Main Menu

ఏపీ పెట్టుబ‌డుల ప‌ర్వంలో అస‌లు గుట్టుర‌ట్టు

Spread the love

ఏపీలో పెట్టుబ‌డుల ప‌ర్వం సామాన్యంగా ఉండ‌దు. ఈ విష‌యం ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మ‌య్యింది. గ‌డిచిన ఇన్వెస్టిమెంట్స్ స‌మ్మిట్ లో ఎంవోయూలు కుదుర్చుకున్న వారి గురించి క‌థ‌లు క‌థ‌లుగా ప్ర‌చారం సాగింది. సాధార‌ణ వ్య‌క్తుల‌తో ఎంవోయూల పేరుతో విశాఖ సీఐఐ స‌ద‌స్సులో జ‌రిపిన భాగోతం గ‌తంలోనే బ‌ట్ట‌బ‌య‌లు అయ్యింది. దాంతో 10ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులుగా చేసిన ప్ర‌చారం ప‌టాపంచ‌లు అయ్యింది. స‌హ‌జంగా క‌నీసంగా 15శాతం అయినా గ్రౌండ్ కావాల్సిన ప‌రిశ్ర‌మ‌లు భూత‌ద్దం పెట్టి వెదికినా క‌నిపించ‌ని దాఖ‌లాలున్నాయి. ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కార‌మే చూసినా ఏడెనిమిది శాతం దాట‌డం లేదు. వాస్త‌వాలు మ‌రింత చేదుగా ఉండ‌వ‌చ్చు.

అర్భాట‌పు ప్ర‌చారాల గ‌త స‌మ్మిట్ సంగ‌తి అలా ఉంచితే తాజాగా మ‌రోసారి పెట్టుబ‌డుల స‌ద‌స్సు పేరుతో హంగామా న‌డుస్తోంది. మూడు రోజుల స‌ద‌స్సుకి స‌న్ రైజ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆహ్వానం అంటూ మీడియాలో హ‌ల్ చ‌ల్ సాగుతోంది. కానీ అస‌లు పెట్టుబ‌డుల సంగ‌తి మాత్రం క‌ట్టుక‌థ‌లుగా తేలిపోతోంది. తాజాగా వెలుగు చూసిన ఈ వ్య‌వ‌హారం గ‌మ‌నిస్తే మీరు కూడా అంగీక‌రించ‌క త‌ప్ప‌దు. ఎస్ఆర్ఎం యూనివ‌ర్సిటీ యాజ‌మాన్యం అమ‌రావ‌తిలో క్యాంప‌స్ ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌భుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. దాంతో స‌ద‌రు సంస్థ ద్వారా రాజ‌ధానిలో పెట్టుబడులు వ‌స్తాయ‌ని ఆశించ‌డంలో త‌ప్పులేదు. కానీ ఎంవోయూల వెనుక అస‌లు ర‌హ‌స్యం ఇక్క‌డే ఉంది. సీఆర్డీయేతో ఎస్ఆర్ఎం వాళ్లు కుదుర్చుకున్న ఎంవోయూ ని మ‌రోచోట పొందుప‌రిచి రెండు సార్లు ఒకే సంస్థ ఎంవోయూ కుదుర్చుకున్న‌ట్టు లెక్క‌లు పెంచుకోడానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించ‌డం అప‌హాస్యం పాల‌వుతోంది.

3300కోట్ల పెట్టుబ‌డుల‌తో ఎస్ఆర్ఎం సంస్థ 5వేల మందికి ఉపాధి ల‌భిస్తుంద‌ని చెబుతూ సీఆర్డీయేతో ఎంవోయూ కుదిరింది. కానీ అదే సంస్థ ఉన్న‌త విద్యాశాఖ‌తో మ‌రోచోట ఎంవోయూ కుదుర్చుకున్న‌ట్టు లెక్క‌లు కొంచెం అటూ ఇటూ మార్చి రాయ‌డ‌మే విచిత్రంగా ఉంది. ఉన్న‌త విద్యాశాఖ ప‌రిధిలోనే యూనివ‌ర్సిటీ వ‌స్తుంది కాబ‌ట్టి అమ‌రావ‌తిలో పెట్టే పెట్టుబ‌డుల‌ను అటు సీఆర్డీయే ఖాతాలోనూ, ఇటు ఉన్న‌త విద్యాశాఖ ఖాతాలోనూ రాయ‌డం ద్వారా లెక్క‌ల్లో పెద్ద తిర‌కాసు వ్య‌వ‌హారం సాగిస్తున్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. ఒక్క ఎస్ఆర్ఎం మాత్ర‌మే అనుకుంటే అనుకోకుండా డ‌బుల్ ఎంట్రీ అయి ఉంటుంద‌ని భావింవ‌చ్చు. కానీ దానికి కొన‌సాగింపుగా అన్న‌ట్టుగా వీఐటీ అనే సంస్థ కూడా సీఆర్డీయేతోనూ ఉన్న‌త విద్యాశాఖ‌తోనూ రెండు చోట్ల ఎంవోయూల కుదుర్చుకున్న‌ట్టు లెక్క‌ల్లో క‌నిపిస్తోంది. పైగా 3700 కోట్ల‌తో సీఆర్డీయేతోనూ, 3707 కోట్ల‌తో ఉన్న‌త విద్యాశాఖ‌తో ఎంవోయూ అని చెప్ప‌డం విస్మ‌య‌క‌రంగా ఉంది.
28276423_10215579940041939_6521441902227820700_n

ఇలాంటి వ్య‌వ‌హారాల‌తో ప్ర‌చారం కోసం ఏపీ ప్ర‌భుత్వం ప‌రిత‌పిస్తుంద‌న్న వాస్త‌వం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీని మూలంగా చంద్ర‌బాబు నిర్వ‌హిస్తున్న స‌మ్మిట్ల‌కు ఆర్భాటం ఎక్కువ‌, అస‌లు ప్ర‌యోజ‌నం త‌క్కువ అనే అభిప్రాయానికి బ‌లం చేకూరుతోంది. క‌నీసం గ‌డిచిన ఏడాది అనుభ‌వాల త‌ర్వాత ఈ ఏడాద‌యినా పాఠాలు నేర్చుకుని ఎంవోయూల విష‌యంలో కొంత ప‌క్కాగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని ఆశించిన వాళ్ల‌కు ఈ ప‌రిణామాలు కొంత నిరాశ‌క‌లిగించేలా ఉన్నాయి. చంద్ర‌బాబు తీరుతో ఏపీ న‌వ్వుల పాల‌వుతోంద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది.

28167999_10215579939601928_7682626768911636334_n


Related News

బాబుకి కాలు అడ్డుపెడుతున్న కేసీఆర్!

Spread the loveతెలంగాణాలో వ‌ర‌సుగా రెండోసారి విజయం ద‌క్క‌డంతో కారు పార్టీ అధినేత ఉత్సాహం రెట్టింప‌య్యింది. ఎన్న‌డూ లేనంత జోష్Read More

మ‌రో మెగాబ్ర‌ద‌ర్ పొలిటిక‌ల్ ఎంట్రీ క్లియ‌ర్

Spread the loveమెగాస్టార్ చిరంజీవి సినిమా రంగంలో చ‌రిత్ర సృష్టించారు. ఆయ‌న్ని అనుస‌రిస్తూ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ టాలీవుడ్ లో ఎంట్రీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *