చంద్రబాబు కి ఎంత కష్టమో?

Chandra-babu-naidu-with-modi
Spread the love

ఆయనే చెప్పుకున్నట్టు దేశంలోనే సీనియర్ నాయకుడు. అంతేనా ప్రధానమంత్రి కన్నా ఆయనే ముదురు. అంతేకాదు ఆయనో విజన్ ఉన్న నాయకుడు..సీఈవో..ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న పొలిటీషియన్. ఇవన్నీ ఆయన చెప్పుకున్నవే.. అయినా ఆయన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అందులోనూ ఆయనకు సొంత కుటుంబం నుంచే ఛీత్కారాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిత్రపక్షం బీజేపీ నేతలు చంద్రబాబుని దాదాపుగా చిన్నచూపు చూస్తున్నట్టే కనిపిస్తోంది. సీనియర్ అయినప్పటికీ కనీసం కూడా గౌరవం ఇస్తున్న దాఖలాలు లేవు. కనీసం పలకరింపుకోసమైనా దగ్గరకు రానివ్వడం లేదు. దాంతో చంద్రబాబు తీవ్రంగా సతమతం కావాల్సి వస్తోంది. కానీ ఏమీ చేయలేని స్థితిలో సర్థుకుపోవాల్సి వస్తోంది. అందుకే ఇలాంటి కష్టం ఏ నేతకు రాకూడదని పలువరు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకి మోడీ దగ్గర కనీస గౌరవం కూడా దక్కుతున్న దాఖలాలు లేవు. అనేక మార్లు బాబు హస్తిన వెళుతున్నా ఆయనకు మొఖం చూపించడానికి కూడా మోడీ విముఖత చూపుతున్నట్టు స్పష్ట వుతోంది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఓ ముఖ్యమంత్రికి అపాయింట్ మెంట్ దక్కడం లేదంటే ఆశ్చర్యమే అయినప్పటికీ అది వాస్తవం కావడంతో విస్మయకరంగా ఉంది. మోడీ చివరకు తనకు ప్రధాన ప్రత్యర్థులుగా భావించే సీపీఎం ముఖ్యమంత్రులతో కూడా సమావేశమయినప్పటికీ గడిచిన కొంతకాలంగా చంద్రబాబు పీఎంవో లో అడుగుపెట్టలేకపోయారు. ఆయన ఎంత ప్రయత్నించినా అపాయింట్ మెంట్ దొరకడం లేదనే ప్రచారం ఉంది. ముఖ్యమంత్రుల సమావేశం, ఇతర సందర్భాల్లో మోడీని కలవడం తప్ప గడిచిన ఏడాది కాలంగా చంద్రబాబు, మోడీ మధ్య ముఖాముఖీ సమావేశాలు లేవంటే ఆశ్చర్యపడాల్సి వస్తోంది.

అందులోనూ ఇరువురు మిత్రపక్షాల నేతలు, ఇరు ప్రభుత్వాల్లోనూ కొనసాగుతున్న పార్టీల నేతలే అయినప్పటికీ మరీ ఇంత దూరం పెట్టడం మోడీ కి చంద్రబాబు పట్ల అభిప్రాయానికి అద్దంపడుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కి కూడా మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదనే భావించాలి. గతంలో అనంతపురం సభలో తాను మోడీ అపాయింట్ మెంట్ కోరానని, రాగానే ఢిల్లీ వెళదామని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయినా జనసేనాని కూడా అది దక్కలేదు. అంటే బాబు, పీకేలను పక్కన పెట్టడం మోడీ ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అంతేగాకుండా ఈకాలంలో ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ తో ప్రత్యేకంగా సమావేశమయిన ప్రదాని, సీఎంని మాత్రం ఖాతరు చేయకపోవడం వెనుక పెద్ద కథే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయినా చంద్రబాబు నోరు తెరవలేని స్థితిలో ఉన్నారంటే ఆయనెంత ఉక్కిరిబిక్కిరి అవుతారో ఆలోచించవచ్చు. లోలోన తీవ్రంగా కలత చెందుతున్నట్టే భావించవచ్చు. కానీ ఏమీ అనలేని ఆయన స్థితికి ఆయనే కారణంగా విపక్షాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఓటుకు నోటు వ్యవహారం తర్వాత తెలంగాణా సీఎం కేసీఆర్ తో పాటు కేంద్రం పెద్దల ముందు కూడా బాబు పరువు యమునా నదిలో కలిసినట్టే భావించవచ్చని చెబుతున్నారు. దాంతో మోడీ లెక్కచేయకపోయినా బాబు ఏమీ చేయలేక సర్థుకుపోతున్నట్టు లెక్కిస్తున్నారు.


Related News

24-1443102383-ys-jagan-ramoji-rao-600

రామోజీ జగన్ రెండో భేటీ రహస్యం

Spread the loveఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలకు లోటు లేదు. తాజాగా వైఎస్ జగన్ మరోసారి రామోజీరావుని కలవడం చర్చనీయాంశంRead More

DMjD9f8VQAATMr7

అయినా..బాబు మారలేదు

Spread the loveమనిషి మారలేదు..అతని తనివి తీరలేదు అంటూ సినిమా దర్శకుడు రాసిన పాటను ఇక్కడ గుర్తు చేసుకుంటే చంద్రబాబుRead More

 • బాబు ఖాతాలో మరో వికెట్ అంతే…!
 • కేసీఆర్ వ్యూహం..బాబు జాతీయ హోదా గల్లంతు
 • వైసీపీ వ్యూహానికి బుట్టా బలి..
 • చంద్రబాబుకి ఓ ఇంటాయన లేఖ
 • మోడీకి మరో షాక్, దేశద్రోహులకు గ్రీన్ సిగ్నల్
 • కేసీఆర్ తో కేశవ్: కలచివేత ఎవరికి?
 • అమిత్ షా అవినీతికి ఆధారాలివిగో…
 • పవన్ కల్యాణ్ పొజిషన్ ఏంటి?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *