళనాడులో సాధ్యం అవుతుంది గానీ ఏపీలో కాద‌ని ఆయ‌న తేల్చేశారు. అంటే కేంద్రంలో మోడీ ప్ర‌భుత్వం కేసుల‌తో బ్లాక్ మెయిల్ చేస్తుందంటున్న చంద్ర‌బాబు త‌న మీద కేసులు పెడ‌తార‌నే ఆందోళ‌న‌లో ఉన్నారా అన్న ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. గ‌తంలోనే త‌న మీద 27 ఎంక్వైరీలు వేసి ఏమీ చేయ‌లేక‌పోయార‌ని, మోడీ అవినీతిప‌రుల‌తో క‌లిసి తిరుగుతున్నార‌ని, తాను అవినీతిని ప్ర‌క్షాళ‌న చేస్తున్నాన‌ని చెప్పుకున్నారు.

అదే స‌మ‌యంలో త‌న‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా ప్ర‌జ‌లంతా నిల‌వాల‌ని ఆయ‌న కోరుకుంటున్నారు. త‌న మీద దాడి అంటే అది తెలుగువారి ఆత్మ‌గౌర‌వం మీద దాడిగా భావించాలంటున్నారు. త‌ద్వారా కేంద్రం కేసులు పెడుతుంద‌ని, ద‌ర్యాప్తు సంస్థ‌లు రంగంలో దిగ‌బోతున్నాయ‌ని ఆయ‌న అంచ‌నాకు వ‌చ్చిన‌ట్టు ప‌లువురు అనుమానిస్తున్నారు. అందుకు కొన‌సాగింపుగానే అన్న‌ట్టుగా తొలిసారిగా య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు కూడా పెద‌వి విప్పారు. భ‌విష్య‌త్తు నేత నారా లోకేష్ అంటూ ప్ర‌క‌టించారు. నెంబ‌ర్ వ‌న్ లీడ‌ర్ గా గుర్తింపు పొందారంటూ కొనియాడారు. త‌ద్వారా తెలుగుదేశం రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర మార్పున‌కు రంగం సిద్ధం చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. చంద్ర‌బాబులో పెరుగుతున్న ఆందోళ‌న నేప‌థ్యంలో నారా లోకేష్ మీద య‌న‌మ‌ల ప్ర‌శంస‌న‌లు విశేషంగా మారాయి. మ‌రో నెల రోజుల నాటికి ఏపీ రాజ‌కీయాల్లో పెనుమార్పుల‌కు సంకేతంగా ఉన్నాయి.


Related News

ప్రశ్నార్థ‌కంగా ప‌వ‌న్ ప‌య‌నం?

Spread the loveరాజ‌కీయాలు శాశ్వ‌తం కాదు. రాజ‌కీయాల్లో శ‌త్రువులు, మిత్రులు కూడా శాశ్వ‌తంగా ఉండ‌రు. కానీ గ‌త ఏడాది మార్చిలోRead More

ష‌ర్మిళ మ‌ళ్లీ ఎందుకు బ‌య‌ట‌కొచ్చారు

Spread the loveవైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ సోద‌రి మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చారు. ఈసారి త‌న వ్య‌క్తిత్వం మీద జ‌రుగుతున్నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *