Main Menu

భార‌తి మూలంగా చంద్ర‌బాబు చేజారిన అస్త్రం

Spread the love

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ రాజ‌కీయాల్లో ఎవ‌రు అవున‌న్నా..కాదాన్న ప్ర‌త్యేక హోదా ప్ర‌భావం స్ప‌ష్టంగా ఉంటుంది. హోదా విష‌యంలో కేంద్రం తీరు మీద వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా ఉంటుంది. ఈ విష‌యాన్ని అంద‌రిక‌న్నా ముందు గ్ర‌హించింది విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్. దానికి త‌గ్గ‌ట్టుగానే జ‌గ‌న్ పావులు క‌దిపారు. యువ‌భేరీలు, ఆమ‌ర‌ణ‌దీక్ష‌లు సాగించారు. చివ‌ర‌కు విశాఖ‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ‌స‌భ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న ప్ర‌ధాన ఎజెండా ప్ర‌త్యేక హోదా అని రెండేళ్ల క్రిత‌మే ప్ర‌క‌టించేశారు. దాంతో చివ‌ర‌కు అన్ని పార్టీలు అనివార్యంగా అదే బాట‌ప‌ట్టాయి. చివ‌ర‌కు టీడీపీ కూడా ఎన్డీయే కూట‌మి నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి హోదా ఉద్య‌మం కార‌ణం అయ్యింది. జ‌న‌సేన కూడా ప్ర‌త్యేక హోదా మీద ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. ఇత‌ర పార్టీలు కూడా హోదా విష‌యంలో అటు బీజేపీని, ఇటు టీడీపీని త‌ప్పుబ‌డుతున్నాయి.

స‌రిగ్గా అదే స‌మ‌యంలో జ‌గ‌న్ ని కార్న‌ర్ చేసేందుకు చంద్ర‌బాబు బ్ర‌హ్మాస్త్రం ప్ర‌యోగించారు. ఓ వైపు ఏపీలో బీజేపీ ప‌ట్ల వ్య‌తిరేక‌త‌ను పెంచుతూనే, మ‌రోవైపు బీజేపీతో జ‌గ‌న్ లాలూచీ ప‌డ్డార‌నే ప్ర‌చారం జోరుగా సాగించారు. బీజేపీ లో జే అంటే జ‌గ‌న్ అంటూ కామెంట్ చేశారు. బీజేపీకి దత్త‌పుత్రుడు అంటూ కామెంట్ చేశారు. జ‌గ‌న్ తో పాటు ప‌వ‌న్ కూడా బీజేపీ చేతిలో పావులుగా మారి ఏపీ ప్ర‌యోజ‌నాల‌కు అడ్డుప‌డుతున్నారంటూ విమ‌ర్శించారు. ఈ ప్ర‌చారం ప్ర‌భావం ఓ మేర‌కు క‌నిపించింది. జ‌గ‌న్ కూడా మోడీ మీద విమ‌ర్శ‌లు చేయ‌డానికి వెన‌కాముందూ ఆడ‌డంతో టీడీపీకి అవ‌కాశంగా మారింది. కేంద్ర ప్ర‌భుత్వం మీద కామెంట్ చేయ‌డానికి వైసీపీ నేత‌లు సందేహించ‌డంతో పాల‌క టీడీపీకి పెద్ద అస్త్రంగా మారింది.

అయితే తాజాగా వైఎస్ భార‌తి కార‌ణంగా చంద్ర‌బాబు విమ‌ర్శ‌ల‌కు ఇప్పుడు విలువ త‌గ్గ‌బోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. జ‌గన్, బీజేపీ క‌లిసిపోతే ఏకంగా జ‌గ‌న్ భార్య కూడా కోర్టు గుమ్మం ఎక్కాల్సిన అవ‌స‌రం ఎందుకొస్తుంద‌నే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. బీజేపీతో క‌లిసి చంద్ర‌బాబు కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్ బ‌హిరంగ‌లేఖ‌లో పేర్కొన్నారు. ప‌గ‌లుకాంగ్రెస్ తో, రాత్రిళ్లు బీజేపీతో సంసారం చేస్తున్నారంటూ చంద్ర‌బాబు మీద మండిప‌డ్డారు. దాంతో ఇప్పుడు జ‌గ‌న్ భార్య కోర్టు బోనులో నిల‌వాల్సిన ప‌రిస్థితి వ‌స్తే సెంటిమెంట్ రీత్యా మ‌హిళను రోడ్డుకి లాగారంటూ టీడీపీ, బీజేపీ తీరు మీద ప్ర‌జ‌ల్లో చర్చ సాగే అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా బీజేపీ, జ‌గ‌న్ ఒకటేన‌నే బాబు వాద‌న‌కు బ‌లం లేకుండా పోతోంది. త‌ద్వారా ఓ ప్ర‌ధాన అస్త్రం చంద్ర‌బాబు చేజారిపోయిన‌ట్ట‌వుతుంది. రాజ‌కీయంగా జ‌గ‌న్ ని బ‌ద్నాం చేయ‌డానికి కీల‌క ఆదారం కోల్పోయిన‌ట్ట‌వుతుంది. రాజ‌కీయంగా ఇది తెలుగుదేశానికి కొంత మింగుడుప‌డ‌ని అంశంగానే భావించాలి. భార‌తితో పాటుగా అనిల్ కూడా కేసుల్లో ఇరికించాల‌ని టీడీపీ లేఖ‌లు రాస్తున్న త‌రుణంలో తాజా ఈడీ కేసులు ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క మార్పుల‌కు దోహ‌దం చేసే అవ‌కాశం ఉంది.


Related News

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the loveతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

నాన్న బాట‌లోనే జ‌గ‌న్!

Spread the loveవైఎస్ జ‌గ‌న్ కొత్త పంథాలో సాగారు. తండ్రి వైఎస్సార్ ని అనుస‌రించారు. అభ్య‌ర్థుల విష‌యంలో వైసీపీ జాబితాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *