Main Menu

ప‌వ‌న్ చేతిలో చంద్ర‌బాబు భ‌విత‌వ్యం..!

Spread the love

ఏపీలో బ‌ల‌ప‌డాల‌ని బీజేపీ అనేక ర‌కాలుగా వ్యూహాలు ర‌చించింది. నాలుగేళ్లుగా ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. కానీ అవేమీ ఫ‌లించ‌లేదు. చివ‌ర‌కు ప్ర‌త్యేక హోదా సెంటిమెంట్ పుణ్యాన ఆపార్టీ ఒంట‌రి అయిపోయింది. ఏపీలో క‌మ‌ల‌ద‌ళం మీద సామాన్యులు సైతం చిర్రుబుర్రులాడుతున్నారు. మోడీ ప్ర‌భావం ప‌డిపోతున్న వేళ ఏపీలో సెంటిమెంట్ పెరుగుతుండ‌డంతో బీజేపీ శ్రేణుల‌కు ఎటూ పాలుపోని సందిగ్ధ స్థితి ఏర్ప‌డుతోంది. దాంతో ఈ స‌మ‌స్య నుంచి గ‌ట్టెక్క‌డానికి కొత్త ప‌థ‌కాలు వేస్తున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. దానికి అమిత్ షా ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌మావేశంలో కొన్ని సూచ‌న‌లు కూడా చేశార‌ని చెబుతున్నారు.

ఏపీలో బీజేపీ ఎంత‌గా అణిగిమ‌ణిగి ఉన్న‌ప్ప‌టికీ టీడీపీ మాత్రం త‌మ‌ను టార్గెట్ చేసిన‌ట్టు కాషాయి నేత‌లు భావిస్తున్నారు. చంద్ర‌బాబు వైఫ‌ల్యాల‌ను త‌మ మీద నెట్టి తాను గ‌ట్టెక్కే యోచ‌న‌లో ఉన్న‌ట్టు లెక్క‌లేస్తున్నారు. దాంతో టీడీపీ మీద ఎదురుదాడి ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్ స‌హా అనేక అస్త్రాల‌కు ప‌దునుపెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుకి వ్య‌తిరేకంగా క్యాంపెయిన్ ప్రారంభించాల‌నే యోచ‌న‌లో ఉన్నారు. మార్చి 5 నుంచి ప్రారంభ‌మ‌య్యే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో చంద్ర‌బాబు తీసుకునే విధానాల‌ను బ‌ట్టి త‌మ ఎత్తులు ఉంటాయ‌ని చెబుతున్నారు.

అదే స‌మ‌యంలో త‌మకు వెంట్రుక పోయిన‌ప్ప‌టికీ, టీడీపీకి మాత్రం బోడిగుండు త‌ప్ప‌ద‌ని బీజేపీ మంత్రి మాణిక్యాల‌రావు ఇప్ప‌టికే హెచ్చ‌రించారు. దానికి త‌గ్గ‌ట్టుగానే బాబుని ఒంట‌రి చేసే ఆలోచ‌న‌లో బీజేపీ ఉన్న‌ట్టు తాజా స‌మాచారం. త‌మ‌ను ఒంటరి చేసి ఇబ్బందులు పాలుజేయాల‌ని చూస్తున్న చంద్ర‌బాబుకి చెక్ పెట్ట‌డంలో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని త‌న‌వైపు తిప్పుకోవ‌డానికి పావులు క‌దుపుతోంది. దానికి ఏకంగా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టీడీపీ అనుకూల మీడియా స్వ‌రం ఆంధ్ర‌జ్యోతి చెబుతోంది. దాంతో ప‌వ‌న్ గునుక టీడీపీ నుంచి దూర‌మ‌య్యి బీజేపీ గూటికి చేరితే అది ఏపీలో చంద్ర‌బాబు ఆశ‌ల‌న్నీ అడియాశ‌లు చేస్తుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం నిల‌బెట్టుకోవాల‌నే ఆయ‌న కోరిక దాదాపుగా నీరుగారిపోతుంది. దాంతో ప‌వ‌న్ ని కాపాడుకోవాల‌ని భావిస్తున్న టీడీపీ ఆయ‌న‌తో నిత్యం స‌త్సంబంధాల కోసం ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప‌వ‌న్ కోసం ఇటు బీజేపీ, అటు టీడీపీ బ‌లంగా ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. దాంతో ఈ ఇద్ద‌రిలో ఎవ‌రి పంచ‌న ప‌వ‌న్ చేర‌తార‌న్నదాన్ని బ‌ట్టి ఏపీ రాజ‌కీయాల్లో స‌మీక‌ర‌ణాలు చాలా మార్పులుంటాయి. దాంతో ఇప్పుడు చంద్ర‌బాబు భ‌విత‌వ్యం దాదాపుగా ప‌వ‌న్ చేతుల్లో ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. ప‌వ‌న్ పూర్తిగా బాబు మీద దండెత్తే ప‌క్షంలో బీజేపీకి ప్ర‌ధాన ఆయుధం అవుతారు. క‌మ‌లం శిబిరం నుంచి అస్త్రాలు సంధిస్తే మాత్రం అనూహ్య ప‌రిణామాల‌కు అవ‌కాశం ఏర్ప‌డుతుంది.


Related News

బాబుకి కాలు అడ్డుపెడుతున్న కేసీఆర్!

Spread the loveతెలంగాణాలో వ‌ర‌సుగా రెండోసారి విజయం ద‌క్క‌డంతో కారు పార్టీ అధినేత ఉత్సాహం రెట్టింప‌య్యింది. ఎన్న‌డూ లేనంత జోష్Read More

మ‌రో మెగాబ్ర‌ద‌ర్ పొలిటిక‌ల్ ఎంట్రీ క్లియ‌ర్

Spread the loveమెగాస్టార్ చిరంజీవి సినిమా రంగంలో చ‌రిత్ర సృష్టించారు. ఆయ‌న్ని అనుస‌రిస్తూ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ టాలీవుడ్ లో ఎంట్రీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *