చంద్రబాబుకిది సాహసమే…

chandra
Spread the love

ఏపీ సీఎం సాహసం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గా ఉన్నప్పటికీ అన్నింటికీ సిద్ధపడిపోతున్నారు. చిన్న చిన్న విషయాలను సమన్వయంతో సరిపెట్టకుండా తానే రంగంలో దిగుతున్నారు. దాంతో ఆయన తీరు ఆసక్తిగా మారుతోంది. ఆతర్వాత అసలు సమరంలో ఆయన పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేస్తున్న సాహసం చివరకు ఆయన్ని ఒడ్డుకి చేరుస్తుందా లేక సమస్యల సుడిగుండంలో నెడుతుందా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉంది.

వాస్తవానికి తెలంగాణాలో ఉప ఎన్నికలను గానీ, మున్సిపోల్స్ గానీ సీఎం కేసీఆర్ నేరుగా జోక్యం చేసుకోలేదు. కేవలం మంత్రాంగం తప్ప మిగిలిన బాధ్యతలన్నీ మంత్రులకే అప్పగించారు. కేటీఆర్ అయితే అన్నీ తానై వ్యవహరించి సానుకూలతను సొమ్ము చేసుకున్నారు. మంచి పలుకుపడి సాధించారు. కానీ ఏపీ సీఎం దానికి భిన్నం. నంద్యాల ఉపఎన్నికలను అలానే ఆయన పీలకమీదకు తెచ్చుకున్నారు. చివరకు నేరుగా రంగంలో దిగి చేతులు కాల్చుకున్నారా లేక గట్టెక్కేశారా అన్నది ఈవీఎంలు నిర్ణయించబోతున్నాయి.

ఇక ఇప్పుడు కాకినాడ ఎన్నికలకు కూడా చంద్రబాబు ప్రచారానికి సిద్ధపడడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అది కూడా ఏకంగా రెండు రోజుల పర్యటన పెట్టుకోవడం విశేషంగా మారింది. మునిసిపల్ కార్పోరేషన్ వంటి స్థానిక ఎన్నికల్లో సీఎం రెండు రోజులు పర్యటించడం, ఎన్నికల ప్రచారం చేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. చంద్రబాబు అంత అభద్రతా భావంతో ఉన్నారా అన్న అనుమానం కలిగిస్తోంది. విపక్ష నేత కూడా ఒక్కరోజు పర్యటిస్తున్నా కాకినాడలో చంద్రబాబు రెండు రోజులు టూర్ పెట్టుకోవడం గమనిస్తే టీడీపీ పరిస్తితి అర్థమవుతోందని చెబుతున్నారు.

పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని గ్రహించినందునే నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగాల్సి వచ్చినట్టు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఏమైనా చంద్రబాబు ఇలాంటి ఎన్నికల్లో కూడా వేలు పెట్టే పరిస్థితి ఉందంటే ఏపీలో అధికార పార్టీ వ్యవహారం అంత సలువుగా లేదని స్పష్టమవుతోంది.


Related News

Paripoornananda

రాజకీయ పరిపూర్ణం..!

Spread the love18Sharesతెలుగులో ఇప్పుడు కంచ ఐలయ్య, పరిపూర్ణానంద ఈ రెండు పేర్లే ప్రదానంగా వినిపిస్తున్నాయి. దానికి కారణం వీళ్లిద్దరూRead More

jagan

వైసీపీ చక్కదిద్దుకోలేకపోతే చిక్కులే..!

Spread the love2Sharesఏపీ రాజకీయాల్లో నంద్యాలకు ముందు..ఆ తర్వాత అన్నట్టుగా మారిపోయింది. నంద్యాల ఫలితాల ప్రభావంతో కాకినాడలో ఉన్న బలాన్నిRead More

 • డొల్ల జగన్ అనుకుంటే..బాబు గూట్లో ఉందట..
 • బాబుకి ఆ ఇద్దరిలో ఒక్కరే..!
 • పవన్ కల్యాణ్ గుడ్ బై
 • చంద్ర‌బాబుకి నో అంటున్న రాజ‌మౌళి
 • టీడీపీ అక్కడ కన్నేసింది..
 • జనసేన మీద నాగబాబు స్పందన
 • కాకినాడలో కొత్త సంకేతం: టీడీపీలో గుబులు
 • బాబూ..మీ మాటలు గానీ..!!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *