టీడీపీని కలవరపెట్టబోతున్న కీలకాంశం

chandrababu
Spread the love

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన పట్టు నిలుపుకోవడానికి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరోసారి తన పార్టీని విజయతీరాలకు చేర్చాలని కంకణం కట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా రకరకాల ఎత్తులు వేస్తున్నారు. అనుభవాన్నంతా రంగరించి అడుగులు వేస్తున్నారు. బీజేపీతో పొత్తు విషయంలో స్పష్టత లేకపోవడం కొంత సమస్యగా ఉన్నప్పటికీ జనసేన నుంచి పూర్తి సహకారం ఖాయంగా తేలడంతో కుదుటపడుతున్నారు. ఇక ముందస్తు ఎన్నికలు, జమిలీ ఎన్నికలు అంటూ సాగుతున్న చర్చల నేపథ్యంలో పూర్తి సన్నాహాలు షురూ చేస్తున్నారు.

అయితే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకి ఓ అంశం మాత్రం తీవ్రంగా కలచివేతకు కారణంగా మారబోతోంది. ఇప్పటికే ఆయన సొంతంగా నిర్వహించిన సర్వేలలో కూడా ఇది ప్రస్ఫుటమయ్యింది. ఈ ఏడాది ఎన్నికలు జరిగితే జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆపార్టీకి భారీగానే సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి తప్పదు. అందులోనూ విశాఖ నుంచి గుంటూరు వరకూ సీట్లు కేటాయించడం అనివార్యం. అయితే పవన్ కళ్యాణ్ ఎలానూ చంద్రబాబు శిబిరంలో వ్యక్తిలానే వ్యవహరిస్తారు కాబట్టి, ఆయన రాజీపడడం ఖాయం. అది పెద్ద సమస్య కూడా కాబోదనే ధీమా టీడీపీ నేతల్లో ఉంది. కానీ అదే సమయంలో సిట్టింగుల మీద పెరుగుతున్న వ్యతిరేకత తీవ్రంగా కలవరపెడుతోంది. పరిష్కారం కూడా కనిపించకపోవడంతో అతి పెద్ద సమస్యగా మారిపోతోంది.

గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచిన వారితో పాటుగా వైసీపీ నుంచి 22 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపులు చేసి కండువాలు కప్పారు. దాంతో ప్రస్తుతం టీడీపీ కోటాలో 126 మంది ఎమ్మెల్యేలున్నారు. మరో నలుగురు బీజేపీలో ఉండగా, వారిలో ఒకరు దాదాపు టీడీపీ నాయకుడిగానే ఉన్నారు. దాంతో 127 మంది సిట్టింగులకు ఛాన్స్ విషయంలో చంద్రబాబుకి పెను సమస్యలు తప్పేలా లేవు. సిట్టింగులను తప్పించాల్సి వస్తే అది చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. తప్పించలేకపోతే ప్రజాగ్రహం తప్పడం లేదు. గడిచిన నాలుగేళ్లుగా సాగిస్తున్న ప్రచారం నేపథ్యంలో చాలా మంది సామాన్యులు కూడా చంద్రబాబు పట్ల కొంత సానుకూలత చూపుతున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యేలను మాత్రం అంగీకరించడం లేదు. అనేక సర్వేలలో ఇది ప్రస్ఫుటం అవుతోంది.

దాంతో అనివార్యంగా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చకుండా టీడీపీ గట్టెక్కే అవకాశం కనిపించడం లేదు. కానీ మార్చాల్సి వస్తే పలువురు ఎదురుతిరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే కొందరిని గుర్తించిన టీడీపీ, తమ అనుకూల పత్రికల ద్వారా ఆయా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కథనాలు రాయించే పని ప్రారంభించింది. తద్వారా వారి మీద పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత పెంచడం, వారిని దూరం పెట్టినా పార్టీకి నష్టం కలగకుండా చూసుకునే యత్నం ఉన్నట్టు కనిిపస్తోంది. కానీ అది ఏమేరకు ఫలిస్తుందన్నది చెప్పలేని విషయంగా ఉంది. దాంతో ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీని తీవ్రంగా ఇక్కట్లు పాలుజేసే అంశంగా మారబోతోందనే అంచనాలు పెరుగుతున్నాయి. చంద్రబాబుకి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారుస్తున్నాయనే అభిప్రాయం కూడా ఉంది. మరి ఎలా గట్టెక్కుతారో చూడాలి.


Related News

chandrababu naidu - PTI_1

తెగే వరకూ లాగితే చిరిగిపోతుంది బాబూ..!

Spread the loveకొన్ని వ్యవహారాలు అంతే. కక్కాలేక మింగాలేకా అన్నట్టుగా ఉంటాయి. తాజాగా టీటీడీ వివాదం కూడా అంతే. చంద్రబాబుRead More

tdp-bjp-fg647x450

బీజేపీకి ఒక నీతి, టీడీపీ, వైసీపీ మరో రీతి..

Spread the loveకర్ణాటకలో ఆశ్చర్యకర పరిణామాల నుంచి ఇంకా చాలామంది పూర్తిగా కోలుకోలేదు. అనూహ్యంగా బీజేపీ ప్రభుత్వం మూణ్ణాళ్లకే మూటRead More

 • బీజేపీ చారిత్రక తప్పిదం…!
 • చంద్రబాబు వెనకడుగు
 • బాబుకి మంట పెడుతున్న బీజేపీ
 • చంద్రబాబుకి శిక్ష తప్పదా..?
 • అవకాశాలు చేజార్చుకుంటున్న జగన్
 • అయోమయమా..అవగాహనా లోపమా?
 • చంద్ర‌బాబు ఆందోళ‌న చెందుతున్నారా?
 • ప‌వ‌న్ లో ప‌రిణ‌తి లేదా..?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *