Main Menu

చంద్ర‌బాబులో విశ్వాసం పెంచుతున్న తెలంగాణా

Spread the love

ఏపీలో అధికార తెలుగుదేశం మ‌రోసారి పీఠం ద‌క్కించుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. అందుకు తెలంగాణా ఎన్నిక‌లు పునాది కావాల‌ని ఆశిస్తోంది. సొంత రాష్ట్రంలో ఉన్న ప్ర‌జావ్య‌తిరేక‌త‌ను అధిగ‌మించేందుకు తెలంగాణా వ్య‌వ‌హారాలు త‌న‌కు తోడ్ప‌డ‌తాయని చంద్ర‌బాబు ఆశిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే మ‌హాకూట‌మి పేరుతో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ తో చెలిమి చేస్తూ ప్ర‌చార‌ప‌ర్వంలో జోరు పెంచుతున్నారు.

వాస్త‌వానికి చంద్ర‌బాబు తొలుత తెలంగాణా ఎన్నిక‌ల ప‌ర్వానికి దూరంగా ఉండాల‌ని భావించారు. అత్య‌వ‌స‌ర‌మ‌యితే ఒక‌టి రెండు చోట్ల స‌భ‌ల‌లో పాల్గొని స‌రిపెట్టుకోవాల‌నే ఉద్దేశం వెలిబుచ్చారు. నేటికీ నారా లోకేష్ ని ఎన్నిక‌ల ప్ర‌చారానికి దూరంగా ఉంచ‌డానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. కానీ ప్ర‌స్తుతం చంద్ర‌బాబు త‌న స‌మ‌యాన్నంతా తెలంగాణాకే వెచ్చిస్తున్నారు. ఇప్ప‌టికే స‌భ‌లు , రోడ్ షోల‌తో ఒక రౌండ్ ప‌ర్య‌ట‌న చేసి ఇప్పుడు రెండోసారి ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చార గ‌డువు ముగిసే వ‌ర‌కూ తెలంగాణాలో కొన‌సాగే ఉద్దేశంతో ఉన్న‌ట్టు చెబుతున్నారు.

ఇటీవ‌ల తెలంగాణాలో ప‌రిణామాలు, తాజా స‌ర్వేలు మ‌హాకూట‌మికి అనుకూలంగా ఉండ‌డంతోనే చంద్ర‌బాబులో విశ్వాసం పెరిగిన‌ట్టు క‌నిపిస్తోంది. లగ‌డ‌పాటి స‌ర్వే కూడా స్ప‌ష్టంగా వెల్ల‌డించ‌క‌పోయిన‌ప్ప‌టికీ, ఏకంగా ఏబీఎన్ చానెల్ లో కూర్చోబెట్టి మాట్లాడించ‌డం ద్వారా మ‌హాకూట‌మికి సానుకూల సంకేతాలున్న‌ట్టు తేలిపోయింది. అంతేగాకుండా టీఆర్ఎస్ నేత‌లు ల‌గ‌డ‌పాటి మీద ఈసీకి ఫిర్యాదు చేయ‌డం వెనుక కార‌ణం కూడా అదేన‌ని భావిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారాల‌న్నీ క‌లిసి ఎన్నిక‌ల ఫ‌లితాలు అనుకూలంగా వ‌స్తే అదంతా త‌న‌దే ఘ‌న‌త‌గా చెప్పుకోవ‌డానికి చంద్ర‌బాబు చివ‌రి నిమిషంలో హ‌డావిడి చేస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. కాంగ్రెస్ నేత‌లు కూడా ప్రాధాన్య‌మిస్తుండ‌డంతో చంద్ర‌బాబు సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు సాగిస్తున్నారు. దాంతో తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాలు చంద్ర‌బాబు ఆశ‌ల‌ను ఏమేర‌కు నెర‌వేరుస్తాయ‌న్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.


Related News

జ‌న‌సేనాని త‌న గోతిని తానే త‌వ్వుకున్న‌ట్టు!

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో అనూహ్య మార్పులు ఖాయం అన‌డంలో అనుమానం లేదు. అందుకు నిద‌ర్శ‌నంగానే తాజా ప‌రిణామాలున్నాయి. ముఖ్యంగాRead More

లేటెస్ట్ స‌ర్వే: పెరిగిన జ‌గ‌న్ గ్రాఫ్

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో విప‌క్ష హ‌వా పెరుగుతోంది. గ‌త రెండు మూడు నెల‌ల్లో కూడా జ‌గ‌న్ కి ఆద‌ర‌ణRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *