Main Menu

చంద్ర‌బాబు ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లిన నేత‌లు?

Spread the love

ఏపీ సీఎం చంద్ర‌బాబు భారీ ప్ర‌ణాళిక‌తో బ‌య‌లుదేరారు. దేశ ప్ర‌యోజ‌నాల కోస‌మే అని చెబుతూ వివిధ రాష్ట్రాల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు నేత‌ల‌ను క‌లిశారు. వారంతా చాలాకాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న వారే కావ‌డం కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. ఎన్డీయేలో ఉన్న‌వారిని బ‌య‌ట‌కు తీసుకొచ్చి త‌న అనుభ‌వ ఘ‌న‌తను చాటుకోవాలే త‌ప్ప‌, ఇప్ప‌టికే మోడీకి వ్య‌తిరేకంగా ఉన్నవారిని స‌మీక‌రిస్తున్నాన‌నే పేరుతో ప్ర‌చారం చేసుకోవ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

అయినా చంద్ర‌బాబు వాటిని ఖాత‌రు చేయ‌కుండా ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు తో పాటు తాజాగా ప‌శ్చిమ బెంగాల్ ప‌ర్య‌ట‌న కూడా ముగించారు. అదే స‌మ‌యంలో ఈ నెలాఖ‌రున అమ‌రావ‌తి కేంద్రంగా నాయ‌కులంద‌రినీ స‌మీక‌రించి పెద్ద కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టాల‌ని భావించారు. త‌ద్వారా జాతీయ స్థాయి నేత‌లంద‌రి మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్టిన ఘ‌న‌త చంద్రబాబుదేన‌ని చెప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. గ‌తంలో ఎన్టీఆర్ కూడా రాష్ట్రాల హ‌క్కుల పేరుతో ఆనాటి కాంగ్రెస్ పై చేసిన పోరాటంలో అంద‌రినీ క‌లుపుకుని పోవ‌డంతో భాగంగా హైద‌రాబాద్ లో ఉమ్మ‌డి స‌మావేశం నిర్వ‌హించారు.

అదే రీతిలో అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. ధ‌ర్మ‌దీక్ష‌ల పేరుతో మోడీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సాగిస్తున్న కార్య‌క్ర‌మాల ముగింపులో భాగంగా జాతీయ స్థాయిలో కీల‌క‌నేత‌లంద‌రినీ ఒకే వేదిక మీద‌కు తీసుకొచ్చే ఉద్దేశంతో సాగుతున్నారు. వాస్త‌వానికి చంద్ర‌బాబుకి సంబంధం లేకుండానే మోడీ వ్య‌తిరేక నేత‌లంతా గ‌త మే నెల‌లోనే క‌ర్ణాట‌క సీఎంగా కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మంలో క‌లుసుకున్నారు. బీజేపీ ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టి క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ మ‌ద్ధ‌తతో ప్ర‌భుత్వం ఏర్ప‌డిన స‌మ‌యంలో చేతులు క‌లిపారు

అయినా ఇప్పుడు చంద్ర‌బాబు రంగంలో దిగిన త‌ర్వాతే ఇదంతా జ‌రుగుతుంద‌నే ప్ర‌చారం మాత్రం మీడియాలో ఓ సెక్ష‌న్ జోరుగా సాగిస్తోంది. అయితే చంద్ర‌బాబు ఆశించిన రీతిలో నేత‌లంతా అమ‌రావ‌తి వ‌చ్చేందుకు మొగ్గు చూప‌క‌పోవ‌డంతో ఈనెలాఖ‌రులో ధ‌ర్మ‌పోరాట దీక్ష జాతీయ స్థాయి రాజ‌కీయాల‌కు వేదిక‌గా చేసుకోవాల‌నే ప్ర‌య‌త్నం బెడిసికొట్టింది. నేత‌లంతా ర‌క‌ర‌కాల కార‌ణాలు చెప్పి అమ‌రావ‌తికి మొఖం చాటేస్తున్న‌ట్టు గుర్తించిన చంద్ర‌బాబు చివ‌ర‌కు త‌న ప్ర‌య‌త్నాలు వాయిదా వేసుకున్నారు. అయితే ఎప్పుడు సాధ్య‌మ‌వుతుంద‌న్న‌ది ప్ర‌స్తుతానికి సందేహంగానే క‌నిపిస్తోంది. గ‌తంలో ఎన్టీఆర్ ఆనాటి కాంగ్రెస్ త‌ర్వాత అత్య‌ధిక స్థానాలు క‌లిగిన పార్టీ నేత‌గా గుర్తింపు సాధించ‌గా, ప్ర‌స్తుతం చంద్ర‌బాబుకి అలాంటి ప‌రిస్థితి లేదు. దాంతో బాబు నాయ‌క‌త్వానికి జాతీయ స్థాయిలో త‌గిన ఆద‌ర‌ణ ద‌క్క‌డం లేద‌న్న‌ది ఈ ప‌రిణామాలు అద్దంప‌డుతున్నాయ‌ని కొంద‌రు అనుమానిస్తున్నారు.


Related News

జ‌న‌సేనాని త‌న గోతిని తానే త‌వ్వుకున్న‌ట్టు!

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో అనూహ్య మార్పులు ఖాయం అన‌డంలో అనుమానం లేదు. అందుకు నిద‌ర్శ‌నంగానే తాజా ప‌రిణామాలున్నాయి. ముఖ్యంగాRead More

లేటెస్ట్ స‌ర్వే: పెరిగిన జ‌గ‌న్ గ్రాఫ్

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో విప‌క్ష హ‌వా పెరుగుతోంది. గ‌త రెండు మూడు నెల‌ల్లో కూడా జ‌గ‌న్ కి ఆద‌ర‌ణRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *