Main Menu

ఆ ఇద్ద‌రూ త‌ప్ప..అంద‌రితోనూ అంటున్న టీడీపీ

Spread the love

తెలుగుదేశం పొలిటిక‌ల్ లైన్ లో మార్పు ఖాయంగా క‌నిపిస్తోంది. మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌తో విధానాల‌లో స్ప‌ష్ట‌మైన మార్పులు ఖాయం అని భావిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో మోడీని ఢీ కొట్టాలంటే దేశవ్యాప్తంగా అనేక‌మంది మిత్రుల‌ను క‌లుపుకుని సాగాల‌ని ఆశిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగా ఎన్డీయే భాగ‌స్వాముల‌ను కూడా క‌లుపుకుపోవాల‌ని భావిస్తోంది. కేవ‌లం బీజేపీ, కాంగ్రెస్ మిన‌హా అన్ని పార్టీల‌తో క‌లిసి సాగుతామ‌ని చెబుతోంది. అయితే అంత‌ర్గ‌తంగా కాంగ్రెస్ తో స‌ఖ్య‌త‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

తాజాగా చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు అందుకు అనుగుణంగానే ఉన్నాయి. వైసీపీతో పొత్తు పెట్టుకున్నందువ‌ల్లే తాము ఎన్డీయేని వీడామ‌ని చంద్ర‌బాబు తేల్చిచెప్పేశారు. పైకి మాత్రం ఏపీకి హోదా, విభ‌జ‌న హామీలు అని చెప్పిన‌ప్ప‌టికీ రాజ‌కీయంగా త‌మ ప్ర‌త్య‌ర్థిని ప‌క్క‌న పెట్టుకోవ‌డంతో స‌హించలేక దూర‌మ‌య్యామ‌ని నేరుగా చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. దాంతో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల క‌న్నా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కార‌ణంగానే టీడీపీ ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం విదిత‌మ‌య్యిందని ప‌లువురు చెబుతున్నారు. అదే స‌మ‌యంలో అవినీతిక‌ర‌పార్టీని పంచ‌న చేర్చుకున్నార‌ని ఆరోపించిన చంద్ర‌బాబు వైసీపీతో పాటు బీజేపీని వ్య‌తిరేకించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు. రాష్ట్రంలో వైసీపీని, కేంద్రంలో బీజేపీని వ్య‌తిరేకించేవారంద‌రినీ స‌మీక‌రించాల‌నే ల‌క్ష్యంతో ఉన్న‌ట్టు ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

ప్ర‌స్తుత రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో చంద్ర‌బాబుకిది అంతం సులువు కాదు. ఇప్ప‌టికే అనేక కూట‌ముల‌కు సార‌ధిగా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు స‌మ‌యానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డింది. దాంతో తాజాగా ఢిల్లీ పార్ల‌మెంట్ లో కూడా ఆయ‌న‌తో భేటీ అయిన వారిలో శ‌ర‌ద్ ప‌వ‌ర్ త‌ప్ప కీల‌క నేత‌లు క‌నిపించ‌డం లేదు. ఫ‌రూఖ్ అబ్దుల్లాతో కూడా సెంట్ర‌ల్ హాల్ లో స‌మావేశం అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ప్ర‌భావం చాలా స్వ‌ల్పం. ఆ త‌ర్వాత డెరిక్ ఒబ్రెయిన్ , టీఎంసీ ఎంపీని కూడా క‌లిశారు. మ‌మ‌తాబెన‌ర్జీ కూడా తానే నాయ‌క‌త్వం వ‌హించాల‌నే ఆలోచ‌న‌తో ఉన్న‌ట్టు క‌నిపిస్తున్న త‌రుణంలో చంద్ర‌బాబుని క‌లిసి రావాల‌ని అంటుందే త‌ప్ప‌, తాను క‌లిసి వ‌స్తాన‌ని చెప్పే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే కేసీఆర్ కోల్ క‌తా వ‌ర‌కూ వెళ్లినా ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆమె మాట ప్ర‌స్తావించ‌క‌పోవ‌డానికి అదో కార‌ణంగా భావిస్తున్నారు. దాంతో చంద్ర‌బాబుకి ఇక క‌లిసొచ్చేదెవ‌ర‌నే సందేహాలున్నాయి. వామ‌ప‌క్షాలు చంద్ర‌బాబుతో ససేమీరా అంటున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ తో కూడా క‌లిసి కేంద్రంపై స‌మ‌రానికి వెళ్లాల‌ని ఇప్ప‌టికే టీడీపీలోని మెజార్టీ నిర్ణ‌యించిన‌ట్టు లీకులు వ‌చ్చాయి. దాంతో ఆ రెండు పార్టీలు మిన‌హా అంద‌రితోనూ ఏదో మేర‌కు స‌ఖ్య‌తగా క‌లిసి వెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.


Related News

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the loveతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

నాన్న బాట‌లోనే జ‌గ‌న్!

Spread the loveవైఎస్ జ‌గ‌న్ కొత్త పంథాలో సాగారు. తండ్రి వైఎస్సార్ ని అనుస‌రించారు. అభ్య‌ర్థుల విష‌యంలో వైసీపీ జాబితాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *