Main Menu

జ‌గ‌న్, బాబు చుట్టూ ప‌వ‌న్?

Spread the love

ఎన్నిక‌ల ఏడాది ఆరంభంలోనే చంద్ర‌బాబు బౌన్స‌ర్ విసిరారు. విప‌క్ష క్యాంపులో క‌ల‌వ‌రం క‌లిగించారు. జ‌న‌సేన‌తో మ‌ళ్లీ క‌లిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామ‌నే సంకేతాలు ఇచ్చారు. ఇది రాజ‌కీయంగా ఎలాంటి ప్ర‌భావం చూపుతుంద‌నే దానిపై ప‌లు అబిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జ‌నసేన‌లో తీవ్ర గంద‌ర‌గోళాన్ని క‌లిగిస్తోంది. అందులోనూ ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించినట్టు ప‌వ‌న్ ప్ర‌క‌టించిన కొన్ని గంటల్లోనే చంద్ర‌బాబు ఇలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

జ‌న‌సేన శిబిరంలో ఏర్ప‌డిన గంద‌ర‌గోళం తొల‌గాలంటే త‌క్ష‌ణం ప‌వ‌న్ క‌ళ్యాన్ స్పందించాల్సి ఉంటుంది. లేకుంంటే గ‌తంలో తుని స‌భ‌లో చంద్ర‌బాబు కి ప‌ద‌వి కావాలనుకుంటే మ‌మ్మ‌ల్ని అడిగితే మ‌ద్ధ‌తు ఇచ్చేవాళ్లం కదా అంటూ జ‌న‌సేనాని చేసిన కామెంట్స్ కి, తాజాగా చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌కు మ‌ధ్య సంబంధంపై చ‌ర్చ పెరిగే అవ‌కాశం ఉంది. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి వ్య‌వ‌హారాలు చూస్తున్న లింగ‌మ‌నేని ర‌మేష్ సొంత భ‌వ‌నంలోనే చంద్ర‌బాబు నివాసం ఉంటున్న త‌రుణంలో వారి బంధానికి మ‌ళ్లీ భీజం ప‌డుతుంద‌నే సంకేతాలు వ‌స్తాయి.

జ‌న‌సేనాని ఇటీవ‌ల చంద్ర‌బాబు పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. లోకేష్ ని తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టారు. అలాంటి స‌మయంలో మ‌ళ్లీ టీడీపీతో చేతులు క‌లిపే అవ‌కాశం లేద‌ని జ‌న‌సైనికులు భావిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో టీడీపీ క్యాంపుతో తీవ్రంగా త‌ల‌ప‌డిన తాము మ‌ళ్లీ వారితో క‌లిసి వెళ్లేది లేద‌ని, తాము ఒంట‌రిగా వెళ‌తామ‌ని చెబుతున్నారు. నిన్న‌టి వ‌ర‌కూ మోడీ చెబుతున్న‌ట్టు ఆడుతున్నాడ‌ని ప‌వ‌న్ మీద విమ‌ర్శ‌లు చేసి, ఏకంగా బీజేపీలో పీ అంటే ప‌వ‌న్ అంటూ వ్యాఖ్యానించి ఇప్పుడు ప‌వ‌న్ తో క‌లిస్తే జ‌గ‌న్ కి నొప్పేంటి అన‌డం చంద్ర‌బాబు రాజ‌కీయ వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌గా అనుమానిస్తున్నారు. ప‌వ‌న్ మీద దాడి కోసం చంద్ర‌బాబు ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటార‌ని సందేహిస్తూనే, జ‌గ‌న్, ప‌వ‌న్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టు సందేహిస్తున్న టీడీపీ దానికి బ్రేకులు వేసేందుకే ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌నే వాద‌న కూడా లేక‌పోలేదు.

ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు ల‌క్ష్యంగా చంద్ర‌బాబు మాట‌లున్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇలాంటి అనేక అనుమానాలు ఇప్పుడు జ‌న‌సేన‌లో బ‌య‌లుదేర‌డానికి చంద్ర‌బాబు కార‌ణ‌మ‌య్యారు.త క్ష‌ణం వాటిని క్లారిఫై చేయ‌క‌పోతే చివ‌ర‌కు ప‌వ‌న్ మీద ప్ర‌జ‌ల్లో కూడా అపోహ‌లు పెరిగే ప్రమాదం ఉంది. అది జ‌న‌సేన అభిమానుల ఉత్సాహాన్ని నీరుగార్చ‌డం ఖాయం చేస్తుంది.


Related News

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the loveతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

నాన్న బాట‌లోనే జ‌గ‌న్!

Spread the loveవైఎస్ జ‌గ‌న్ కొత్త పంథాలో సాగారు. తండ్రి వైఎస్సార్ ని అనుస‌రించారు. అభ్య‌ర్థుల విష‌యంలో వైసీపీ జాబితాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *