Main Menu

బాబు ఎత్తుగ‌డ బూమ‌రాంగ్ అవుతోందా…?

Chandrababu-naidu-serious-on-media-houses
Spread the love

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఓ అడుగు వేశారు. రాజ‌కీయంగా కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. కేంద్ర ప్ర‌భుత్వ భాగ‌స్వామిగా ఉన్న ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇద్ద‌రు మంత్రుల‌తో రాజీనామాలు చేయించారు. అదే స‌మ‌యంలో ఇద్ద‌రు బీజేపీ మంత్రుల రాజీనామాలు కూడా ఆమోదం పొంద‌డంతో కేంద్రం, రాష్ట్రంలో భాగ‌స్వాములుగా ఉన్న బీజేపీ, టీడీపీ బంధం విడిపోయిన‌ట్టేన‌నే చ‌ర్చ మొద‌ల‌య్యింది. కానీ అనూహ్యంగా చంద్ర‌బాబు త‌న ఎత్తుల్లో కొత్త నిర్ణ‌యం ప్ర‌క‌టించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

ముఖ్యంగా ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినా గానీ పాల‌క కూట‌మి నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అంచెలంచెలుగా పోరాటం చేస్తున్నామ‌ని, కేంద్రం తీరు చూసి త‌దుప‌రి అడుగు తీసుకుంటామ‌ని చెబుతున్నారు. కానీ అది సామాన్యుల‌ను సంతృప్తి ప‌రుస్తుందా అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్యంగా బీజేపీ అన్యాయం చేసింద‌ని చెబుతూ ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వాళ్లు మ‌ళ్లీ అదే పార్టీ నేతృత్వంలోని కూట‌మిలో కొన‌సాగుతున్నామ‌ని చెప్ప‌డం వెనుక కార‌ణాలు చాలామందికి రుచించ‌డం లేదు. దాంతో చంద్ర‌బాబు ఎత్తులు ఫ‌లించ‌క‌పోగా బూమ‌రాంగ్ అవుతుందా అన్న చ‌ర్చ మొద‌ల‌య్యింది.

వాస్త‌వానికి చంద్ర‌బాబు రాజీనామాల అంశం ప్ర‌క‌టించ‌గానే దానికి నాలుగేళ్లు ప‌ట్టిందా అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. కానీ అదే స‌మ‌యంలో రాజీనామాల త‌ర్వాత మోడీకి దూరంగా జ‌రుగుతార‌ని అంతా భావిస్తే దానికి భిన్నంగా ఎన్డీయేలో తాను భాగ‌స్వామిగా ఉన్నామ‌ని చెప్ప‌డం విశేషంగా మారింది. అనేక‌మందిని విస్మ‌యానికి గురిచేస్తోంది. రాజీనామాల‌తో స‌రిపెట్టి కూట‌మి నుంచి బ‌య‌ట‌కు రాకుండా మోడీకి మ‌ద్ధ‌తు ఇవ్వ‌డం విచిత్రంగా ఉంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే రెండు జాతీయ పార్టీలు మోసం చేశాయ‌ని చెబుతూ అదే బీజేపీకూట‌మిలో కొన‌సాగుతున్నామ‌న‌డంలో సామాన్యుడికి రుచించ‌డం లేదు. దాంతో బాబు ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోగా అస‌లుకే ఎస‌రు అయ్యేలా క‌నిపిస్తోంది. 29 సార్లు ఢిల్లీ వెళ్లామ‌ని, అయినా ఖాత‌రు చేయ‌డం లేద‌ని, ఏపీ కి అన్యాయం జ‌రుగుతోంద‌ని చెబుతున్న చంద్ర‌బాబు రాజీనామాలతో స‌రిపెట్టి ఎన్డీయే నుంచి మ‌రో ద‌శ‌లో బ‌య‌ట‌కు వ‌స్తామ‌ని చెప్ప‌డం అనేక‌మందిలో టీడీపీ మీద అనుమానాలు పెంచుతోంది.






Related News

cbn

కోరి క‌ష్టాలు కొనితెచ్చుకోవ‌ద్దు బాబూ..!

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అనూహ్యంగా స్పందిస్తున్నారు. ఓ వైపు ఆయ‌న్ని వీరుడూ, శూరుడూ అంటూ ఓ వ‌ర్గం మీడియాRead More

ysrcp-party-flag-647x450

వైసీపీ సిట్టింగుల‌లో గెలిచేదెవ‌రు?

Spread the loveఎన్నిక‌ల వాతావ‌ర‌ణం స‌మీపిస్తోంది. మ‌రోసారి ముంద‌స్తు చ‌ర్చ మొద‌లుకావ‌డంతో అంద‌రి దృష్టి నియోజ‌క‌వ‌ర్గాల మీద ప‌డుతోంది. తాజాగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *