Main Menu

చంద్ర‌బాబు ఆశ‌ల‌పై ‘యుద్ధ’ మేఘాలు

Spread the love

సీన్ మారిపోతోంది. దేశ‌భ‌క్తి రాజుకుంటోంది. ఇండో పాక్ సంబంధాలు పూర్తిగా దెబ్బ‌తిన్నాయి. ఏకంగా ఒక‌రి ఉప‌రిత‌లం పై నుంచి మ‌రొక‌రు విమాన స‌ర్వీసులు కూడా నిలిపివేశారు. ఇరువైపులా క‌వ్వింపులు సాగుతున్నాయి. అధికారిక యుద్ధ ప్ర‌క‌ట‌న మాత్ర‌మే మిగిలింది. దాంతో రాజ‌కీయంగా పెను మార్పులు ఖాయ‌మ‌నే ప్ర‌చారం ఊపందుకుంది.

మ‌రో రెండు వారాల్లో సాధార‌ణ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు ముంగిట ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల‌తో అనూహ్య ప‌రిణామాలు ఖాయంగా చెబుతున్నారు. సాధార‌ణ ఎన్నిక‌లను వాయిదా వేసే ఆలోచ‌న కూడా మొద‌ల‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. అదే జ‌రిగితే చంద్ర‌బాబుకి చిక్కులు తప్ప‌వు. ముఖ్యంగా దేశ‌వ్యాప్తంగా యుద్ధ వాతావ‌ర‌ణం ఏర్ప‌డితే అది ఎవ‌రికీ మంచిది కాదు. కానీ రాజ‌కీయంగా చంద్ర‌బాబు మ‌రింత ఇబ్బందిక‌రంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

సాధార‌ణ ఎన్నిక‌లు వాయిదా ప‌డిన క్ర‌మంలో తాజాగా ఆయ‌న ప్ర‌క‌టించిన సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌భావం నీరుగారిపోతుంది. వివిధ వ‌ర్గాల‌కు ప్ర‌క‌టించిన తాయిలాల ప్ర‌భావం క‌నుమ‌రుగ‌వుతుంది. అందుకు తోడుగా కొన్ని ప‌థ‌కాల‌కు వాయిదా ప‌ద్ధ‌తుల మీద చేసిన కేటాయింపులు కొత్త క‌ష్టాల‌ను తీసుకొస్తాయి. ఓవైపు యుద్ధం కార‌ణంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయే ప్ర‌మాదం ఉంటుంది. అదే స‌మ‌యంలో అద‌న‌పు భారం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రెండింటి మ‌ధ్య చంద్ర‌బాబు స‌ర్కారు కొట్టిమిట్టాడాల్సిన ప‌రిస్థితి దాపురించ‌బోతోంద‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి.

అదే స‌మ‌యంలో మోడీ మీద గురిపెట్టి, బీజేపీ వ్య‌తిరేక‌త‌నే ప్ర‌ధాన అస్త్రంగా చేసుకుని, బీజేపీకి-వైసీపీకి బంధం ఉంద‌నే విష‌యాన్ని త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకోవాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌త్యేక హోదా మీద మాట మార్చి మ‌రీ ఈ విష‌యాన్ని అందిపుచ్చుకునేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. కానీ యుద్ధం కార‌ణంగా సీన్ మొత్తం మారిపోతోంది. మోడీ వ్య‌తిరేక‌త‌, హోదా వంటి అంశాలు పూర్తిగా ప‌క్క‌కు పోవ‌డం ఖాయంగా ఉంది. దేశం, సైన్యం వంటి అంశాల‌తో సాగే చ‌ర్చ‌ల్లో చంద్ర‌బాబు అస్త్రాలు ప‌దునుకోల్పోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

దాంతో తాజా ప‌రిణామాలు చంద్ర‌బాబు నెత్తిన పెద్ద గుదిబండ‌గా మారబోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఈ ప‌రిణామాల‌ను జీర్ణించుకోలేని ప‌రిస్థ‌ఙ‌తి వ‌స్తున్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబుకి మాత్రం జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మారుతున్న స‌మ‌యంలో మ‌రిన్ని చిక్కులు కొనితెచ్చిపెడుతున్న‌ట్టుగా స్ప‌ష్టం అవుతోంది. అదే స‌మ‌యంలో త‌న ద‌గ్గ‌ర ప‌రిష్కారం కూడా లేని ఇక్క‌ట్లోకి నెట్ట‌బ‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.


Related News

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the loveతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

నాన్న బాట‌లోనే జ‌గ‌న్!

Spread the loveవైఎస్ జ‌గ‌న్ కొత్త పంథాలో సాగారు. తండ్రి వైఎస్సార్ ని అనుస‌రించారు. అభ్య‌ర్థుల విష‌యంలో వైసీపీ జాబితాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *