Main Menu

జ‌గ‌న్ క‌ట్ట‌డికి బాబు బ్ర‌హ్మాస్త్రం..!

Spread the love

ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు కొత్త వార్ ముదురుతోంది. ఇప్ప‌టికే హోరాహోరీగా త‌ల‌బ‌డుతున్న పాల‌క‌, ప్ర‌తిప‌క్షాల స‌మ‌రం కొత్త పుంత‌లు తొక్కుతోంది. అందులో భాగంగా వ్య‌వ‌హారం న్యాయ స్థానాల‌కు చేరుతోంది. గ‌తంలో జ‌గ‌న్ ని కోర్టుల సాయంతో క‌ట్ట‌డి చేసిన చంద్ర‌బాబు మ‌ళ్లీ అదే బ్ర‌హ్మాస్త్రం బ‌య‌ట‌కు తీస్తున్నారు. దానికి ప్ర‌తిగా జ‌గ‌న్ కూడా కేసులను ఆయుధంగా మ‌ల‌చుకుంటున్నారు. చంద్ర‌బాబును చిక్కుల్లో నెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పాత కేసులు తిర‌గ‌దోడాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తే..చంద్ర‌బాబు మీద ఉన్న కేసుల‌ను అస్త్రంగా చేసుకోవాల‌ని జ‌గ‌న్ ఆలోచిస్తున్నారు. దాంతో ఇరు వ‌ర్గాల వైరం న్యాయ‌స్థానాల ముందుకు చేరుతోంది.

జ‌గ‌న్ పై టీడీపీ నేత‌లు వేసిన కేసుకి తోడు ఆనాటి కాంగ్రెస్ కూడా చేతులు క‌ల‌ప‌డంతో వైఎస్సార్సీపీ నేత‌ను కొంత ఇర‌కాటంలో పెట్ట‌గ‌లిగారు. అయితే ఇప్పుడు అదే కేసుల అస్త్రం జ‌గ‌న్ ప్ర‌యోగిస్తుండ‌డంతో చంద్ర‌బాబుకి కొంత చికాకు క‌లుగుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఓటుకు నోటు వ్య‌వ‌హారం చంద్ర‌బాబుని చాలా బ‌ద్నాం చేసింది. చివ‌ర‌కు తెలంగాణా వ‌దులుకుని అమ‌రావ‌తికి వెళ్లాల్సి వ‌చ్చింది. అలాంటి కేసును లైవ్ లో ఉంచ‌డానికి వైఎస్సార్సీపీ చేస్తున్న ప్ర‌య‌త్నం టీడీపీ అధినేత‌కు త‌ల‌నొప్పిగా మారింది. ఇటీవ‌ల ఏసీబీ కోర్ట్ తీర్పు త‌ర్వాత స్క్వాష్ పిటీష‌న్ సాయంతో హైకోర్ట్ లో ఊర‌ట పొందిన‌ప్ప‌టికీ వ్య‌వ‌హారం సుప్రీంకోర్ట్ కి చేర్చ‌డానికి జ‌గ‌న్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేశారు. ఓటుకు నోటు కేసును వ‌దిలిపెట్టేది లేద‌ని ప్ర‌క‌టించేశారు.

దాంతో ఏం చేయాలో పాలుపోని చంద్ర‌బాబు మ‌రోసారి జ‌గ‌న్ కేసుల‌ను ముందుకు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. చంద్ర‌బాబుతో పాటు చిన‌బాబు కూడా ఇర‌కాటంలో ప‌డే ప్ర‌మాద‌మున్న ఓటుకు నోటు కేసు పున‌ర్విచార‌ణ జ‌ర‌గ‌డం శ్రేయ‌స్క‌రం కాద‌ని భావిస్తున్న త‌రుణంలో ఎదురుదాడికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. జ‌గ‌న్ కేసుల‌ను తిర‌గ‌దోడాల‌ని చూస్తున్నారు. తాజాగా చంద్ర‌బాబు అనుకూల మీడియా క‌థ‌నాలు, టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌లు గ‌మ‌నిస్తే జ‌గ‌న్ ని మ‌ళ్లీ కేసులు చుట్టూ తిప్పాల‌న్న ప్ర‌య‌త్నంలో టీడీపీ ఉన్న‌ట్టు ఇట్టే అర్థ‌మ‌వుతోంది. అయితే చంద్ర‌బాబు ఇప్ప‌టికే ప‌దే ప‌దే ఢిల్లీ స్థాయిలో చాలా ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ అవి ఇప్ప‌టి వ‌ర‌కూ ఫ‌లించ‌లేదు. జ‌గ‌న్ కేసును మ‌రింత క‌ట్టుదిట్టం చేయాల‌న్న ఆయ‌న ఆశ‌లు నెర‌వేర‌లేదు. పైగా ఇటీవ‌ల జ‌గ‌న్ కేసుల్లో ప‌లువురికి ఊర‌ట కూడా ల‌భించింది. ఏకంగా జ‌గ‌న్ కూడా త‌న‌కు కోర్టుకు హాజ‌రుకాకుండా మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరేంత వ‌ర‌కూ విష‌యం వెళ్లింది. అంటే కేసు కొంత ప‌ట్టు స‌డ‌లిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

తెర‌మీద సీబీఐ, ఈడీ హ‌డావిడి కూడా క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు మ‌ళ్లీ జ‌గ‌న్ కేసుల అంశంలో క‌ద‌లిక తీసుకురావాల‌ని ఎంతం ప్ర‌య‌త్నించినా ఫ‌లిస్తుందా అంటే సందేహ‌మే. హ‌స్తిన‌లో మోడీ ప్ర‌భుత్వానికి 2019 త‌ర్వాతి ప‌రిణామాల‌లో అంద‌రి అవ‌స‌రం ఉంటుందన్న లెక్క‌లున్నాయి. అందులోనూ ఏపీలో జ‌గ‌న్ కీల‌కంగా మారితే త‌మ‌కు మ‌రింత అవ‌స‌రం ఏర్ప‌డుతుంద‌న్న లెక్క‌లున్నాయి. దాంతో చంద్ర‌బాబు ఎంత‌గా ప్ర‌య‌త్నించినా, ఆయ‌న‌కు ఢిల్లీలో నాయుడు బ్ర‌ద‌ర్స్ నుంచి బ‌ల‌మైన మ‌ద్ధ‌తు ఉన్న‌ప్ప‌టికీ రాజ్ నాధ్ సింగ్, మోడీ వంటి వారి స‌హ‌కారం దొర‌క‌డం లేద‌ని స‌మాచారం. దాంతో ఇరు ప‌క్షాలు ఇప్పుడు కేసుల ఆధారంగా రాజ‌కీయాల‌కు తెర‌లేపుతున్న త‌రుణంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. తాజా పరిస్థితులు, టీడీపీ కొత్త వ్యూహం నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు మరింత వేడేక్కనున్నాయనేది విశ్లేషకుల మాట.


Related News

ప్రశ్నార్థ‌కంగా ప‌వ‌న్ ప‌య‌నం?

Spread the loveరాజ‌కీయాలు శాశ్వ‌తం కాదు. రాజ‌కీయాల్లో శ‌త్రువులు, మిత్రులు కూడా శాశ్వ‌తంగా ఉండ‌రు. కానీ గ‌త ఏడాది మార్చిలోRead More

ష‌ర్మిళ మ‌ళ్లీ ఎందుకు బ‌య‌ట‌కొచ్చారు

Spread the loveవైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ సోద‌రి మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చారు. ఈసారి త‌న వ్య‌క్తిత్వం మీద జ‌రుగుతున్నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *