బాబు పాల‌న‌లో పారిపోయిన వారి జాబితా..!

chandrababu-naidu-reliance-ambani-talk
Spread the love

ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌మ‌ర్థుడైన అడ్మినిస్ట్రేట‌ర్ అనే ప్ర‌చారం ఉంది. కానీ వాస్త‌వం దానికి త‌గ్గ‌ట్టుగా ఉందా అంటే సందేహ‌మే. ఎందుకంటే ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాలు గ‌మ‌నిస్తే చంద్ర‌బాబు పాల‌న‌లో ప‌లువురు ఉన్న‌త‌స్థానంలో ఉన్న వారు ఏపీ అంటే మొఖం చాటేసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ జాబితాలో అధికారులు, పారిశ్రామిక‌వేత్త‌లు స‌హా అనేక మంది ప్ర‌ముఖులున్నారు. ఉన్న‌త స్థాయిలో నైపుణ్యం ఉన్న వారు కూడా చంద్ర‌బాబు తీరుతో ఏపీ విడిచి వెళ్లిపోవ‌డం విచిత్రంగా క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు ప‌ద్ద‌తుల‌తో రాష్ట్రానికి దూరం కావ‌డం గ‌మ‌నిస్తే పాల‌నా ప‌ద్ధ‌తుల్లో ఎక్క‌డో వైఫ‌ల్యం ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఒక‌రిద్ద‌రు అలా చేసి ఉంటే ఆశ్చ‌ర్యం లేదు గానీ ప‌లువురు ప్ర‌ముఖులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అన‌గానే అమ్మో అనే ప‌రిస్థితి రావ‌డం ఆందోళ‌న‌క‌రంగా మారుతోంది.

ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన ప‌రిణామాలు, దూర‌మ‌యిన ప్ర‌ముఖుల‌ను గుర్తు చేసుకుంటే ఈ జాబితా చాలా పెద్ద‌దే ఉంటుంది. అందులోనే ప్ర‌ధాన‌మైన వారిలో కొంద‌రు..!

1) మెట్రొ ప్రాజెక్ట్ పితామహుడు శ్రీధ‌ర‌న్. ఢిల్లీ మెట్రో స‌హా దేశంలోనే పలు మెట్రో రైళ్ల‌కు ఆయ‌న ఆద్యుడు. ఇక ఏపీ ఆవిర్భావం త‌ర్వాత విజ‌య‌వాడ మెట్రో కోసం ఆయ‌న్ని రాష్ట్ర సలహా దారుడిగా నియ‌మించారు. శ్రీధ‌ర‌న్ రాక ఏపీకి ఎంతో మేలు చేస్తుంద‌ని చెప్పారు. కానీ రెండేళ్లు గ‌డిచేలోగానే ప్ర‌భుత్వ వైఖ‌రి స‌హించ‌లేని ఆయ‌న రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఏపీలో మెట్రో వ్య‌వ‌హారాల‌కు ఆయ‌న రాం రాం చెప్పేశారు.

2) ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శిగానే కాకుండా ప‌లు ఉన్న‌త స్థానాల్లో వివాదాల‌కు తావులేకుండా ప‌నిచేసిన ఐవైఆర్ కృష్ణారావు రిటైర్మెంట్ త‌ర్వాత ఆయ‌న‌కు ప్ర‌భుత్వం బ్రాహ్మ‌ణ కార్పోరేష‌న్ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఆయ‌న కూడా ఏడాదిన్న‌ర‌కే బాబు ధోర‌ణితో విసుగెత్తారు. సోష‌ల్ మీడియాలో సీఎంకి వ్య‌తిరేక పోస్టుల‌తో క‌ల‌క‌లం రేపారు. చివ‌ర‌కు హ‌ఠాత్తుగా విధుల నుంచి వైదొలిగే ప‌రిస్థితి తెచ్చుకున్నారు.

3) అదే రీతిలో ఏపీ విభ‌జ‌న త‌ర్వాత ఐ.ఏ.యస్ అధికారిగా ఉన్న గిరిధర్ అర్మాణి కూడా ఒక్క ఏడాదికే సెంట్ర‌ల్ స‌ర్వీసుల‌కు డిప్యుటేష‌న్ పై వెళ్లిపోవ‌డం చాలామందిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఐఏఎస్ అధికారుల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.

4) ఆర్థిక శాఖ స‌ల‌హాదారు సీ.యస్ రావు కూడా రాజీనామా చేసి త‌న బాధ్య‌త‌ల నుంచి వైదొలిగారు. ఆయ‌న కొన‌సాగాల‌ని కోరినా స‌సేమీరా అంటూ సెల‌వు తీసుకోవ‌డం విశేషం.

5) సీనీయ‌ర్ ఐఏఎస్ అధికారి పీకే అగ‌ర్వాల్ కూడా అదే దారి బ‌ట్టారు. ఆయ‌న కూడా నీరు చెట్టు ప‌థ‌కంలో కీల‌క‌బాధ్య‌త‌ల్లో ఉండి అనూహ్యంగా వైదొలిగిపోవ‌డం విస్మ‌య‌క‌లిగించింది.

6) ఇక రాజ‌ధాని న‌గ‌ర నిర్మాణంలో భాగ‌స్వామిగా చంద్ర‌బాబు ప‌రిచ‌యం చేసిన మాకీ సంస్థ కూడా ఆయ‌న తీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. చివ‌ర‌కు కేంద్రానికి లేఖ రాసి బాబు ని తీవ్రంగా నిందించింది. చివ‌ర‌కు ఏపీ క‌న్నా బీహార్ మేలు అంటూ ఆ సంస్థ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

7) ఇదే స‌మ‌యంలో ఏపీలోని రెండు కీల‌క ప్రాజెక్టుల‌ను అనిల్ అంబానీ సార‌ద్యంలోని రిల‌యెన్స్ సంస్థ విర‌మించుకోవ‌డం ఆశ్చ‌ర్య‌మే అయినా వాస్త‌వం. తూగో జిల్లా సామ‌ర్ల‌కోట‌లోని రిల‌య‌న్స్ ప‌వ‌ర్ ప్లాంట్ ను బంగ్లాదేశ్ త‌ర‌లించుకుపోతున్నారు. రెండోది అచ్యుతాపురం ఎస్ఈజెడ్ స‌మీపంలో ఏర్పాటు చేయాల‌నుకున్న ప్రాజెక్ట్ ను కూడా విర‌మించుకున్నారు. అది కూడా ఏపీ ప్ర‌భుత్వం తాము ఆశించిన రీతిలో స్పందించ‌డం లేద‌నే కార‌ణం చెప్పి మ‌రీ విర‌మించుకోవ‌డం విశేషం.

ఇలా అనేక ప‌రిణామాలు, ప లువురు ప్ర‌ముఖులు ఏపీని వీడిపోతున్న త‌రుణంలో బాబు పాల‌నాతీరు సందేహంగా క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు అడ్మినిస్ట్రేట‌ర్ అనేది ఒట్టి భ్ర‌మేనా అన్న అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది.


Related News

tdp mps meeting

టీడీపీలో రాజ్య‌స‌భ లొల్లి…

Spread the loveఏపీలో మారిన రాజ‌కీయ ప‌రిణామాల‌తో వ‌చ్చే రాజ్య‌స‌భ ఎన్నిక‌లు ఆస‌క్తిగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం మూడు సీట్లు ఖాళీRead More

bjp

బీజేపీ ఎదురుదాడి ఫ‌లిస్తుందా…?

Spread the loveఏపీలో క‌మ‌ల‌నాధులు తీవ్రంగా క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. నాలుగేళ్ల క్రితం క‌ళ‌క‌ళ‌లాడిన క్యాంప్ ఇప్పుడు తీవ్రంగా క‌ల‌త చెందుతోంది. అస‌లుRead More

 • జ‌గ‌న్ వ్యూహాత్మ‌క అడుగులు..
 • గేరు మార్చిన జగన్
 • మో’ఢీ’ అంటున్న బాబు…ఏం జరగబోతోంది?
 • పవన్ పథకం పారుతుందా..
 • మోడీ ముందు మోకరిల్లిన తెలుగు ఎంపీలు
 • జగన్ ఇరుక్కుంటున్నట్టే
 • బాబుకి బూమరాంగ్ అయ్యింది…!
 • బాబు వద్దంటుంటే..జగన్ కావాలంటున్నారు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *