Main Menu

చంద్ర‌బాబుకి పొంచి ఉన్న గండం..!

chandrababu
Spread the love

ఏపీలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు పెను సంచ‌ల‌నంగా మార‌బోతున్నాయా..రాజ‌కీయంగా పెద్ద అగాథం సృష్టించ‌బోతున్నాయా.. రాష్ట్రంలో జ‌రుగుతున్న రెండు ఎన్నిక‌లు ఇప్పుడు ప్ర‌భుత్వ భ‌విష్య‌త్తును నిర్థేశించ‌బోతున్నాయా…ఫ‌లితాల‌ను బ‌ట్టి టీడీపీ ప‌రిస్థితి మున‌గ‌డమా తేల‌డమా అన్న‌ది నిర్ణ‌య‌మ‌వుతుందా.. చంద్ర‌బాబు కుర్చీ కింద‌కే నీళ్లు తీసుకొచ్చే ప‌రిణామాలు ఖాయ‌మా…ఇదే చ‌ర్చ సాగుతోంది. ఆస‌క్తిరేపుతోంది. నంద్యాల ఉప ఎన్నిక‌ల‌తో వేడి రాజుకుంద‌నుకుంటే కాకినాడ ఇప్పుడు అగ్నికి ఆజ్యం తోడ‌యిన‌ట్టుగా మారింది.

వాస్త‌వానికి ఈ రెండు ఎన్నిక‌లు టీడీపీ కోరుకున్న‌వి కాదు. ఇంకా సూటిగా చెప్పాలంటే రాకూడ‌ద‌ని కోరుకున్న‌వి. అయితే అనుకోకుండా భూమా నాగిరెడ్డి మ‌ర‌ణం నంద్యాల ఎన్నిక‌ల‌కు కార‌ణ‌మ‌యితే, కోర్టు తీర్పులు కాకినాడ మునిసిప‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల‌ను తెర‌మీద‌కు తెచ్చింది. నంద్యాల సిట్టింగ్ వైసీపీదే అయినా ఫిరాయింపు చేసి మ‌ర‌ణించేనాటికి టీడీపీలో ఉండ‌డంతో ఇప్పుడు చంద్ర‌బాబుకి ప‌రీక్ష‌గా మారింది. దానికితోడుగా కాకినాడ కార్పోరేష‌న్ కి ఏడేళ్ల త‌ర్వాత ఎన్నిక‌లు జ‌రుగుతున్న త‌రుణంలో అధికార పార్టీకి దానిని ద‌క్కించుకోవ‌డం అత్యంత కీల‌కంగా మారింది. నంద్యాల రాయ‌ల‌సీమ వాసుల అభిప్రాయాల‌కు ఉదాహ‌ర‌ణ‌గా చెబితే, కాకినాడ ను గోదావ‌రి జిల్లాల వాసుల మ‌నోభావాల‌కు అద్దంప‌డుతుంద‌ని ఆశిస్తున్నారు. మామూలు రోజుల్లో అయితే ఈ ఎన్నిక‌ల‌ను అంత సీరియ‌స్ గా తీసుకునే అవ‌కాశం లేదు. కానీ ఇప్పుడు రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ నువ్వా నేనా అన్న‌ట్టుగా అన్ని వ్య‌వ‌హారాల్లోనూ వ్య‌వ‌హ‌రిస్తున్న త‌రుణంలో ప్ర‌తీ ఎన్నికా కీల‌కం అయిపోయింది.

ఇక నంద్యాల‌లో 1999 త‌ర్వాత టీడీపీకి విజ‌యం ద‌క్క‌డం లేదు. వ‌రుస‌గా రెండు సార్లు కాంగ్రెస్ గెలిస్తే మూడోసారి వైసీపీ గెలిచింది. టీడీపీ విజ‌యం రుచి చూసి దాదాపుగా రెండు ద‌శాబ్దాలు కావస్తోంది. దాంతో క్యాడ‌ర్ కొర‌త తీవ్రంగా ఉంది. తాజాగా శిల్పా పార్టీ మారిపోవ‌డంతో టీడీపీకి కోలుకోని అంశంగా మారింది. వైసీపీ వైపు నంద్యాల ప‌రిణామాలు మొగ్గుచూపుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అదే రీతిలో కాకినాడ‌లో కూడా టీడీపీ గెలిచి చాలాకాల‌మే అయ్యింది. వ‌రుస‌గా రెండుమార్లు మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ, ఒకే ఒక్క‌సారి జ‌రిగిన కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ టీడీపీకి ఓట‌మి త‌ప్ప‌లేదు. అంటే చివ‌ర‌గా 1987లో మాత్ర‌మే టీడీపీ ఇక్క‌డ మునిసిపాలిటీని ద‌క్కించుకుంది. అదే స‌మ‌యంలో గ‌డిచిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీడీపీ వైపు నిల‌బ‌డిన గోదావ‌రి జిల్లా వాసుల అభిప్రాయాల‌ను కాకినాడ ఎన్నిక‌లు ప్ర‌స్ఫుటం చేస్తాయ‌ని భావిస్తున్న నేప‌థ్యంలో కాపులు, ఎస్సీలు ఇప్ప‌టికే టీడీపీకి దూరం కాగా, తాజాగా మేయ‌ర్ సీటును కాపుల‌కు కేటాయించ‌బోతున్న ప్ర‌క‌టించ‌డం బీసీల‌లో కూడా ఆగ్ర‌హం క‌లిగించింది. జిల్లాలో రెండు న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లు కాపుల‌కేనా అన్న ప్ర‌శ్న వారి నుంచి వినిపిస్తోంది. దాంతో టీడీపీకి ఈ ప‌రిణామాలు మింగుడుప‌డే అవ‌కాశం లేదు.

ఈ నేప‌థ్యంలో అటు నంద్యాల, ఇటు కాకినాడ‌లో కూడా తాజా అంచ‌నాల ప్ర‌కారం విప‌క్షానిదే పైచేయిగా క‌నిపిస్తోంది. దాంతో కాకినాడ ఎన్నిక‌ల వాయిదా కోసం టీడీపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. అది ఇప్ప‌టి వ‌ర‌కూ ఫ‌లించ‌లేదు. ఇక అనివార్యంగా ఎన్నిక‌లు జ‌ర‌పాల్సి వ‌స్తే రెండు చోట్ల ఓట‌మి భ‌యం అధికార పార్టీని వెంటాడుతోంది. ఒక‌సారి రెండు చోట్ల ఓట‌మి చ‌విచూడాల్సి వ‌స్తే ఇక టీడీపీ ఆశ‌లు వ‌దులుకోవాల్సిందేన‌నే వాద‌న వినిపిస్తోంది. అంటే టీడీపీకి ఇప్పుడు అగ్నిప‌రీక్ష అవుతోంది. ఎక్క‌డ తేడా వ‌చ్చినా నంద్యాల రాయ‌ల‌సీమ అని స‌రిపెట్టుకున్నా..కాకినాడ గోదావ‌రి జిల్లాల్లో గ‌డిచిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు గెలిచిన ప్రాంతం, కాబ‌ట్టి ఓట‌మి ఎదుర‌యితే మాత్రం ఇక టీడీపీ నావ మునిగిన‌ట్టేన‌ని అంచ‌నాలు పెరుగుతాయి. అలాంటి స‌మ‌యంలో టీడీపీని వీడిపోవ‌డానికి చాలామంది నేత‌లు సిద్ధ‌ప‌డ‌తార‌ని కూడా అంటున్నారు. అప్పుడు ప్ర‌భుత్వ‌మే ఇబ్బందులకు గురికావాల్సి వ‌స్తుంద‌ని అంచ‌నాలున్నాయి. చూద్దాం..చంద్ర‌బాబు మ‌రి ఎలా ఎదురీత‌లో నిల‌బ‌డ‌తారో..!!


Related News

ANNACANTEEN

అన్న క్యాంటీన్లు- అస‌లు మ‌త‌ల‌బు

Spread the loveఏపీలో ఎంతో అభివృద్ధి జ‌రిగింద‌ని, దేశ‌మ‌యితే ఎంతో అభివృద్ధి చెందుతోంద‌ని నేత‌లు అదే ప‌నిగా ప్ర‌చారార్భాటం చేస్తున్నRead More

tdp

వార‌సుల కోసం నేత‌ల పాట్లు

Spread the loveప్ర‌జాస్వామ్యంలో వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు కొద‌వ ఉండ‌డం లేదు. ప్ర‌ధాన పార్టీల‌న్నింటా అదే తంతు కనిపిస్తోంది. ఒక‌ప్పుడు కాంగ్రెస్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *