బాబు ఆశలపై గుజరాత్ ఎఫెక్ట్

bjp-tdp
Spread the love

రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలు అనుకున్నట్టుగానే వచ్చాయి. కమలం వికాసం జరిగింది. మోడీకి గుజరాత్ లో కొన్ని ఆటంకాలు వచ్చినా నేటికీ ఆదరణ కనిపిస్తోంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ పట్టు నిలపుకుంది. గిరిజన ప్రాంతాల్లో హవా చాటింది. చివరకు అనుకున్నది సాధించి పీఠాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ఫలితాలు ఏపీ మీద తీవ్ర ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. అందులోనూ చంద్రబాబు ఆశలమీద గుజరాత్ నీళ్లు జల్లిందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

ఏపీలో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలు ఉన్నాయని చెప్పుకుంటూనే మరోవైపు కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్ ఫలితాల తర్వాత కమలనాధులు మరింతగా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా సోము వీర్రాజు కూడా మిత్రపక్షం గురించి అలాంటి వ్యాఖ్యలే చేశారు. తాజాగా ఫలితాల తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వ నిధులను సొంతంగా ప్రచారం చేసుకుంటూ మిత్రపక్షానికి తూట్లు పొడిచే ప్రయత్నం ఏపీలో సాగుతోందని వ్యాఖ్యానించడం విశేషం. ఇలాంటి మిత్రధర్మం సరైనది కాదని తెలిపారు. సొంతంగా పోటీ చేసే సామర్ధ్యం కూడా తమకు లేకపోలేదని కూడా జోస్యం చెప్పారు. ఈ రాష్ట్రంలో పరిపాలన చేయకుండా, ట్రేడింగ్ చేస్తున్న నేతలెవరో అందరికీ తెలుసని చంద్రబాబునుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేయడం గమనార్హంగా కనిపిస్తోంది. వైసీపీలో అవినీతిపరులున్నారని చెప్పి వారిని పార్టీలో చేర్చుకుని మంత్రులుగా చేస్తున్నెదవరంటూ చంద్రబాబుని ఆయన ప్రశ్నించడం ఆసక్తిగా మారింది. రాజకీయంగా ఏపీలో కూడా నిర్దేశించే స్థాయికి ఎదగడం ఖాయమని ఆయన తేల్చిచెప్పేయడంతో రాజకీయంగా కొత్త మార్పులకు సూచికగా మారింది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆశించినట్టుగా గుజరాత్ ఫలితాలు లేవని మాత్రం చెప్పవచ్చు. గుజరాత్ లో మోడీ ఓటమి పాలయితే దానిని ఉపయోగించుకుని తనకు పరిణామాలను అనుకూలంగా మార్చుకోవాలని ఆశించినట్టు ప్రచారం జరిగింది. కానీ తీరా చూస్తే అలాంటి ఆశాజనక వాతావరణం కనిపించకపోవడంతో ఇప్పుడు మోడీ మరింత దూకుడు పెంచే అవకాశం ఉండవచ్చంటున్నారు. అదే జరిగితే బాబుకి మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. పోలవరం, రాజదాని సహా అనేక అంశాలలో ఇప్పటికే చంద్రబాబు ఆశించిన దానికి భిన్నంగా స్పందిస్తున్న మోడీ నేత్రుత్వంలోని ప్రభుత్వం సహాయనిరాకరణకు సిద్దమవుతున్న నేపథ్యంలో చివరకు మిత్రపక్షం విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదనే వారు కూడా కనిపిస్తున్నారు. అదే జరిగితే తెలుగుదేశం , బీజేపీ బంధం మీద పెను ప్రభావం ఖాయం.






Related News

1515322707_mahesh-kathi-poonam-kaur-pawan-kalyan

కత్తి కథతో ఇరకాటంలో కాటమరాయుడు

Spread the loveఓ సినిమా క్రిటిక్ విమర్శలకు పవన్ ఫ్యాన్స్ స్పందించిన తీరు చివరకు చినికి చినికి గాలివానలా మారింది.Read More

andhra_pradesh_ysrcp_tdp_bjp1478362766

కాంగ్రెస్ తో చేతులు కలిపి మోడీకి షాకిచ్చిన టీడీపీ

Spread the loveతెలుగుదేశం పార్టీ షాకిచ్చింది. మోడీకి గట్టి ఝలక్ ఇచ్చింది. దాంతో కమలదళం కుతకుతలాడుతోంది. కాంగ్రెస్ తో చేతులుRead More

  • మళ్లీ పాత నినాదం అందుకుంటున్న టీడీపీ
  • జగన్ జీవితంలో కీలకంగా మారబోతున్న ఏడాది
  • రజనీకాంత్ రాణిస్తాడా?
  • వైసీపీ విఫలమవుతోంది..
  • బాబుకి బ్రేకప్ చెప్పాలనే తపనలో బీజేపీ
  • బాబు ఆశలపై గుజరాత్ ఎఫెక్ట్
  • బాబుపై కేటీఆర్: వెల్ కమ్ కాంబినేషన్
  • బాబుని మారిస్తేనే మోడీ కరుణ!
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *