జగన్ జీవితంలో కీలకంగా మారబోతున్న ఏడాది

jagan yatra
Spread the love

ఏపీలో రాజకీయాలు ఎప్పుడు, ఎలా మారుతాయో ఊహించడం కష్టంగా ఉంటోంది. ఈరోజు ఒక పార్టీలో ఉన్న నేత, రేపు ఏపార్టీలో ఉంటాడో గ్యారంటీ కనిపించడం లేదు. అలాంటి రాజకీయ వాతావరణంలో అందరికన్నా విపక్ష నేత వైఎస్ జగన్ కి రాబోయే ఏడాది కాలం అత్యంత కీలకంగా మారింది. ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా సాగుతున్న ఆయనకు కలలు పండాలంటే దానికి తగ్గట్టుగా అడుగులు వేయాల్సి ఉంటుంది. అడుగులు ఏమాత్రం తడబడినా వైకుంఠపాళీలో పావుల మాదిరి ఆయన కోసం కాచుకుని కూర్చున్న వాళ్లు చాలామందే ఉన్నారు. ఇప్పటికే 2017లో ఆయన నిర్ణయాలు బూమరాంగ్ అయ్యాయి. వ్యక్తిగతంగా మంచి పేరు సాధిస్తున్నా, పార్టీ వ్యవస్థాగతంగా ఉన్న లోపాలతో వైసీపీ భవిష్యత్తు సందేహాలు కలిగిస్తోంది. దాంతో పార్టీ సంస్థాగతంగా సర్థుకోకుండా జగన్ సాధించగలిగేదేమీ ఉండదన్న వాస్తవం ఎంత త్వరగా తెలుసుకుంటే అంతగా మంచిది.

అందులోనూ 2017 అనుభవాలతో ఎన్నికల సంవత్సరం 2018లో పాఠాలతో కూడా నిర్ణయాలు తీసుకోకపోతే నిండా మునిగిపోతారు. ఇప్పటికే పార్టీ ఆవిర్భవించిన తొలి ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీని నడపడంలో పశ్చిమ బెంగాల్ నాయకురాలు మమతా బెనర్జీ తర్వాత వైఎస్ జగన్ ప్రతిపక్షలో నిలబడ్డారు. కానీ రెండోసారి కూడా పార్టీ అధికారంలోకి రాలేకపోతే ఇక మనుగడే ఉండదు. ఏదో పార్టీ చూసుకుని జగన్ జంప్ కావాల్సిందే తప్ప వైసీపీని నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. అందుకో వచ్చే ఎన్నికలు దాదాపు చావోరేవో తంతే. అదే సమయంలో ఎన్నికల ముందు కాలమంతా ఆయనకు అత్యంత కీలకమైనదిగా చెప్పవచ్చు.

పాదయాత్ర పేరుతో జగన్ కొంత ప్రభావం చూపుతున్నారు. రాయలసీమ స్థాయిలో కాకపోయినా త్వరలో అడుగు పెట్టబోతున్న నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఢోకా లేదు. ఆ తర్వాత గుంటూరు నుంచి ఆయన యాత్ర అసలు ప్రభావం అర్థమవుతుంది. అయితే పాదయాత్ర ప్రభావం ఎలా ఉన్నప్పటికీ బూత్ ల ముందు ఓట్లు వేయించే నాయకుడు , దానికి తగ్గ నిర్మాణం లేనంత కాలం విపక్షానికి పూర్తి ధీమా కనిపించదు. టీడీపీకి బూత్ కమిటీల ద్వారా లభించిన బలం అంతా ఇంతా కాదు. విపక్షం కాబట్టి అంత అవకాశం లేకపోయినా ఏదో మేరకు కమిటీలు ఏర్పాటు చేయాలన్న స్ర్పుహ ఆ పార్టీ నేతల్లో కనిపించడం లేదు. నేటికీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు తప్ప మండల, గ్రామ, బూత్ లెవెల్లో కమిటీల ఊసే లేదు. అధినేత మీద ఆధారపడి నడుస్తున్న జనసేనకు కోఆర్డినేటర్లే ఉన్నారు…ఏడేళ్ల క్రితం ఆవిర్బవించిన పార్టీకి కోఆర్డినేటర్లే కనిపిస్తున్నారంటే ఆశ్చర్యం కలిగించకమానదు.

ఇప్పటికైనా జగన్ మేలుకోవాలి. బహిరంగసభలకు వస్తున్న జనం ఓట్లేయరు. అదే అనుకుంటే నంధ్యాలలో బాబు మీటింగులు కన్నా జగన్ కి పది రెట్లు వచ్చారు. అయినా పరాజయం తప్పలేదు. పరిస్థితులు వేరయినా ఫలితాల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. అందుకే ప్రచార కార్యకలాపాల కన్నా ప్రజా సమస్యలపై కార్యాచరణ, పార్టీ నిర్మాణం అత్యవసరం. లేకుంటే ఆ తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా పెద్ద ఉపయోగం ఉండదు.


Related News

1515322707_mahesh-kathi-poonam-kaur-pawan-kalyan

కత్తి కథతో ఇరకాటంలో కాటమరాయుడు

Spread the loveఓ సినిమా క్రిటిక్ విమర్శలకు పవన్ ఫ్యాన్స్ స్పందించిన తీరు చివరకు చినికి చినికి గాలివానలా మారింది.Read More

andhra_pradesh_ysrcp_tdp_bjp1478362766

కాంగ్రెస్ తో చేతులు కలిపి మోడీకి షాకిచ్చిన టీడీపీ

Spread the loveతెలుగుదేశం పార్టీ షాకిచ్చింది. మోడీకి గట్టి ఝలక్ ఇచ్చింది. దాంతో కమలదళం కుతకుతలాడుతోంది. కాంగ్రెస్ తో చేతులుRead More

 • మళ్లీ పాత నినాదం అందుకుంటున్న టీడీపీ
 • జగన్ జీవితంలో కీలకంగా మారబోతున్న ఏడాది
 • రజనీకాంత్ రాణిస్తాడా?
 • వైసీపీ విఫలమవుతోంది..
 • బాబుకి బ్రేకప్ చెప్పాలనే తపనలో బీజేపీ
 • బాబు ఆశలపై గుజరాత్ ఎఫెక్ట్
 • బాబుపై కేటీఆర్: వెల్ కమ్ కాంబినేషన్
 • బాబుని మారిస్తేనే మోడీ కరుణ!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *