Main Menu

జ‌గ‌న్ కాల్పుల‌పై కేంద్రీక‌ర‌ణ‌..!

jagan
Spread the love

నంద్యాల ఉప ఎన్నిక‌ల బ‌హిరంగ‌స‌భ గ్రాండ్ స‌క్సెస్ అయ్యింది. కానీ దాని ప్ర‌భావం రాష్ట్ర‌మంతా ప‌డ‌కుండా అధికార‌ప‌క్షం వేసిన ఎత్తులు ఫ‌లిస్తున్న‌ట్టే క‌నిపిస్తున్నాయి. దానికి కార‌ణం ప్ర‌తిప‌క్ష నేత నోటిదురుసే కావ‌డం విశేషం. ఒక్క మాట నోరు జార‌డంతో దాని మీద కేంద్రీక‌రించిన అధికార‌ప‌క్షం పెద్ద‌స్థాయిలో ర‌చ్చ చేస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్సీ ని రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోవ‌డం ద్వారా త‌న మార్క్ రాజ‌కీయాలు చూపించిన జ‌గ‌న్ దూకుడు జ‌నంలోకి చేర‌కుండా టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. 21మంది ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకున్న‌ప్పుడు గానీ, చివ‌ర‌కు కోర్ట్ నోటీసులు ఇచ్చినా గానీ రాజీనామాల‌కు వెన‌కాడుతున్న చంద్ర‌బాబు తీరును బ‌హిరంగ‌స‌భ సాక్షిగా జ‌గ‌న్ ఎండ‌గ‌ట్టారు. కానీ ఆ విష‌యం ప్ర‌జ‌ల్లోకి
వెళ్ల‌కుండా టీడీపీ విశ్వ‌యత్నాలు చేస్తోంది. అదే క్ర‌మంలో జ‌గ‌న్ పై నైతిక దాడి సాగిస్తోంది. జ‌గ‌న్ , ఆయ‌న తండ్రి మీద సుదీర్ఘ‌కాలంగా ఉన్న ఫ్యాక్ష‌న్ ముద్ర ను మ‌రింత రాజేయాల‌ని చూస్తోంది. సీఎం కాక‌ముందు వైఎస్ మీద ఫ్యాక్ష‌న్ ముద్ర చాలాకాలం ప‌నిచేసింది. ఆత‌ర్వాత కూడా ఆయ‌న్ని బ‌ద్నాం చేయ‌డానికి విప‌క్షాలు అదే నింద‌లు వేసినా జ‌నం మాత్రం వాటిని ప‌క్క‌న పెట్టి వైఎస్ ను ఆద‌రించ‌డ‌డం విశేషం.

ఇక ఇప్పుడు వ‌ర్త‌మానంలో జ‌గ‌న్ కి, వైసీపీకి నంద్యాల‌లో ఆపూర్వ ఆద‌ర‌ణ ల‌భించింది. క‌నీవినీ ఎరుగని రీతిలో నంద్యాల స‌భ జ‌రిగింది. జ‌న‌సందోహంతో కిట‌కిట‌లాడిన స‌భ‌లో జ‌గ‌న్ స‌హా నేతలంతా ఓ రేంజ్ లో దాడి చేశారు. టీడీపీ నేత‌లు, విధానాల మీద దండెత్తారు. జ‌నం కూడా అదే స్థాయిలో స్వీక‌రించారు. ఓట‌ర్ల‌ను స‌భ సంపూర్ణంగా ఆక‌ట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో కంగారుప‌డిన అధికార‌ప‌క్షానికి జ‌గ‌న్ మాట‌ల సంద‌ర్బంలో చేసిన వ్యాఖ్య‌లు అవ‌కాశం క‌ల్పించాయి. టీడీపీ అనుకూల ప‌త్రిక‌ల్లో బ్యాన‌ర్ ఐటెమ్స్ గానూ, మీడియా హెడ్ లైన్స్ లోనూ ప‌దే ప‌దే ప్ర‌స్తావించ‌డం ద్వారా ప్ర‌జ‌లంద‌రి దృష్టి ఆ విష‌యం మీద మ‌ళ్లించే ప్ర‌య‌త్నం సాగుతోంది. దానికి తోడు టీడీపీ అధిష్టానం ఆదేశాల‌తో రాష్ట్ర‌మంతా త‌మ్ముళ్ళు రోడ్డెక్క‌డం, పీఎస్ లో ఫిర్యాదులు చేయ‌డం సాగిపోతోంది. ఈ నేప‌థ్యంలో గ‌తంలో చంద్ర‌బాబు అసెంబ్లీ సాక్షిగా అంతుచూస్తామ‌ని చెప్పిన మాట‌ల‌ను వైసీపీ నేత‌లు ప్ర‌స్తావిస్తున్నా ప్ర‌జ‌ల్లో మాత్రం కాల్పుల అంశ‌మే కేంద్ర‌స్థానంగా మారుతోంది. మొత్తంగా చంద్ర‌బాబు అండ్ కో అనేక అవ‌కాశాల కోసం ఎదురుచూసి చివ‌ర‌కు కాల్పుల సాయంతో గ‌ట్టెక్కాల‌న్న సంక‌ల్పంతో ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి ప్ర‌జ‌లు అంత త్వ‌ర‌గా ఈ వాద‌న‌ను అంగీక‌రిస్తారా అంటే అనుమాన‌మే.


Related News

ANNACANTEEN

అన్న క్యాంటీన్లు- అస‌లు మ‌త‌ల‌బు

Spread the loveఏపీలో ఎంతో అభివృద్ధి జ‌రిగింద‌ని, దేశ‌మ‌యితే ఎంతో అభివృద్ధి చెందుతోంద‌ని నేత‌లు అదే ప‌నిగా ప్ర‌చారార్భాటం చేస్తున్నRead More

tdp

వార‌సుల కోసం నేత‌ల పాట్లు

Spread the loveప్ర‌జాస్వామ్యంలో వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు కొద‌వ ఉండ‌డం లేదు. ప్ర‌ధాన పార్టీల‌న్నింటా అదే తంతు కనిపిస్తోంది. ఒక‌ప్పుడు కాంగ్రెస్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *